S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీసీలకు సామాజిక భద్రత కల్పించాలి

గుంటూరు, ఆగస్టు 30: దేశానికి స్వాతంత్య్రం లభించి 69 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ బిసిలకు సామాజిక భద్రత కరవైందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిమాండ్లను పరిష్కరించాలని బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈడె మురళీకృష్ణ డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట బిసి సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ దేశంలోని 70 కోట్లమంది బిసిలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇప్పటికీ కల్పించలేదన్నారు. ఉద్యోగులకు ప్రమోషన్లు అమలుచేయాలని, జడ్జిల నియామకాల్లో కూడా ప్రాధాన్యత కల్పించాలని కోరారు.

కోర్టులో కౌంటర్ ఫైల్ దాఖలు చేయండి

గుంటూరు, ఆగస్టు 30: జూట్‌మిల్లు అక్రమ లాకౌట్ నేపథ్యంలో అందులో పనిచేస్తున్న కార్మికులకు అన్యాయం జరక్కుండా కోర్టులో కౌంటర్‌ఫైల్ దాఖలు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి కార్మికశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఇన్‌చార్జి కమిషనర్‌తో కలసి వివిధశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూట్ మిల్లు స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్‌పై కోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, దీనిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేలా చూడాలన్నారు.

’అక్రమ మెమోలు చట్ట విరుద్ధమే‘

మాచర్ల, ఆగస్టు 30: అక్రమంగా ఇస్తున్న మెమోలు, షోకాజ్ నోటీసులు ట్రేడ్ యూనియన్ చట్టాలను కాలరాసే ప్రయత్నాలేనని అఖిల భారత అంగన్‌వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు అన్నారు. ఈనెల 2న చేపట్టనున్న సార్వత్రిక సమ్మెకు మద్దతుగా తాము సమ్మె చేస్తున్నట్లు మంగళవారం సీడీపీవో వెంకట రమణకు నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ అంగన్‌వాడి వర్కర్ల కనీస వేతనం రూ.20 వేలు, హెల్పర్లకు రూ.17వేలు ఇవ్వాలన్నారు. రిటైర్‌మెంటు వర్కర్‌కు రూ. 2 లక్షలు, ఆయాకు లక్ష గ్రాట్యుటీ ఇవ్వాలన్నారు. చివరి నెల జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

స్వర్గపురి అభివృద్ధిని పరిశీలించిన అమెరికా బృందం

సత్తెనపల్లి, ఆగస్టు 30: ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరామ్ బృందం నియోజవర్గంలో జరుగుతున్న స్వర్గపురి అభివృద్ధి పనులను మంగళవారం పరిశీలించారు. పిఆర్‌ఒ ప్రదీప్, పర్సనల్ కార్యదర్శి పిఎస్ కుమార్ కోడెల శివరామ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని లబ్బూరు, భట్లూరు గ్రామాల్లోని స్వర్గపురి, ఖబర్‌స్థాన్, పరదేశ శ్మశాన వాటికలను వారు పరిశీలించారు. ఈ తరహా అభివృద్ధిని రాష్ట్రంలోని వెయ్యి గ్రామాల్లో అమలు పరచడానికి వాటికి అయ్యే ఖర్చులు సర్పంచ్‌లతో మాట్లాడి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి వారు సంతృప్తి వ్యక్తం చేశారు.

చెత్త సేకరణకు మూడు చక్రాల బండ్ల పంపిణీ

మంగళగిరి, ఆగస్టు 30: స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళగిరి పురపాలక సంఘం పరిధిలో అన్ని వార్డుల్లో చెత్త సేకరణకు మూడు చక్రాల బండ్లను లక్షలాది రూపాయలు వెచ్చించి సమకూర్చారు. 32 వార్డులు ఉండగా ప్రతి వార్డుకు ఒకబండి, దానిపై తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరించేందుకు గాను రెండు ఎరుపురంగు డస్ట్‌బిన్‌లు, మరో రెండు బ్లూ కలర్ డస్ట్‌బిన్‌లు పెట్టుకుని వెళ్లేవిధంగా బండ్లు ఏర్పాట్లు చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో వీటిని ఆయా వార్డులకు అందచేసే కార్యక్రమంలో భాగంగా చైర్మన్ చిరంజీవి టెంకాయ కొట్టి ప్రారంభించారు. చేతికి గ్లౌజులు, ఎరుపురంగు జాకెట్టు, తలకు పచ్చని టోపీలు కూడా ఏర్పాటు చేశారు.

కసుకర్రు సర్పంచ్‌కు టిఎస్ సర్కార్ సత్కారం

పొన్నూరు, ఆగస్టు 30: ఎందరో క్రీడాకారులకు శిక్షణనిచ్చి క్రీడలలో ప్రోత్సహించి ప్రస్తుతం పొన్నూరు మండలం కసుకర్రు సర్పంచ్‌గా కొనసాగుతున్న జక్కా నాగ శ్రీనివాస వరప్రసాద్‌ను తెలంగాణ ప్రభుత్వం మెదక్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఘనంగా సత్కరించడం పట్ల ఈ ప్రాంతంలోని పలువురు ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు హర్షం తెలిపారు. జక్కా 2000 నుండి 2014 వరకు మెదక్ జిల్లాలోని పలు రెసిడెన్షియల్ స్కూళ్లలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేశారు. క్రీడలను ప్రోత్సహించడంతో పాటు జాతీయ క్రీడాకారులుగా కొందరు ఎదిగేందుకు సైతం ఆయన శిక్షణ ఇచ్చారు.

సార్వత్రిక సమ్మెకు సిపిఐ మద్దతు

గుంటూరు (కొత్తపేట), ఆగస్టు 30: కార్మిక, ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో వచ్చేనెల 2వ తేదీ నుంచి జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం కొత్తపేట సిపిఐ కార్యాలయం మల్లయ్యలింగం భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ అస్తిత్వాన్ని, ఆర్థిక, రాజకీయ, పారిశ్రామిక రంగాలను విదేశీ సంస్థలకు, కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోచిస్తున్నాయని ఆరోపించారు.

వేరుశెనగ పంట రక్షణకు చర్యలు

రాయచోటి, ఆగస్టు 29: జిల్లా వ్యాప్తంగా వేరుశెనగ పంట ఎక్కడా ఎండిపోకుండా రక్షిస్తామని కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో వేరుశనగ పంట ఎండకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విలేఖరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 15 మండలాల్లో 14 వేల హెక్టార్లలో వర్షాభావ పరిస్థితుల వల్ల వేరుశెనగ పంటకు ఇబ్బంది ఉందన్నారు. నీరు ఉన్న గొట్టపు బావుల ద్వారా 356 రెయిన్‌గన్లు, 524 స్ప్రింక్లర్ల ద్వారా పంటను రక్షించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి మూడు మండలాలకు ఒక ప్రత్యేకాధికారిని నియమించామన్నారు.

వినాయక చవితి, బక్రీదు ప్రశాంతంగా జరుపుకోవాలి

కడప,ఆగస్టు 29: వినాయకచవితి, బక్రీదు పండుగలను జిల్లా ప్రజలు ప్రశాంతవాతావరణంలో కులమతాలకు అతీతంగా జరుపుకోవాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ, ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణలు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సభాభవన్‌లో అధికారులు, అనధికారులతో, ప్రజా ప్రతినిధులతో జరిగిన సమావేశంలో వారుమాట్లాడారు. సెప్టెంబర్ 5న జరిగే వినాయక చవితి పండుగ పుస్కరించుకుని విగ్రహాలు మట్టితో తయారుచేసినవే ఉపయోగించాలని దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తమ వంతు కృషి చేయాలని పేర్కొన్నారు.

వేరుశెనగ పంటను పరిశీలించిన ఆర్డీఓ

చక్రాయపేట, ఆగస్టు 29: ఈ యేడాది ఖరీఫ్‌లో సాగు చేసిన వేరుశెనగ పంటలకు రెయిన్‌గన్ల ద్వారా నీరుఅందించాలని, ప్రతి ఒక్క రైతుకు ఆయిల్ ఇంజన్లు, రెయిన్ గన్లను అందజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్డీవో చినరాముడు పేర్కొన్నారు. సోమవారం నెరుసుపల్లె పంచాయతీ కొండప్పగారిపల్లె గ్రామంలో రెయిన్‌గన్ల ద్వారా వేరుశెనగ పంటను పరిశీలించారు. అనంతరం వేరుశెనగ చెట్టును ఊడలను పరిశీలించారు.

Pages