S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభజనలో ఏదీ శాస్ర్తియత?

షాద్‌నగర్, ఆగస్టు 28: రాష్ట్రంలో నూతన జిల్లాలు, మండలాల ఏర్పాటు శాస్ర్తియ పరంగా చేపట్టేందుకు ప్రభు త్వం కృషి చేయాలని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం మహ బూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటుపై పూర్తి స్థాయి వేసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన తరువాతే నూతన జిల్లాలు, మండలల పునర్విభజన చేపట్టాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో షాద్‌నగర్, కొడంగల్, కల్వకుర్తి నియోజకవర్గాలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.

కార్గిల్ అమరులకు దత్తాత్రేయ నివాళి

హైదరాబాద్, ఆగస్టు 28: మాజీ సైనికోద్యోగుల సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ సూచించారు. సికింద్రాబాద్‌లోని కార్గిల్ స్మారక స్థూపం వద్ద ఆదివారం అమరులకు ఆయన నివాళి అర్పించారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరంగా ఉత్సవాలు నిర్వహించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఆదివారం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో జరిగిన ఒక కార్యక్రమంలో దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ అఫ్గనిస్తాన్, భారత్‌లో అల్లకల్లోలాలు సృష్టించి అశాంతి కల్పించాలని ప్రయత్నిస్తున్నదని విమర్శించారు.

రెండు రోజుల పసికందు విక్రయానికి యత్నం?

షాద్‌నగర్ రూరల్, ఆగస్టు 28: రెండు రోజుల వయసున్న పసికందును విక్రయించేందుకు ప్రయత్నాలు చేయడం.. కాలనీవాసులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రంగ ప్రవేశం చేసి పసికందు విక్రయాన్ని అడ్డుకున్నారు. ఈ సంఘటన మహబూ బ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో శనివారం రాత్రి జరిగింది. షాద్‌నగర్ టౌన్ సిఐ రామకృష్ణ కథనం ప్రకారం వివరాలిలావున్నాయి. శనివారం రాత్రి షాద్‌నగర్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో అద్దెకు నివాసం ఉంటున్న సుజాన అనే మహిళ ఇంట్లో రెండు రోజుల పసికందు విక్రయ యత్నం జరుగుతున్నట్లు సమాచారం వచ్చింది.

దేవలమ్మనాగారం శివారులో... ఐదు టిఫిన్ బాంబులు లభ్యం

చౌటుప్పల్, ఆగస్టు 28: నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండ లం దేవలమ్మనాగారం గ్రామ శివారులో ఆదివారం ఐదు టిఫిన్ బాంబులు బయటపడ్డాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని జిల్లా ఎస్పీ కార్యాలయానికి తరలించారు. దేవలమ్మనాగారం గ్రామం నుంచి అల్లాపురం గ్రామానికి వెళ్లే బండ్లబాటలో టిఫిన్ బాంబులు లభ్యమయ్యాయి. అల్లాపురం గ్రామానికి వెళ్లేందుకు గతంలో దేవలమ్మనాగారం నుంచి బండ్లదారి ఉండేది. పీపల్‌పహాడ్ గ్రామం నుంచి రోడ్డు వేసి, ఇటీవల తారు రోడ్డుగా మార్చారు. దీంతో గత పది పనె్నండేళ్ల నుంచి బండ్లదారి వాడుకలో లేకుండా పోయింది. వ్యవసాయ భూముల్లోకి వెళ్లేందుకే మాత్రమే ఈ దారిని వినియోగిస్తున్నారు.

కావేరీ సీడ్స్ కోసమే ‘పాములపర్తి’ సామర్థ్యం తగ్గింపు

హైదరాబాద్, ఆగస్టు 28: నీతి, నిజాయితీలకు నిలువుటద్దంగా చెప్పుకునే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన బంధువుకు చెందిన కావేరి సీడ్స్ భూములను కాపాడేందుకు పాములపర్తి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 21 టిఎంసిల నుంచి 7 టిఎంసిలకు తగ్గిస్తున్నారని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే జైలుకు పంపిస్తానని, ఆధారాలు చూపితే పదవికి రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఆదివారం విలేఖరుల సమావేశంలో తీవ్రంగా ప్రతిస్పందించారు. దమ్ముంటే తనపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆయన సవాల్ విసిరారు.

టమోటా రైతులకు ప్రోత్సాహం

హైదరాబాద్, ఆగస్టు 28: టమో టా ధరలు తగ్గుతున్నందున రైతులకు ప్రోత్సాహక ధరలను ఇప్పించేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆదివారం అధికారులను ఆదేశించారు. తెలంగాణలో టమోటా పండించే ప్రాంతాలను గుర్తించి మన కూరగాయల పథకం సేకరణ కేంద్రాల ద్వారా నేరుగా రైతుల నుండి కిలో ఐదు రూపాయల చొప్పున కొనగోలు చేయనున్నట్టు చెప్పారు.

కెసికి నీటి విడుదలపై ప్రకటన అనుమానమే!

కడప, ఆగస్టు 28 : కర్నూలు-కడప కాలువ, తెలుగుగంగ ప్రాజెక్టులకు నీటి విడుదలపై ఇరు రాష్ట్రాల వివాదం నేపథ్యంలో కృష్ణా ట్రిబ్యునల్ నీటి విడుదలకు సంబంధించి అధికారికంగా ఎటూ తేల్చడం లేదు. కర్నూలు, కడప జిల్లాల వరప్రసాది అయిన కెసి కెనాల్ కింద 2.6 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సి వుండగా, ప్రస్తుతం 10 నుంచి 15శాతం ఎకరాల్లో కూడా పంటలు సాగు చేయలేదు. కర్నూలు, కడప జిల్లాలకు తుంగభద్ర జలాల విడుదలపై కర్నాటక, ఆంధ్ర రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తుండడంతో కృష్ణా ట్రిబ్యునల్ నీటి విడుదలపై స్పష్టమైన హామీ ఇవ్వలేదు. ఇప్పటి వరకూ కర్నూలు జిల్లాలో 30వేల ఎకరాలకు పైబడి, కడప జిల్లాలో 10వేల ఎకరాలకు పైబడి సాగులో ఉంది.

చత్తీస్‌గఢ్ టు హైదరాబాద్.. అక్రమంగా ఇసుక రవాణా

చింతూరు, ఆగస్టు 28: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుండి తెలంగాణాలోని పలు ప్రాంతాలకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో రోజూ పదుల సంఖ్యలో లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం కుంట కేంద్రంగా ఈ ఇసుక దందా నడుస్తోంది. శబరి పరివాహక ప్రాంతం వద్ద లభించే ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి, కుంట గ్రామంలో ఒక ప్రదేశం వద్ద రాశులుగా పోస్తున్నారు. అక్కడ నుండి ఇసుకను లారీల్లోకి ఎక్కించి ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తూ అక్రమార్కులు కాసులు వెనకేసుకుంటున్నారు. ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి ఇసుక రవాణా చేయకూడదు.

‘పేద బ్రాహ్మణులకు ఆర్థికంగా ఊతం’

అనంతపురం కల్చరల్, ఆగస్టు 28 : ఆర్థికంగా వెనకబడిన పేద బ్రాహ్మణుల ఆర్థికాభివృద్ధికి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చేయూతనందిస్తుందని కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్.కృష్ణారావు పేర్కొన్నారు. కృష్ణారావు ఆదివారం అనంతపురం నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా నగరంలోని లలిత కళా పరిషత్‌లో నిర్వహించిన బ్రాహ్మణ సమ్మేళనంలో మాట్లాడారు. బ్రాహ్మణుల్లో చాలా మంది పేదవారు ఉన్నారని, వారు గ్రూపులుగా ఏర్పడితే కార్పొరేషన్ తగిన ఆర్థిక సహకారం అందిస్తుందన్నారు. బ్రాహ్మణ సమాజంలో ప్రస్తుతం లీడర్‌షిప్ క్వాలిటీస్ లోపించాయని, లీడర్‌షిప్ వహించే వారు లేరన్నారు.

నీతులు చెప్పొద్దు

విశాఖపట్నం, ఆగస్టు 28: జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కల్యాణ్ తిరుపతి బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలపై రాజకీయ పార్టీల ప్రతినిధులు మిశ్రమ స్పందన వెలిబుచ్చారు. ప్రత్యేక హోదా సాధించే విషయంలో టిడిపి ఎంపిలు ఘోరంగా విఫలమయ్యారని పవన్ చేసిన ఆరోపణపై ఎంపి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. హోదాపై తాము ప్రణాళికా బద్దంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రధాన మంత్రిని సార్ అనకుండా ఏమని సంభోదించాలని ప్రశ్నించారు. ఈ విషయంలో మీకు కాస్తయినా స్పష్టత ఉంటే బహర్గత పరచాలని కోరారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 23సార్లు కేంద్రంతో చర్చించారని, ఈ విషయాన్ని పవన్ గుర్తుంచుకోవాలన్నారు.

Pages