S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నదుల అనుసంధానంతో సస్యశ్యామలం

తాడేపల్లిగూడెం, ఆగస్టు 28: నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సిఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం మహోన్నతమైనదని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం రూరల్ మండలం మాధవరం గ్రామంలో నిర్మించిన సహకార బ్యాంకు ఎరువుల గొడౌన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ గోదావరి - కృష్ణా, కృష్ణా - పెన్నా నదుల అనుసంధానంతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. ప్రధానమంత్రి ఫసలీ బీమా యోజన పథకం రైతుల పాలిట వరమన్నారు. వరి పంట కోత తర్వాత పదిహేను రోజులు ఇన్సూరెన్స్ అమలులో ఉంటుందన్నారు.

ఘనంగా సహస్ర ఘటాభిషేకం

భీమవరం, ఆగస్టు 28: వరుణుడు కరుణించాలని, ఈ భూమి అంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు భీమవరంలోని పంచారామక్షేత్రం శ్రీ ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయంలో సహస్ర ఘటాభిషేకం ఆదివారం ఘనంగా నిర్వహించారు.. ఆలయ ప్రధాన అర్చకులు కందుకూరి సోంబాబు పర్యవేక్షణలో పండితులు స్వామివారి పూజలు చేశారు. ఆలయ ప్రాంగణ మంతా హర..హర మహదేవ శంభో శంకర అంటూ మార్మోగింది.
క్షీరారామంలో...

ప్రత్యేక హోదా కోసం సమిష్టిగా ఉద్యమించాలి

కొవ్వూరు, ఆగస్టు 28: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు రాజకీయాలకు అతీతంగా అంతా సమిష్టిగా ఉద్యమించాలని ఎపి ఎస్సీఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ పిలుపునిచ్చారు. ఆదివారం కొవ్వూరులోని మాజీ ఎమ్మెల్యే టివి రామారావు స్వగృహంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కారెం మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్భ్రావృద్ధి సాధ్యమవుతుందన్నారు. ప్రత్యేక హోదా కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోపాటు నిధులు మంజూరుచేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కూరగాయల మార్కెట్‌లో రైతు బజారు

చింతలపూడి, ఆగస్టు 28 : చింతలపూడిలో నిరుపయోగంగా వున్న మహాత్మాగాంధీ కూరగాయల మార్కెట్‌ను యుద్ధప్రాతిపదికపై ఆధునీకరించి రైతు బజార్‌ను ఇక్కడే నిర్వహించాలని రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అధికారులను ఆదేశించారు. చింతలపూడిలో నిరుపయోగంగావున్న కూరగాయల మార్కెట్‌ను ఆదివారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఆక్రమణలకు గురైన మార్కెట్‌ను తక్షణమే ఆక్రమణలు తొలగించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఆమరణ నిరాహార దీక్షలు భగ్నం

మద్నూర్, ఆగస్టు 28: మద్నూర్ మండలాన్ని నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని తహశీల్ కార్యాలయం ఎదుట ఇద్దరు యువకులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలను శనివారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. మూడు రోజులుగా శ్రీనుపటేల్, కృష్ణ పటేల్ అనే యువకులు పచ్చిమంచినీరు కూడా ముట్టకుండా ఆమరణ దీక్షలు చేపట్టడంతో వారి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. దీంతో మద్నూర్ ఎస్‌ఐ కాశీనాథ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం అర్ధరాత్రి సమయంలో దీక్షా శిబిరానికి చేరుకుని, యువకులను బలవంతంగా బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

వేముల సురేందర్‌రెడ్డికి కన్నీటి వీడ్కోలు

వేల్పూర్, ఆగస్టు 28: టిఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డికి వేల్పూర్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిఆర్‌ఎస్, ఇతర పార్టీల నాయకులు, స్థానిక ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. ఊపిరితిత్తుల వ్యాధితో శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో సురేందర్‌రెడ్డి చికిత్స పొందుతూ అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి సురేందర్‌రెడ్డి మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన వేల్పూర్‌కు తీసుకువచ్చారు.

‘మహా’ ఒప్పందంపై రాద్ధాంతం తగదు

నిజామాబాద్, ఆగస్టు 28: కోటి ఎకరాలకు సాగునీరందించి తెలంగాణను ఎలాగైనా సస్యశ్యామలం చేయాలనే ధృడ సంకల్పంతో ప్రాజెక్టుల నిర్మాణాల కోసం మహారాష్టత్రో ముఖ్యమంత్రి కెసిఆర్ కుదుర్చుకున్న ఒప్పందాల పట్ల ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం సృష్టించడం సమంజసం కాదని రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో గత పాలకుల వివక్ష వల్ల సాగునీటి రంగంలో ఎంతో వెనుకబడిపోయిన తెలంగాణను ప్రస్తుతం స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో పయనింపజేసేందుకు అంకితభావంతో కృషి చేస్తున్న తెరాస ప్రభుత్వానికి బాధ్యత గల ప్రతిపక్షాలుగా సహకరించాలని ఆయన హితవు పలికారు.

ఆర్మూర్ ఎమ్మెల్యే ఇంట్లో సేద తీరిన సిఎం కెసిఆర్

ఆర్మూర్, ఆగస్టు 28: వేల్పూర్ మండల కేంద్రంలో టిఆర్‌ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి అంత్యక్రియల్లో ఆదివారం పాల్గొని తిరుగు ప్రయాణంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇంట్లో కొద్దిసేపు సేద తీరారు. ఆర్మూర్ మండలం మామిడిపల్లి గ్రామంలోని ఎమ్మెల్యే స్వగృహంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు మంత్రులు ఈటల రాజేందర్, లక్ష్మారెడ్డి, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి కలిసి భోజనం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కెసిఆర్ హైదరాబాద్ వెళ్లిపోయారు.

యాదాద్రికి జనగామ సెగ!

నల్లగొండ, ఆగస్టు 28: జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రతిపాదించిన యాదాద్రి జిల్లా ఏర్పాటుకు జనగామ జిల్లా డిమాండ్ సెగలు సమస్యగా మారుతున్నాయి. ప్రజల నిరసనలకు స్పందించి ప్రభుత్వం కొత్త జిల్లా హన్మకొండకు బదులుగా జనగామ జిల్లాను ప్రతిపాదిస్తే అప్పుడు యాదాద్రి జిల్లా భవితవ్యం ఏమిటి.. యాదాద్రి జిల్లా ప్రతిపాదనల్లో ఎలాంటి మార్పులు చేర్పులు చోటుచేసుకున్నాయన్నదీ ఆసక్తికరంగా మారింది. ముసాయిదా ప్రతిపాదనల మేరకు నల్లగొండ జిల్లాను మూడు జిల్లాలుగా పునర్ వ్యవస్థీకరణ చేస్తు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలను ప్రతిపాదించారు.

వేములకు కేసిఆర్ నివాళి

నిజామాబాద్, ఆగస్టు 28: తెరాస రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వేముల సురేందర్‌రెడ్డి(74)కి అశ్రు నయనాల నడుమ అంతిమ వీడ్కోలు పలికారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లో నిర్వహించిన అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు, అధికారులు, భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. సురేందర్‌రెడ్డి పార్థీవ దేహంపై పూలమాలలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఆయన స్వగృహం నుండి శ్మశాన వాటిక వరకు నిర్వహించిన అంతిమ యాత్రలో పాల్గొన్న పలువురు కన్నీటి పర్యంతమయ్యారు.

Pages