S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నోరు జారొద్దు

హైదరాబాద్, ఆగస్టు 28: జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాకు ఉద్యమించి, లక్ష్యాన్ని సాధిస్తానంటే ఎంపీలంతా పవన్ వెంటనే నడుస్తామని అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని, తామంతా ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి చంద్రబాబు ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్నామన్నారు. పార్లమెంటులో కూడా పోడియం వద్దకు వెళ్లి రోజుల తరబడి నినాదాలు చేశామని, అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్లకార్డులుపట్టుకున్నామన్నారు. ఇంతకంటే పార్లమెంటరీ వ్యవస్ధలో ఏమి చేయగలమన్నారు.

కాపు ముద్ర పడనివ్వద్దు!

కాకినాడ, ఆగస్టు 28: జనసేన పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ సెప్టెంబరు 9న తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించే బహిరంగ సభకు కాపుల సభగా ముద్ర పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిసింది. కాకినాడలో తాను నిర్వహించే సభను గిట్టనివారు కాపుల సభగా అభివర్ణించే అవకాశాలుండటంతో ఇటువంటి యత్నాలను తిప్పికొట్టాలని ముఖ్యనేతలు, అభిమానులకు పవన్ సంకేతాలు పంపినట్టు సమాచారం. తిరుపతిలో పవన్‌కల్యాణ్ నిర్వహించిన బహిరంగ సభకు కాపులే సారథ్యం వహించినట్టు రాష్టవ్య్రాప్తంగా ప్రచారం జరిగింది. పవన్ ఈ అంశాన్ని అనుయాయుల వద్ద తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది.

రెడ్‌క్రాస్ సేవల్లో శ్రీధర్‌రెడ్డికి రాష్టప్రతి బంగారు పతకం

విజయవాడ, ఆగస్టు 28: అత్యంత నిబద్ధతతో కూడిన మానవీయ సేవలు అందించినందుకుగాను డా.శ్రీధర్ రెడ్డిని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అత్యున్నత సేవా పురస్కారం ‘రాష్టప్రతి బంగారు పతకం’ వరించింది. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న డా.శ్రీధర్ రెడ్డికి ఈ నెల 30న ఢిల్లీలోని ‘రాష్టప్రతి భవన్’లో జరుగనున్న రెడ్‌క్రాస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఈ బంగారు పతకాన్ని అందజేయనున్నారు. 15ఏళ్లుగా డా.ఎ.శ్రీధర్ రెడ్డి ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ కృష్ణా జిల్లా శాఖలో వివిధ హోదాలలో విశిష్టమైన సేవలు అందిస్తున్నారు.

వ్యవహారిక భాషకు పితామహుడు గిడుగు

విజయవాడ, ఆగస్టు 28: తెలుగుతల్లి ముద్దుబిడ్డ గిడుగు రామమూర్తికి ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నివాళులర్పించారు. గిడుగు రామమూర్తి జయంతి రోజు ఆగస్టు 29న ఏటా తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకుంటూ భాషపై మమకారాన్ని చాటుకుంటున్నామని తెలిపారు. వ్యవహారిక భాషా ఉద్యమమే ఊపిరిగా జీవించిన ధన్యజీవి గుడుగు రామమూర్తి అని శ్లాఘించారు. తెలుగు భాష సొగస్సును ప్రపంచానికి చాటి చెప్పటానికి బాట వేసిన దార్శనికుడని ముఖ్యమంత్రి కొనియాడారు. గిడుగు వారి జయంతిని వ్యావహారిక భాష వేడుక చేసుకునే రోజుగా చెప్పవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

తెలుగు భాషాభివృద్ధికి నడుం బిగించాలి

శ్రీకాళహస్తి, ఆగస్టు 28: తెలుగు భాషను అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ, ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ గురవయ్యనాయుడు పిలుపునిచ్చారు. ధూర్జటి రసజ్ఞ సమాఖ్య అధ్యక్షులు ఎన్ భాస్కర్‌నాయుడు ఆధ్వర్యంలో ఆదివారం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ప్రసన్నవరదరాజ కల్యాణ మంటపంలో జాతీయ స్థాయి తెలుగు కవి సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు వక్తలు మాట్లాడుతూ ఆంగ్లభాష నేర్చుకోవడం తప్పు కాదనీ, తెలుగు భాషను విస్మరించడం తప్పు అన్నారు. మాతృభాష ప్రాచీన భాష అయిన తెలుగు భాషను ప్రతి ఒక్కరూ విధిగా అభ్యశించాలని పిలుపునిచ్చారు.

జాలర్ల వలలో రాకాసి చేప

అచ్చంపేట, ఆగస్టు 28: గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం తాడువాయి కృష్ణా రేవులో జాలర్ల వలకు రాకాసిచేప దొరికింది. ఈ చేప శరీరంపై అన్నీ ముళ్లే కనిపిస్తున్నాయి. ఇలాంటి రకం చేపలు సాధారణంగా కృష్ణా నదిలో ఉండవని జాలర్లు చెబుతున్నారు. గోదావరి నదీ జలాల్లోనే ఇవి జీవిస్తాయని వివరించారు. పట్టిసీమ నీళ్ల ద్వారా ఈ రకం చేపలు కృష్ణానదిలో ప్రవేశించి ఉండవచ్చని వారు చెబుతున్నారు.

బలపడని అల్పపీడనం

విశాఖపట్నం, ఆగస్టు 28: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి రెండు రోజులు కావస్తున్నప్పటికీ ఇది బలపడే అవకాశం కనిపించడం లేదు. బలపడేందుకు దోహదపడే రుతుపవన ప్రవాహాలు జపాన్ వైపు తరలిపోతుండటమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారితే రాష్ట్రంలో కొన్ని రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉండేది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాభావంతో రైతులు ఇబ్బంది పడుతున్న తరుణంలో మంచి వర్షాలు కురిసే పరిస్థితి కనపించడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం కూడా స్థిరంగా కొనసాగుతోంది. దీనికి తోడు భూ ఉపరితలానికి ఆరు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

వర్షాకాల సమావేశాలు 15 రోజులు జరపాలి

హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణ శాసన సభ వర్షాకాల సమావేశాలు జిఎస్టీ బిల్లుకే పరిమితం చేసి ఒక రోజుతోనే ముగించాలనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోందని, ప్రభుత్వం ఈ అలోచనను మానుకొని సమావేశాలను 15 రోజులు జరపాలని అసెంబ్లీలో సిపిఎం పక్ష నాయకుడు సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం కూడా శీతాకాల సమావేశాలు జరపలేదని, ఈ సంవత్సరం వర్షాకాల సమావేశాలు జరపాలనే ఆలోచన ఉన్నట్లు లేదని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం చట్టసభలన్నా, ప్రజాప్రతినిధులన్నా, ప్రతిపక్షమన్నా లెక్కలేకుండా వ్యవహరిస్తుందని విమర్శించారు.

అరుదైన శస్తచ్రికిత్సలకు నెలవు ఉస్మానియా

హైదరాబాద్, ఆగస్టు 28: అరుదైన శస్త్ర చికిత్సలకు ప్రభుత్వ ఉస్మానియా ఆసుపత్రి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

భారీగా గంజాయి పట్టివేత

దేవరపల్లి, ఆగస్టు 28: విశాఖపట్టణం నుండి హైదరాబాద్‌కు ఐషర్ వ్యాన్‌లో రహస్యంగా తరలిస్తున్న 524 కిలోల గంజాయిని పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి వద్ద పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. ఈ సందర్భంగా నిందితుల్లో ఒకరు ఎస్‌ఐపై దాడిచేసి, పరారవ్వడానికి ప్రయత్నించడంతో గాలిలోకి కాల్పులు జరిపారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలావున్నాయి... ఐషర్ వ్యానులో గంజాయి తరలిస్తున్నట్టు దేవరపల్లి ఎస్‌ఐ సిహెచ్ ఆంజనేయులుకు సమాచారం అందింది. ఈమేరకు లక్ష్మీపురం రోడ్డువద్ద ఒక హోటల్ సమీపంలో తనిఖీలు జరిపారు. గంజాయి తరలిస్తున్న వ్యానును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Pages