S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేరుశెనగ రైతులను ఆదుకుంటాం..

కంబదూరు, ఆగస్టు 30 : రక్షక తడులను అందించి వేర్జుఇనగ పంటలను కాపాడుతామని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కదిరి దేవరపల్లి, అండేపల్లి, గుత్తిరెడ్డిపల్లి, ఓబుగానిపల్లిలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెయిన్ గన్‌లను ఉపయోగించి వేరుశెనగ పంటను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బోరు బావులు ఉన్న రైతులు ఇతర రైతులకు రక్షకతడులు అందించేందుకు సహకరించాలని కోరారు. పది రోజుల ముందుగా రెయిన్‌గన్‌లను పంపిణీ చేయాల్సి ఉంన్నిందని రైతులు మంత్రిని కోరారు. కృష్ణా పుష్కరాల వల్ల సకాలంలో రైతులకు అందించలేకపోయామని, అయినప్పటికీ రక్షక తడులతో పంటలను కాపాడుతామన్నారు.

విపత్తుల నుంచి కాపాడేందుకు ప్రణాళిక

గుత్తి, ఆగస్టు 30 : రాయలసీమ జిల్లాలో నెలకొన్న కరవు, ఇతర విపత్తుల నుంచి రైతు, యువతను కాపాడేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జిల్లాలోని గుంతకల్లు, ఉరవకొండ నియోజక వర్గాలకు ఇన్‌చార్జిగా నియమించిన సందర్భంగా మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బి బంగ్లాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో తీవ్రమైన వర్షాభావం ఏర్పడిన దృష్ట్యా పంటలు ఎండిపోయిన పరిస్థితి నెలకొందన్నారు. విపత్కర పరిస్థితుల నుంచి రైతులను కాపాడేందుకు, జిల్లా నుండి సంపూర్ణంగా కదవును పారదోలేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు చేపట్టారన్నారు.

విద్యుదాఘాతంతో యువకుడి మృతి

ధర్మవరం రూరల్, ఆగస్టు 30 : మండలంలోని మల్లేనిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌తో రమేష్(23) మృతిచెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం రమేష్‌తో పాటు మరో నలుగురు యువకులు గ్రామానికి సమీపంలో ఉన్న పొలంలో విద్యుత్ వైరును లాగుతున్న సమయంలో వైరు పైభాగాన ఉన్న హైటెన్షన్ తీగలకు తగిలి ముగ్గురు యువకులకు షాక్ కొట్టింది. అయితే రమేష్‌కు అధికంగా విద్యుత్‌షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు రమేష్‌ను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా షాక్‌తో అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

జెఎన్‌టియుకె కళాశాలల్లో బయోమెట్రిక్ హాజరు

కాకినాడ సిటీ, ఆగస్టు 30: ప్రభుత్వ ఆదేశాలు మేరకు జెఎన్‌టియుకె పరిధిలోని అన్ని కళాశాలల్లో బయో మెట్రిక్ విధానాన్ని అమలుచేస్తున్నట్లు వర్శిటీ ఉపకులపతి ప్రొఫెసర్ విఎస్‌ఎస్ కుమార్ తెలియజేశారు. వర్శిటీ అలూనీ ఆడిటోరియమ్‌లో మంగళవారం ఆధార్‌తో కూడిన బయోమెట్రిక్ విధానంపై జెఎన్‌టియుకె అనుబంధ కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్, యూనివర్శిటీ కళాశాల ప్రిన్సిపాల్స్‌కు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ కుమార్ మాట్లాడుతూ బయోమెట్రిక్ విధానంలో వేలి ముద్రలు వేసే సమయంలో అక్రమాలు చేటుచేసుకునే అవకాశం ఉన్నందున వాటిని అరికట్టేందుకు ఆధార్ నెంబర్‌తో అనుసంధానం చేస్తున్నామన్నారు.

అరటి రైతులకు సిరుల పంట

రావులపాలెం, ఆగస్టు 30: గత ఏడాది రైతన్నకు కన్నీళ్లు మిగిల్చిన అరటి ఈ ఏడాది మాత్రం కాసులు కురిపిస్తోంది. సుమారు మూడు నెలలుగా రావులపాలెం అరటి మార్కెట్ యార్డులో వివిధ రకాల అరటి గెలల ధరలు క్రమేపి పెరుగుతూ వస్తున్నాయి. దీంతో రైతు కళ్లల్లో ఆనందం కనిపిస్తోంది. దీనికి తోడు శ్రావణ మాసం కూడా కావడంతో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. రావులపాలెం మార్కెట్ యార్డుకు నిత్యం ఆరు రకాల అరటి గెలలు వస్తుంటాయి. వీటిలో కర్పూర, చక్కెర కేళి రకాలు అధికశాతం ఉంటాయి. బుషావళి, బొంత (కూర అరటి), అమృతపాణి, ఎర్ర చక్కెర కేళి రకాలు కూడా అమ్మకాల నిమిత్తం వస్తుంటాయి.

డ్రెడ్జింగు జరిగేనా ?

రాజమహేంద్రవరం, ఆగస్టు 30: అఖండ గోదావరి నదిలో ఇసుక డ్రెడ్జింగ్‌పై సందేహలు ముసురుకుంటున్నాయ. ఇసుక మాఫియా డ్రెడ్డింగ్ జరగకుండా అడ్డుపడుతున్నట్టు సమాచారం. సుమారు 30 అడుగుల ఎత్తుకు ఇసుక పేరుకుపోయి లోతు తగ్గిపోయినట్టు అంచనా వేస్తున్నారు. గోదావరి నదిలో డ్రెడ్జింగ్ ప్రక్రియ గత ఏప్రిల్ నెలలోనే చేపట్టాల్సి వుంది. టెండర్లు పిలిచి రూ.16.52 కోట్ల అంచనా విలువతో పనులు చేపట్టేందుకు ఇరిగేషన్ అధికారులు చర్యలు పూర్తిచేశారు. ఎట్టకేలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి వచ్చింది. దాదాపు గత రెండు నెలలుగా డ్రెడ్జర్లను రాజమహేంద్రవరం సమీపంలో వుంచారు. ఈ డ్రెడ్జర్లకు పనిలేక తుప్పుపడుతున్నాయ.

బొక్కు సొరచేపను చంపితే ఏడే ళ్ల జైలు

కాకినాడ, ఆగస్టు 30: పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడే బొక్కు సొర చేపను చంపినవారికి ఏడు సంవత్సరాల జైలుశిక్ష విధించవచ్చని చట్టంలోని షెడ్యూల్ 1 చెబుతోందని కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ స్పష్టం చేశారు. సాగర జలాలను శుభ్రపరిచి, మానవాళికి ఎంతో మేలు చేస్తున్న బొక్కు సొర చేప పరిరక్షణకు కృషిచేయాల్సిన ఆవశ్యకత ప్రజలపై ఉందన్నారు. స్థానిక రంగరాయ వైద్య కశాశాల ఆడిటోరియంలో ఎగ్రీ ఫౌండేషన్, అటవీ శాఖలు సంయుక్తంగా మంగళవారం ప్రపంచ బొక్కు సొర చేప దినోత్సవాన్ని నిర్వహించాయి. ఈ సభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ సముద్రంలో కాలుష్యాన్ని తగ్గించే శక్తి బొక్కు సొర చేపకు మాత్రమే ఉందన్నారు.

పోలీసుల తీరు అమానుషం

తొండంగి, ఆగస్టు 30: కోన తీర ప్రాంతంలో ఏర్పాటుచేయనున్న దివీస్ లేబరేటరీ మందుల కంపెనీ వద్దంటూ ధర్నా నిర్వహించిన ప్రజలపై పోలీసులు లాఠీఛార్జి దారుణమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు అన్నారు. దానవాయిపేట పంచాయతీ తాటాకులపాలెం, వంటిమామిడి, కొత్తపాకలు, పంపాదిపేట గ్రామాల సమీపంలో దివీస్ లేబరేటరీ కంపెనీని ఇక్కడ ఏర్పాటుచేయవద్దంటూ ఉద్యమించిన రైతులతో పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తంచేశారు. మంగళవారం సిపిఎం ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంత రైతుల ఆందోళనకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.

బ్యాంకుపై నిందలు తగదు

రాజమహేంద్రవరం, ఆగస్టు 30: అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకింగ్ వ్యవస్థలో ఎంతో ప్రతిష్టాత్మకమైన గుర్తింపు కలిగిన రాజమహేంద్రవరంలోని ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుపై వ్యక్తిగత దురుద్ధేశంతో నిందలు వేయడం తగదని రాజమహేంద్రవరం ఆర్యాపురం కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ చల్లా శంకరరావు అన్నారు. మంగళవారం తిలక్ రోడ్డులోని బ్రాంచి కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ దురుద్ధేశంతో తనపై ఆరోపణలు చేస్తూ బ్యాంకు ప్రతిష్ఠకు భంగం చేయకూడదన్నారు. బ్యాంకులో ఏడాది కాలంలో రూ.8.42 కోట్ల నికర లాభం సాధించామని బ్యాంకు ప్రగతి వివరించారు.

సత్యదేవుని హుండీల ఆదాయం రూ.కోటిపైనే

శంఖవరం, ఆగస్టు 30: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామివారికి హుండీల ద్వారా 28 రోజులకుగానూ రూ.1,04,38,186లు ఆదాయం సమకూరినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. రత్నగిరిపై గల స్వామివారి నిత్య కల్యాణ మండపంలో దేవస్థానం ఇఒ కాకర్ల నాగేశ్వరరావు సమక్షంలో హుండీలను దేవస్ధానం సిబ్బంది లెక్కించారు. హుండీల్లో 100గ్రాముల బంగారం, 680 గ్రాముల వెండితోపాటు నగదు రూ.98,98,676లు, నాణాలు రూ. 5,39,510లు లభించాయి.

Pages