S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసాంఘిక శక్తుల ఆటకట్టించండి

కడప,(క్రైమ్)ఆగస్టు 28: పోలీసు అధికారులు, సిబ్బంది ప్రజలతో మంచి సంబంధాలు కలిగి పోలీసులపై ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగించుకుని అసాంఘిక శక్తుల ఆటకట్టించి, శాంతి భద్రతలు కాపాడి ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ ఆదేశించారు. ఆదివారం పోలీసు ప్రధానకార్యాలయంలో జిల్లాకు చెందిన ఏఎస్పీలు, డిఎస్పీలు, సిఐలతో క్రైమ్‌సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఎటువంటి తప్పులు చేయకుండా చట్టాన్ని పరిరక్షిస్తూ ఎటువంటి వత్తిళ్లకు లొంగకుండా న్యాయాన్ని కాపాడాలని బాధితులను ఆదుకోవాలని, ఎటువంటి సిఫార్సులకు తలొగ్గరాదని ఆయన ఆదేశించారు.

వైకాపా మహాధర్నా వాయిదా..

కడప,ఆగస్టు 28: కెసి కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్టుల కింద పంటలుసాగుచేసుకుంటున్న రైతాంగాన్ని నీరు తెప్పించేందుకు సోమవారం వైకాపా నేతలు చేపట్టిన మహాధర్నా సెప్టెంబర్ నెల 3వ తేదీకి వాయిదా వేశారు. కమలాపురం, మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు ప్రాంతాలకు చెందిన రైతులను మహాధర్నాకు సోమవారం తరలిస్తారని భావించి వచ్చేనెల 3కు మహాధర్నాను వాయిదా వేశారని ప్రజలు భావిస్తున్నారు.

ఎంతటి విపత్తునైనా ఎదుర్కొంటాం..

అమడగూరు, ఆగస్టు 28: జిల్లాలో వరుస కరవులతో అల్లాడుతున్న రైతాంగానికి ఎంతటి విపత్తు సంభవించినా ఎదుర్కొవడానికి తాను సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అమడగూరు మండలం గుండువారిపల్లిలో ఆదివారం రైతులతో ముఖాముఖి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు విచ్చేశారు. ఈ సమావేశం సర్పంచ్ గంగులమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు మాట్లాడుతూ.. రైతుల కష్టనష్టాలను తెలుసుకోవడానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రాతినిత్యం వహించిన హిందూపురంలో 2013వ సంవత్సరంలో పాదయాత్రలు చేపట్టారని గుర్తు చేశారు.

బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి

అనంతపురం కల్చరల్, ఆగస్టు 28 : బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేస్తామని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్.కృష్ణారావు అన్నారు. ఎపి.బ్రాహ్మణ సేవాసంఘ్ సమాఖ్య అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని లలిత కళాపరిషత్‌లో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం బ్రాహ్మణుల అభివృద్ధికి శుభసూచకమన్నారు. బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం గతేడాది కార్పొరేషన్‌కు రూ.60 కోట్లు, ఈఏడాది రూ.65కోట్లు కేటాయించిందన్నారు. అంతేగాకుండా బ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, స్కాలర్‌షిప్‌లు మంజూరు చేసినట్లు తెలిపారు.

అందరిదీ తప్పుంది...

అనంతపురం, ఆగస్టు 28 : వర్షాభావం వల్ల జిల్లాలో వేరుశెనగ పంట ఎండిపోతున్నా సకాలంలో ఎవరూ పట్టించుకోలేదని, ఇందులో అందరి తప్పూ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పంట ఎ ండుతున్న వైనాన్ని పత్రికలు సైతం ముందస్తుగా రాయకుండా అభాం డం వేశాయన్నారు. అలాగే అధికారులు సకాలంలో స్పందించలేదన్నా రు. రైతులు కూడా వరుణుడిని నమ్ముకున్నారే తప్ప.. తనను నమ్మలేదన్నారు. నన్ను నమ్ముకుని ఉంటే ఈపాటికి పంటను చాలా వరకూ కాపాడుకుని ఉండేవాళ్లమన్నారు. ఇక రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు సైతం ఎండుతున్న పంట వైపుదృష్టి సారించలేదని అసహనం వ్యక్తం చేశారు. గతంలో జిల్లా రైతాంగాన్ని కాపాడేందుకు రూ.175 కోట్లు ఖర్చు చేశామన్నారు.

రక్షక తడులిచ్చి వేరుశెనగ పంటను కాపాడుతాం

అనంతపురం, ఆగస్టు 28 : విపత్తులు వచ్చినప్పుడు ఏవిధంగా స్పం దిస్తామో అదేతరహాలో జిల్లాలోని వేరుశెనగ పంటను కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నా రు. ఎండుతున్న పంటలకు అందిస్తు న్న నీటి తడులను పర్యవేక్షించేం దు కు మంగళవారం వచ్చి మూడు రోజు లు ఇక్కడే ఉంటానని అన్నారు. ఆదివారం జిల్లాలోని అమడగూరు మం డలం గుండువారిపల్లి, తనకల్లు మం డలం కోటపల్లి గ్రామాల్లో ముఖ్యమంత్రి పర్యటించి వర్షాభావం వల్ల ఎండుతున్న వేరుశెనగ పంటను, పంట సంజీవని ద్వారా రక్షక తడులిచ్చేందుకు ఉపయోగించే ఫారంపాం డ్లు, రెయిన్‌గన్‌ల పనితీరును పరిశీలించారు.

బొబ్బిలి నియోజకవర్గ నేతలతో వైకాపా ముఖ్యుల సమావేశం

విజయనగరం, ఆగస్టు 28: పార్టీనాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలసికట్టుగా పనిచేయడం ద్వారా బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషిచేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి, పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు సూచించారు. బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు తన కేడర్‌తో కలసి ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వర్గం టిడిపిలో చేరడంతో గత కొంతకాలంగా నియోజకవర్గంలోని వైకాపా శ్రేణులలో స్తబ్ధత ఏర్పడింది.

అక్టోబర్ 18న ‘సిరిమానోత్సవం’

విజయనగరం(పూల్‌బాగ్), ఆగస్టు 28: ప్రతీయేటా అంగరంగ వైభవంగా జరిగే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్ 18వ తేదీన జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి పి.్భనురాజా తెలిపారు. పైడితల్లి అమ్మవారి కల్యాణమండపంలో ఆదివారం సిరిమాను ఉత్సవ వివరాలను వెల్లడించారు.అక్టోబర్ 17వతేదీన తొలేళ్ల ఉత్సవం జరుగుతుందని, అక్టోబర్ 4 నుండి నవంబర్ 2వ తేదీ వరకు నెలరోజుల పాటు ఉత్సవాలను నిర్వహిస్తున్నామని అన్నారు. సెప్టెంబర్ 25వతేదీన చదురుగుడి, వనంగుడిల వద్ద పందిరిరాట వేయడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతామని చెప్పారు. అక్టోబర్ 31వతేదీన వనంగుడి నుండి కలశజ్యోతి ఊరేగింపు, నవంబర్ 1న ఉయ్యాల-కంబాల ఉత్సవాలు జరుగుతాయని అన్నారు.

ఇక కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యాలయం

విజయనగరం, ఆగస్టు 28: జిల్లా కాంగ్రెస్ పార్టీకి సొంత కార్యాలయం యోగం పడుతోంది. దశాబ్ధాల కాలంగా అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కర్రపెత్తనం చెలాయించిన నాయకులు పార్టీ కార్యాలయం గురించి పట్టించుకోకపోగా, పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా కార్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలు కావటంతో పార్టీశ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తరువాత పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జిల్లా నుంచి మహా నాయకులు పార్టీపై, పాలనా వ్యవహారాలపై పెత్తనం చెలాయించారు.

త్వరలో జనసేన కమిటీలు

భీమవరం, ఆగస్టు 28: పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన రాజకీయ పార్టీ రంగులు దిద్దుకోనుంది. ఇప్పటివరకు తాను ఒక్కడినే అంటూ చెప్పుకొచ్చిన పవర స్టార్.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోను జనసేన ఫోర్స్ రూపంలో జిల్లా కమిటీలను ఏర్పాటుచేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే జిల్లా కమిటీల నియామకంలో కొత్త ముఖాలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. దేశభక్తి కలిగి ఉండి, రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉండాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు తెలిసింది. సాధ్యమైనంత వరకు కొత్త ముఖాలను 13 జిల్లాల్లోను ఎంపిక చేయనున్నట్టు సమాచారం.

Pages