S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్యాంకర్ల ద్వారా వేరుశెనగ పంటలకు నీరందించాలి

సుండుపల్లె, ఆగస్టు 29: మండలంలో వేరుశెనగ పంట వేసుకున్న రైతులు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని రాజంపేట రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రభాకర్‌పిళ్లై తెలిపారు. మండలంలోని గుండ్లపల్లె, జి.రెడ్డివారిపల్లెతో పాటు పలు ప్రాంతాల్లో వేరుశెనగ పంటలను ఏవో పవన్‌కుమార్ ఆధ్వర్యంలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్యాంకర్ల ద్వారా వేరుశనగ పంటకు నీరందించాలని దానికి రైతులందరూ మండల అధికారులతో కలిసి వారికి రావాల్సిన సహాయ సహకారాలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అలాగే నీటిని తడిపేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ఆయన రైతులకు తెలిపారు.

సీమ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం తగదు..

దువ్వూరు, ఆగస్టు 29: రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించవద్దని జిల్లా బిజెపి అధ్యక్షుడు శ్రీనాధరెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల పరిదిలోని తెలుగుంగ ఎస్ ఆర్-1 కాలువను ఆయన పరిశీలించారు. అనంతరం దువ్వూరులో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ తెలుగుగంగ కాలువలకు సిమెంట్ లైనింగ్ పనులు చేపట్టివుంటే ఎస్ ఆర్-1 నిండి వుండేదని అలాగే ఎస్‌ఆర్-2కు, బ్రహ్మంసాగర్‌కు నీరు వచ్చే అవకాశముందన్నారు. ప్రస్తుతం వెలుగోడులో 3600 క్యూసెక్కుల నీరు విడుదల కాగా ఎస్ ఆర్-1 రిజర్వాయర్ సమీపంలోకి వచ్చేసరికి 250 క్యూసెక్కులు మాత్రమే చేరుతున్నాయన్నారు.

మధురమైన భాష తెలుగు

కడప,(కల్చరల్)ఆగస్టు 29: మధురమైన, మహత్తరమైన భాష తెలుగు అని, తియ్యదనాన్ని ప్రపంచానికి తెలిపేందుకు ఎంతోమంది తెలుగు కవులు కృషి చేశారని యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలు నీలవేణి ఆధ్వర్యంలో తెలుగుభాష దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సంస్కృతం అధికార భాషగా ఉండేదన్నారు. కవి గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగుభాష దినోత్సవాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.

ఘనంగా క్రీడాదినోత్సవం

కడప,(కల్చరల్)ఆగస్టు 29:నగర పరిధిలోని రామరాజుపల్లె సమీపంలో ఉన్న హోలిట్రినిటీ స్కూల్‌లో సోమవారం హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ర జన్మదినం పురస్కరించుకుని జాతీయ క్రీడాదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడప బ్యాట్‌మింటన్ అకాడమి జనరల్ సెక్రటరీ ఎం.మోహన్‌రెడ్డి, జిఎం సంపత్‌కుమార్‌లు హాజరై విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ ఆడిన ఆటతీరును విద్యార్థులకు క్షుణ్ణంగా వివరిస్తూ ప్రతి విద్యార్థి ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఏదో ఒక క్రీడాంశాన్ని ఎన్నుకుని ఆ క్రీడల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపుగా ఎదగాలని ఆకాంక్షించారు.

మీకోసంలో ప్రజా సమస్యలు పరిష్కరించాలి

కడప,(కల్చరల్)ఆగస్టు 29: ఎన్నో సమస్యలపై జిల్లా నలుమూలల నుంచి పేదప్రజలు మీ కోసం కార్యక్రమానికి వచ్చి తమ సమస్యల పరిష్కారం కావాలని ఆశపడతారని అలాంటి వారి నమ్మకాన్ని వమ్ముచేయొద్దని జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో మీకోసం సభాభవన్‌లో ప్రజల వినతుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈకార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను సంబందిత అధికారులందరూ వెంటనే పరిశీలించి పరిష్కరించాలన్నారు. వినతులు పరిష్కరించిన వెంటనే సమాధానాలు ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు.

జ్వరాలతో అల్లాడుతున్న జనం

మైలవరం, ఆగస్టు 30: విషజ్వరాలతో మైలవరం పట్టణం అల్లాడుతోంది. గత కొన్ని రోజులుగా ఇంటింటికీ విషజ్వరాలు సోకిన బాధితులు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీంతో ప్రభుత్వ, ప్రయివేట్ ఆసుపత్రులన్నీ జ్వరపీడితులతో కిటకిట లాడుతున్నాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూలతో అనేక మంది బాధపడుతున్నారు. మైలవరం పట్టణంతో పాటు మండలంలోని గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మైలవరంలోని ఒక ప్రైవేట్ చిన్నపిల్లల క్లినిక్ ఎదుట పసిపిల్లలతో తల్లులు పడుతున్న అవస్థలు దయనీయంగా కనిపించాయి. అదే పరిస్థితి అన్ని ఆసుపత్రుల్లో నెలకొంది.

ప్రజాసమస్యలకు క్షేత్రస్థాయిలో పరిష్కారం

మచిలీపట్నం, ఆగస్టు 30: జిల్లా పరిషత్ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు లేవనెత్తే సమస్యలకు క్షేత్రస్థాయిలో పరిష్కార చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజాప్రతినిధులకు తెలియజేస్తూ వాటి అమలుకు కృషి చేయాలన్నారు. సమగ్ర సమాచారంతో జెడ్పీ సమావేశాలకు రావాలని అధికారులకు సూచించారు. మంగళవారం జెడ్పీ సమావేశ మందిరంలో స్థారుూ సంఘ సమావేశాలు జరిగాయి. 2, 4వ స్థారుూ సంఘ సమావేశాలకు అధ్యక్షత వహించిన చైర్‌పర్సన్ అనూరాధ గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం, తదితర అంశాలపై చర్చించారు.

రొయ్యూరు క్వారీలో అక్రమంగా ఇసుక తవ్వకాలు

తోట్లవల్లూరు, ఆగస్టు 30: మండలంలోని రొయ్యూరు క్వారీలో మంగళవారం ఇసుక మాఫీయా అక్రమ తవ్వకాలు చేపట్టింది. కంకిపాడు మండలం వణుకూరుకు చెందిన నాలుగు టిప్పర్లను క్వారీకి తీసుకొచ్చి వల్లూరుపాలేనికి చెందిన కూలీలతో ఇసుక లోడింగ్ చేపట్టారు. ఈవిషయం తెలుసుకున్న రొయ్యూరు గ్రామవాసి లుక్కా వెంకట శ్రీనివాసరావు తహశీల్దార్ జి భద్రు, ఎస్‌ఐ ప్రసాద్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో కానిస్టేబుళ్లు, ఇన్‌చార్జి విఆర్వో పిఎస్‌ఎన్‌ఆర్ బాబు క్వారీకి వెళ్లి నాలుగు టిప్పర్లను తహశీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చారు.

కుంభవృష్టితో స్తంభించిన జనజీవనం

నందిగామ/ జగ్గయ్యపేట రూరల్/ కంచికచర్ల, ఆగస్టు 30: నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతంలో మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకూ ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో జన జీవనం స్తంభించింది. గ్రామాల పరిధిలో ఉన్న వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలు ఈ భారీ వర్షంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లోతట్టు పొలాల్లో వర్షపునీరు నిలిచిపోయింది. డ్రైన్లు పొంగి ప్రవహిస్తున్నాయి. నందిగామ పాత బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు.

నూజివీడులో సెంట్రల్ జైల్ ఏర్పాటు

నూజివీడు, ఆగస్టు 30:రాష్ట్ర విభజన అనంతరం నూజివీడులో సెంట్రల్ జైలు ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్లు జైళ్ళ శాఖ ఐజి ఎం చంద్రశేఖర్ చెప్పారు. సెంట్రల్ జైలు ఏర్పాటుకు కనీసం 150 ఎకరాల స్ధలం అవసరం అవుతుందని అన్నారు. నూజివీడు జైలును ఐజి చంద్రశేఖర్ మంగళవారం పరిశీలించారు. రికార్డులు పరిశీలించి, జైలులో రిమాండ్‌లో ఉన్న ఖైదీలతో మాట్లాడారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నూతన రాష్ట్ర ఆవిర్భావంతో కొత్తగా సెంట్రల్ జైలును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

Pages