S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శక్తిశాలి భారత్ మోడీ లక్ష్యం

గుంటూరు, ఆగస్టు 28: ప్రపంచ దేశాల సరసన భారత్‌ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అహరహం శ్రమిస్తున్నారని బిజెపి జాతీయ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. భారతీయ జనతా పార్టీ అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రశిక్షణ మహాభియాన్ శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిసాయి. ముగింపు సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన వీర్రాజు మాట్లాడుతూ కేంద్రంలో అధికారం చేపట్టిన రెండేళ్లలోనే ప్రధాని మోడీ అవినీతి మరకలేని జనరంజక పాలన అందిస్తున్నారని తెలిపారు. యూపిఏ హయాంలో జరిగిన 2జి స్పెక్ట్రం బొగ్గు కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించడంతో పాటు వేలం ద్వారా లక్ష కోట్ల ఆదాయం వచ్చేందుకు కృషి చేశారన్నారు.

ముగ్గుర్ని బలిగొన్న కొండవాగు

ప్రత్తిపాడు, ఆగస్టు 28.. ఒకవైపు ఎడతెరిపిలేకుండా జోరుగా కురుస్తున్న వర్షం.. మరోవైపు ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవాగు.. ఇంటికి వెళ్లాలనే ఆతృతతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే శనివారం రాత్రి ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి నడింపాలెంలోని కొండవాగు ఉధృతంగా ప్రవహించింది. వాగుకు ఎగువ వైపున కొండల సమీపంలో ఉన్న పౌల్ట్రీ ఫారంలో కూలీపనులకు వెళ్లిన ఇద్దరు మహిళలు, బాలిక, మరో బాలుడు భారీ వర్షం పడుతున్నా ఇంటికి తిరిగివస్తూ ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవాగును దాటే ప్రయత్నంలో కొన్ని అడుగులు ముందుకు వెళ్లారు.

ద్రాక్షారామలో ఘనంగా సహస్ర ఘటాభిషేకం

రామచంద్రపురం, ఆగస్టు 28: దక్షిణకాశీ ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ్భమేశ్వర స్వామి వారి ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆదివారం సహస్ర ఘటాభిషేకం, వరుణ పూజల కార్యక్రమాలు శాస్త్రోక్తంగా కార్యనిర్వహణాధికారి పెండ్యాల వెంకట చలపతి రావు నేతృత్వంలో జరిగాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ అనూరాధ ఇటీవల రాష్ట్రంలో ఏర్పడిన అనావృష్టి పరిస్థితులను అధిగమించేందుకు వరుణ జపాలను, సహస్ర ఘటాభిషేకాలను నిర్వహించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఉదయం సహస్ర ఘటాభిషేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

వణుకుతున్న కోనసీమ

రావులపాలెం, ఆగస్టు 28: ఇంత వరకూ జిల్లాలోని మన్యసీమను వణికించిన విష జ్వరాలు ప్రస్తుతం కోనసీమకు వ్యాపించి ఆందోళన కల్గిస్తున్నాయి. కోనసీమ ముఖ ద్వారం రావులపాలెం మండలంలోని పలు గ్రామాల్లో గత కొద్దిరోజులుగా విషజ్వర పీడుతులు పెరుగుతున్నారు. వీరిలో కొందరికి డెంగ్యూ సోకినట్లు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా మండలంలోని దేవరపల్లి శివారు మెరకపాలెంలోనే సుమారు 30మంది విషజ్వరాల భారినపడ్డారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అలాగే రావులపాలెం, ముమ్మిడివరప్పాడు తదితర గ్రామాల్లో కూడా కొందరు విషజ్వరాల భారినపడ్డారు.

‘చింతలపూడి’ విస్తరణకు కసరత్తు

రాజమహేంద్రవరం, ఆగస్టు 29:అఖండ గోదావరి నది కుడి గట్టు నుంచి రూపొందించిన చింతలపూడి ఎత్తిపోతల పథకం విస్తరణకు జల వనరుల శాఖ కసరత్తు చేస్తోంది. మొదటి దశలో నిర్మించిన కాలువల వ్యవస్థనే వినియోగించుకునేందుకు అంచనాకు వచ్చారు. ప్రస్తుతం ఉన్న కాలువలనే వెడల్పు చేయడం ద్వారా కొత్త ఆయకట్టును నిర్ధేశించవచ్చని జల వనరుల శాఖ అంచనాలు రూపొందించింది. ప్రస్తుత విస్తరణ పథకంతో కలుపుకుని మొత్తం నాలుగున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు వినూత్న ఆలోచనలకు పదునుపెట్టారు. ఇందుకు అనుగుణంగా డిపిఆర్ కూడా సిద్ధమైంది. విస్తరణలో భాగంగా ప్రధానంగా ప్రధాన కాలువలను వెడల్పు చేయనున్నారు. ఈ పథకంలో మొత్తం నిర్ధేశిత ఆయకట్టు 4.60 లక్షల ఎకరాలు.

ప్రత్యేక హోదాపై ఎన్జీవోల దారెటు!

కాకినాడ, ఆగస్టు 28: ప్రత్యేక హోదాకై ఆందోళన బాట పట్టనున్నట్టు ప్రకటించిన ఎన్జీవోలు ఆ మాటకు కట్టుబడి ఉన్నారా? లేక యు టర్న్ తీసుకుంటారా? అనే విషయమై జిల్లాలోని ఆయా వర్గాల్లో రసవత్తర చర్చ జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నట్టు గత నెల 30వ తేదీన జిల్లా కేంద్రం కాకినాడలో ఎన్‌జిఒ సంఘ నేతలు ప్రకటించారు. అన్ని వర్గాలనూ కలుపుకుని హోదా కోసం ఉద్యమించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు ఎన్‌జిఒ సంఘం రాష్ట్ర నేత బి ఆశీర్వాదం చెప్పారు కూడా! ఇది జరిగి దాదాపు నెలరోజులైనా నేతల హామీ ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందాన మిగిలింది.

‘తెలుగు భాషాభివృద్ధికి అందరూ నడుం బిగించాలి’

శ్రీకాళహస్తి, ఆగస్టు 28: తెలుగు భాషను అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ, ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు పిలుపునిచ్చారు. ధూర్జటి రసజ్ఞ సమైఖ్య అధ్యక్షులు ఎన్ భాస్కర్‌నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలోని ప్రసన్నవరదరాజ కళ్యాణ మంటపంలో జాతీయ కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ ఆంగ్లభాష నేర్చుకోవడం తప్పు కాదనీ, తెలుగు భాషను విస్మరించడం తప్పు అన్నారు. మాతృభాష ప్రాచీన భాష అయిన తెలుగు భాషను ప్రతి ఒక్కరూ విధిగా అభ్యశించాలని పిలుపునిచ్చారు. తెలుగు భాష అభివృద్ధి మనందరి కర్తవ్యమన్నారు.

కాకినాడలో పవన్ స్పందనపై సర్వత్రా చర్చ

తిరుపతి, ఆగస్టు 28: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సెప్టెంబరు 9న కాకినాడ సభలో బిజెపి, కాంగ్రెస్‌పైనే దాడి చేస్తాడా? లేక టిడిపిని కూడా టార్గెట్ చేస్తాడా ? అన్న అంశంపై సర్వత్రా చర్చ సాగుతోంది. రెండున్నర సంవత్సరం తర్వాత వేదికపైకి వచ్చి పవన్ ప్రత్యేక హోదాపై మాట్లాడడం పట్ల మేధావులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సమయం కోసం ఇంతకాలం నిరీక్షించానని పవన్ చెప్పడాన్ని మేధావులు తప్పు పడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని రాష్ట్ర ప్రజలంతా ముక్త కంఠంతో ఘోషిస్తుంటే ఇపుడు సమయం వచ్చిందని ప్రశ్నిస్తున్నానని పవన్ చెప్పడం ప్రజలను మభ్యపెట్టడడమే అని అభిప్రాయపడుతున్నారు.

పంట సంజీవని పెట్టుకోపోతే విద్యుత్ కట్

వి.కోట, ఆగస్టు 28: రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఇందులో భాగంగానే ప్రతి రైతు పంట సంజీవని గుంత తవ్వుకోవాలని, అలా తవ్వుకోని రైతుకు కరెంటు కట్ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఆదివారం సాయంత్రం వి.కోట మండల పరిధిలో కె.పాతూరు, తుమ్మేగానిపల్లి, బైలుపల్లి తదితర ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వేరుశనగ పంటతో పాటు పంట సంజీవని కుంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే వ్యవసాయ రంగంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలపడానికి అనేక చర్యలు చేపట్టామన్నారు.

జిల్లా అభివృద్ధికి రూ.50కోట్లు మంజూరు

కడప,ఆగస్టు 28: రాష్టవ్రిభజన అనంతరం రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇస్తున్న ప్రత్యేక ప్యాకేజిలో భాగంగా జిల్లాకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.50 కోట్లు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది ప్రత్యేక ప్యాకేజిలో భాగంగా రూ.50కోట్లు మంజూరుతో కలిపి రూ.100కోట్లకు చేరింది. ఈ నిధులతో స్వచ్ఛ భారత్, వౌలిక సదుపాయాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు మాత్రమే ఈ నిధులు ఖర్చు చేయాల్సివుంటుంది. అయితే నాయకులు మాత్రం ఈ నిధులను అభివృద్ధి పనుల పేరిట ప్రతిపాదనలు తయారుచేసి నిధులు దక్కించుకునేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు.

Pages