S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశ్మీరీ యువతను రెచ్చగొడుతున్నవారికి గుణపాఠం

న్యూఢిల్లి:కాశ్మీర్‌లో యువతను రెచ్చగొట్టి అక్కడ విధ్వంసానికి, అల్లర్లకు కారణమవుతున్నవారిని వదిలిపెట్టేది లేదని, ప్రజలకు వారంతట వారే సమాధానం చెప్పుకోలవలసి వస్తుందని ప్రధాని నరేంద్రమోదీ హెచ్చరించారు. కాశ్మీర్‌పై దేశం అంతా ఒకే గొంతుకతో నినదిస్తోందని, భారత్‌లో కాశ్మీర్ అంతర్భాగమని, ఈ విషయంలో తప్పు చేస్తున్నవారికి గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు. మన్‌కీబాత్‌లో భాగంగా ఆయన రేడియోలో చేసిన ప్రసంగంలో ఈ హెచ్చరిక చేశారు. జిఎస్‌టి బిల్లు ఆమోదంపైకూడా ఆయన స్పందించారు. 125కోట్ల భారతీయుల సంక్షేమంకోసం చట్టసభలు సమష్టి నిర్ణయం తీసుకున్నాయని ఆయన శ్లాఘించారు.

టర్కీలో ఉగ్రదాడి

ఇస్తాంబుల్:టర్కీలోని డిమార్‌ఒకిర్ విమానాశ్రంపై ఉగ్రదాడి జరిగింది. కుర్దిష్ తీవ్రవాదులు బాంబులతో దాడికి పాల్పడ్డారు. విమానాశ్రయంలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌వద్ద వారు దాడిగి తెగబడ్డారు.

రవిశంకర్‌తో బుర్హానీ తండ్రి భేటి

బెంగళూరు:ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక వేత్త పండిట్ రవిశంకర్‌తో కాశ్మీర్‌లో ఆ మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన బుర్హాన్ వని తండ్రి ముజఫర్ వనీ భేటీ అయ్యారు. రెండురోజుల క్రితం వారిద్దరూ కలుసుకున్నారు. ఈ విషయాన్న రవిశంకర్ ట్విట్టర్‌ద్వారా తెలిపారు. వారిద్దరూ కలసి ఉన్న ఫొటోనూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

ఎటివి ప్రయోగం సక్సెస్

నెల్లూరు:పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట రాకెట్ ప్రయోగం కేంద్రం నుంచి ఆదివారం ఉదయం 6 గంటలకు జరిగిన ఆడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెహికల్ (ఎటివి) 02 ప్రయోగం విజయవంతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎటివి ప్రయోగంతో శాస్తవేత్తలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.

టోక్యో ఒలింపిక్స్‌లో సత్తా చాటతాం

హైదరాబాద్:రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి దేశప్రజలంత ప్రేమను పొందామని, ఈ విజయం, ప్రోత్సాహంతో టోక్యోలో జరిగే తదుపరి ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించాలన్న పట్టుదల పెరిగిందని సాక్షిమాలిక్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో సచిన్ టెండూల్కర్ బహుమతి ప్రదానం అనంతరం ఆమె మాట్లాడింది. కాగా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించే దిశగా శిక్షణ పొందుతానని పివిసింధు వ్యాఖ్యానించింది. అత్యుత్తమ శిక్షణ ఇస్తే వచ్చే ఒలింపిక్స్‌లో దేశానికి మరిన్ని పతకాలు ఖాయమని కోచ్ గోపీచంద్ అన్నారు.

ఒలింపిక్స్ విజేతలకు సచిన్ బహుమతి

హైదరాబాద్:ఒలింపిక్స్‌లో అద్భుత ప్రదర్శనతో దేశ ప్రజలను ఆకట్టుకున్న, పతకాలు సాధించిన క్రీడాకారులు, కోచ్‌లకు క్రికెట్ లెజండ్ సచిన్ టెండూల్కర్ ప్రత్యేక బహుమతులు అందజేశారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం ఉదయం జరిగిన ఓ కార్యక్రమంలో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ కాంస్య పతక విజేత సాక్షి మాలిక్, బ్యాడ్మింటన్ రజత పతక విజేత పివిసింధు, వాల్ట్‌లో అద్భుత ప్రదర్శన కనబరచిన దీపాకర్మాకర్, భారత బాడ్మింటన్ కోచ్ గోపీచంద్‌లకు బిఎండబ్ల్యు కార్లను బహూకరించిన సచిన్ మున్ముందు మరిన్న పతకాలు సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

వేములకు కేసిఆర్ నివాళి

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్ర సమితి రైతు విభాగం అధ్యక్షుడు వేముల సురేందర్ రెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ సంతాపం వ్యక్తం చేశారు. వేముల మృతదేహం వద్ద నివాళి అర్పించారు. హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేందర్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. నిజామాబాద్ జిల్లాలోని స్వస్థలంలో వేముల అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

రజకులపై దాడులు నియంత్రించాలి

శ్రీకాకుళం(టౌన్), ఆగస్టు 27: జిల్లాలో రజకులపై దాడులను నియంత్రించాలని ఎపి రాష్ట్ర రజక సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు రాజమండ్రి నారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన జిల్లా పర్యటన నేపథ్యంలో ఇక్కడి రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉత్తరాంధ్రలో రజకులపై దాడులు అధికంగా ఉన్నాయని అన్నారు. అనేక కార్యక్రమాల్లో రజకులు తమ వృత్తినే దైవంగా భావించి నేటికీ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని, అంతమాత్రాన వారిని చిన్నచూపు చూడటం తగదన్నారు. రజక సంఘాలు ఎప్పుడూ రోడ్డెక్కి ఆందోళనలు, ధర్నాలు చేయలేదని, అలాగే ఉద్యమాలు వంటివి చేపట్టలేదని పేర్కొన్నారు.

వర్షాల కోసం వరుణయాగం

పాతపట్నం, ఆగస్టు 27: వర్షాలకోసం దేవాదాయ శాఖ వరుణ యాగాన్ని తలపెట్టినట్టు దేవాదాయ డిప్యూటీ కమిషనర్ ఎంవిఎస్ మూర్తి తెలిపారు. ముందుగా నీలమణి దుర్గ ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో రమణయ్య ఇందులో పాల్గొన్నారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ దేవాదాయ భూములను కాపాడేందుకు ప్రత్యేక చట్టం వచ్చిందని, ఎవరైనా కబ్జా చేయడం జరిగితే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోవీరితోపాటు సహాయ కమిషనర్ రమాదేవి, జిల్లా సూపరింటెండెంట్ ప్రసాద్ పట్నాయక్, రాయివలస ఈవో గురునాథంతోపాటు ఇవో పాల్గొన్నారు.

డెంగ్యూతో మహిళ మృతి

పరవాడ, ఆగస్టు 27: డెంగ్యూ వ్యాధి భారిన పడి ఒక వివాహిత శనివారం మృత్యువాత పడ్డారు. మండల కేంద్రమైన పరవాడ జగన్నాథవీధిలో నివాసం ఉంటున్న పయిల అమ్మాజీ (35) వారం రోజుల నుండి డెంగ్యూ వ్యాధితో బాధ పడుతూ విశాఖపట్నం కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న ఆమె శనివారం ఉదయం మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అమ్మాజీకి భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. పరవాడ మండలంలో డెంగ్యూ వ్యాధి బారిన పడి మృతి చెందడం ఇదే ప్రథమం. ఇప్పటికే పరవాడ మండలంలో మరో మూడు డెంగ్యూ అనుమానిత రోగులను వైద్యులు గుర్తించారు. ఈ రోగులు నగరంలో గల వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

Pages