S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

4న దర్శకుడు విక్రమ్‌కుమార్ వివాహం

‘ఇష్క్’, ‘మనం’, ‘24’ లాంటి చిత్రాలతో వైవిధ్యమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు విక్రమ్‌కుమార్. ముఖ్యంగా సూర్యతో తెరకెక్కించిన 24 సినిమాతో భిన్నమైన ప్రయోగం చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. త్వరలోనే ఈయన ఓ ఇంటివాడు కాబోతున్నాడు. విక్రమ్ ఇటీవలే చెన్నయ్‌కి చెం దిన శ్రీనిధి అనే అమ్మాయితో నిశ్చితార్ధం జరిగిం ది. ఈమె ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ వద్ద సౌండ్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఎ.ఆర్.రెహమాన్ ‘24’ చిత్రానికి సంగీతం అందిస్తున్న సమయంలో విక్రమ్‌తో ఆమె పరిచయం ఏర్పడిందట. అది ప్రేమగా మారిందని తెలిసింది.

నాగ్ స్టాంప్

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఇప్పటికీ మన్మధుడుగా తనదైన ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. రొమాంటిక్ సినిమాల్లో చేస్తూనే మరోవైపు అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి భక్తిరస సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన కొన్ని అద్భుతమైన చిత్రాలతో కలిపి పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయనున్నారట. ఈ విషయాన్ని అన్నపూర్ణ స్టూడియో సోషల్ మీడియా ద్వారా తెలిపింది. దీనికి సంబంధించిన ఓ ఫొటోను కూడా విడుదల చేశారు. మై స్టాంప్ పేరుతో విడుదలవుతున్న ఈ స్టాంప్ టాలీవుడ్‌లో మొదటిసారిగా నాగార్జునది కావడం విశేషం.

పగతో రగిలే ప్రేమకథ

నిఖిల్ కథానాయకుడు అభిషేక్ పిక్చర్స్ పతాకంపై సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం సంస్థ కార్యాలయంలో నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం దేవుని పటాలపై తొలి క్లాప్ అభిషేక్ నామ ఇవ్వగా మధుసూధనరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సుధీర్‌వర్మ మాట్లాడుతూ, రివెంజ్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నిఖిల్ సరికొత్త పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారని, రివెంజ్ కథనంలో ఓ అందమైన ప్రేమకథ ఆసక్తికరంగా సాగుతుందని తెలిపారు. షూటింగ్ అంతా కాకినాడ నుండి విశాఖపట్నం వరకూ ఉన్న సముద్రతీర ప్రాంతంలో జరుపుతామని అన్నారు.

మిస్టర్ 420 టర్నింగ్ పాయంట్

వరుణ్ సందేశ్, ప్రియాంక భరద్వాజ్ జంటగా సాన్వి క్రియేషన్స్ పతాకంపై ఎ.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో గజ్జెల హరికుమార్‌రెడ్డి రూపొందించిన చిత్రం ‘మిస్టర్ 420’. రియాన్ ముస్త్ఫా సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని సి.కళ్యాణ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరుణ్ సందేశ్ వివాహం అయ్యాక విడుదలవుతున్న ఈ చిత్రం తప్పక విజయం సాధించాలన్నారు. ఈ సినిమా టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని, కథాకథనాలు సరికొత్తగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, వరుణ్‌సందేశ్ ఈ చిత్రంతో ఓ సరికొత్త ఇమేజ్‌ని తెచ్చుకుంటాడని దర్శకుడు తెలిపారు.

బలపం పట్టిన రష్మీ

నాగహృషీ ఫిలిమ్స్ పతాకంపై రష్మీగౌతమ్, శాంతన్ జంటగా ఎ.సి.ముగిల్ దర్శకత్వంలో విజయ్ గజగౌని రూపొందిస్తున్న చిత్రం ‘బలపం పట్టి భామ ఒడిలో’ (అఆఇఈ). ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. యూత్‌ఫుల్ కథనంతో సాగే ప్రేమకథా చిత్రంగా దర్శకుడు ఈ సినిమాను రూపొందించారని, అనువాదంలో ప్రతి డైలాగ్ తెలుగుతనంతో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. రష్మీగౌతమ్‌కు తెలుగులో వున్న క్రేజ్ ఈ చిత్రంతో రెట్టింపు అవుతుందని, సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని తెలిపారు.

లక్కున్నోడితో జోడి

‘దేనికైనా రెడీ’, ‘పాండవులు పాండవులు తుమ్మెద’ వంటి చిత్రాల్లో మంచు సరసన నటించిన గ్లామర్ భామ హన్సిక మరోసారి మంచు విష్ణుతో జోడీ కట్టనుంది. ఇటీవలే ‘ఈడోరకం ఆడోరకం’ సినిమాతో విజయాన్ని అందుకున్న మంచు విష్ణు రాజ్‌కిరణ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిథ్రాన్ని నిర్మిస్తున్నారు. వరుస అపజయాలతో డీలాపడ్డ మంచు విష్ణుకు ‘దేనికైనారెడీ’తో మంచి విజయాన్ని అందించింది హన్సిక. దాంతో మళ్లీ ఆమెతోనే సినిమా చేయడానికి మంచు విష్ణు ఆసక్తి చూపించాడు. ప్రస్తుతం ఈ భామ తమిళంలో బిజీ హీరోయిన్‌గా మారింది.

డర్టీగేమ్ టాకీ పూర్తి

షిర్డీ సాయి క్రియేషన్స్ పతాకంపై ఖయ్యూం, నందినీకపూర్ జంటగా అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌కుమార్ రూపొందిస్తున్న చిత్రం డర్టీగేమ్. ఈ చిత్రానికి సంబంధించిన టాకీపార్టు పూర్తిచేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నటుడు కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ, పాత్రలకు తగిన విధంగా నటీనటులను నిర్మాత ఎంపిక చేశారని, అందుకు అతన్ని అభినందిస్తున్నానని అన్నారు. ఇలాంటి కథతో సినిమాను నిర్మిస్తున్న ఆయన గట్స్‌ను కూడా మెచ్చుకుంటున్నానని, తప్పక విజయవంతవౌతుందని తెలిపారు.

రెయిన్‌గన్‌లతో కరవుకు చెక్

అనంతపురం:అనంతపురం జిల్లాలో 30 మండలాల్లో కరవు పరిస్థితులు ఉన్నాయని, రెయిన్‌గన్‌ల సహాయంతో కరవుకు చెక్ చెప్పనున్నామని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా అమడగూరు మండలం గుండువారిపల్లెలో పంటల సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు రైతులకు రెయిన్‌గన్‌లను పంపిణీ చేశారు.

ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కెసిఆర్

జగదేవ్‌పూర్:మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదివారం చేరుకున్నారు. రెండురోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. బొప్పాయి పంటల తీరును ఆయన పరిశీలించనున్నారు.

వర్గీకరణకు సహకరించాలి

హైదరాబాద్:ఎస్‌సి వర్గీకరణ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహకరించాలని ఎంఆర్‌పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ కోరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లో ఎస్‌సి వర్గీకరణపై చట్టం చేయాలని, ఈ విషయంలో ఢిల్లీకి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రావాలని మంద కృష్ణ కోరారు.

Pages