S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయితలు ఎందుకు చదవాలి?

అభిరుచులకీ, అనుభవాలకీ, ఆలోచనల పదునుకూ, జ్ఞాన సంపదకీ, గవేషణకీ, అనే్వషణకీ, అన్నిటికీ చదువు అవసరం. ఏ ఒక్క చదువూ మనని పరిపూర్ణ మానవులుగా తయారుచెయ్యలేదు. చదువుల బడిలో చదువుకున్న చదువులో గేప్స్ (గ్యాప్స్) పూర్తిచేసే చదువు అవసరం. అలాంటి చదువులే పుస్తక సాహిత్యమూ, సాహిత్య పుస్తకాలూ, కథలు అందులో ఒక భాగం. కథ మరీ ముఖ్యమైనదేమో ఇవాల్టి ఈ ఉరుకుల పరుగుల జీవితంలో గబగబా మధ్యలో ఏదో చేస్తూ, ఎక్కడో బస్సులోనో, ట్రెయిన్లోనో, టాయిలెట్లోనో ఏదోవిధంగా చదివేద్దాం, పూర్తిచేసేద్దాం అనుకునే మనుషులు మనకి కనిపిస్తూ వుంటారు. వీళ్ళందరికీ సులభంగా అవకాశం ఇచ్చేది కథేనేమో అని నాకన్పిస్తుంది.

- చిర్రావూరి శ్యామ్

విదేశంలో పిల్లల పిల్లలు

వాళ్లు ఆంగ్లం అనర్గళంగా మాట్లాడతారు
వారి తెలుగు తెలుగులా ఉండదు
మా తెలుగు వారికి అర్థం కాదు
మా పిల్లలు కూడా
వారితో ఆంగ్లంలోనే మాట్లాడతారు
ఆంగ్లం నేర్చుకున్నా నేర్పుతున్నా
తెలుగులో మాట్లాడమంటాం మేం
వాళ్లు నవ్వేసి ఊరుకుంటారు

ఒక్కోమారు
ఆ పిల్లలు
అలా పోట్లాడుకోవద్దని
మేము వారితో
తెలుగులో నచ్చచెబుతాం

వాళ్లు వినరు
ఇండియా తెలుగు వాళ్లు కదా
వాళ్లు అంతేలే అనుకుంటారు

వారి యాసలో
ఆంగ్లం మాకు రానంత మాత్రాన
అదేమిటి
అంతలోనే
మా ఇంటిలోనే
మేము విదేశీయులమా?

- ముకుంద రామారావు 9908347273

కవితాదర్భశయనం

కవిత్వం 2015
సంపాదకులు:
దర్భశయనం శ్రీనివాసాచార్య
ప్రచురణ: కవన కుటీరం
వరంగల్- తెలంగాణ
వెల:రూ.80/-
ప్రతులకు:
నవోదయ, విశాలాంధ్ర,
నవ చేతన బుక్‌హౌస్
***

- సాంధ్యశ్రీ

కథా తోరణం 12

‘కథ’ అనేది ఎప్పుడు పుట్టింది. ఎలా పెరిగింది, ఏమేం ప్రయోజనాలు సాధించింది అనే విషయాలను గురించి పరిశోధనలు జరుగుతూనే వున్నాయి. కొత్త కొత్త విషయాలు బయలుపడుతున్నాయి. కథ అనేది ఆధునిక యుగంలో పత్రికల కోసం పుట్టిందనీ, అమెరికా బాగా ప్రాచుర్యం సంపాదించిందనీ ఎరుక. పుట్టటం మటుకు ఇంగ్లాండ్‌లోనే. అంతమాత్రంచేత వెనకటి రోజులలో- ప్రాచీన యుగాలలో కథ వేరు అని కొట్టిపారేయాలేము.

- శ్రీవిరించి, ఫోన్ : 09444963584

ఆయురారోగ్యాలనిచ్చే జలధీశ్వరస్వామి

జలం జీవులకు ప్రాణాధారం. దేహాన్ని పరిశుద్ధంచేసేది, ఆరోగ్యాన్ని ఆయుర్దాయాన్ని పెంచేది నీరే! ఆ జలంనుండి జనించి జలధీశ్వరునిగా భక్తులచే పూజలందుకుంటున్న కృష్ణాజిల్లా ఘంటశాలలోని శ్రీ బాల పార్వతీసమేత శ్రీ జలధీశ్వరస్వామిని దర్శించి, ఆరోగ్యవంతులైనవారు అనేకం. అగస్త్యమునిచే ప్రతిష్ఠితమైన ఈ ఆలయంలో స్వామిని సేవించిన వారు అష్టైశ్వర్యాలతో తులతూగుతున్నారు. కొందరు భక్తులు స్వామిపై కొద్ది నీళ్ళుపోసి ఆ జలం త్రాగితే వ్యాధులు పటాపంచలవుతాయని అన్నారు.
‘‘ఏకపీఠేవిరాజన్తం సర్వమంగళయా సహా
ఘంటశాల పురాధీశం జలధీశ్వర యుపాస్మహే

- బొడ్డపాటి రాజేశ్వరమూర్తి

నిస్వార్థ కర్మయోగి.. హనుమ

రామచంద్రుని భక్తులలో అగ్రగణ్యుడు అంజనాసుతుడైన హనుమ. ఆయన హృదయంలో స్వామి ఎప్పుడూ కొలువుండిపోయాడు. హృదయం చీల్చినా కనబడేది ఆ రాముడే. శ్రీరాముని గుణగణాలు, శుభలక్షణాలను వివరించగల శక్తి ఆయనకున్నంతగా మరొకరికి లేదు.

-కాకటూరి సుబ్రహ్మణ్యం

వౌనం వెండి.. మాట బంగారం

వౌనము మూర్తిమంతమైన దక్షిణామూర్తివంటివారు శ్రీరమణ మహర్షి. అతని వాక్కు ఋషుల ఉపదేశం. అద్వైత సారాన్నీ, ఉపనిషత్తులందించిన ఆత్మ తత్త్వాన్నీ, బోధామృతంగా ప్రపంచానికి పంచి ఇచ్చారు. ప్రేమమూర్తి, జ్ఞానమూర్తి, కారుణ్యమూర్తి రమణ మహర్షి. నిరాధారుడై గగన సమానుడై, పూర్ణుడై, నిశ్శబ్దుడై, గురుస్వరూపమై వెలుగు పరబ్రహ్మము రమణమహర్షి. 1878లో జన్మించిన వెంకట్రామన్ పదహారేళ్ల వయసులో అనూహ్య సంఘటనలో ఆత్మానుభవం పొంది, ఆదిశంకరుల ఆత్మవిద్యను కరతలామలకం చేసుకుని అనుభవంలోకి తెచ్చుకున్న స్వయంభువు.

- ఎ.సీతారామారావు

సర్వ పాపాలను హరించే చక్రతీర్థం

అలకా పట్టణ ప్రభువైన కుబేరుడు ఒకసారి కైలాసానికి ఉత్తరం వైపున వైష్ణవ యజ్ఞం ప్రారంభించాడు. ఆ యజ్ఞానికి విష్ణుమూర్తి వచ్చాడు. ఆయనతోపాటు సూర్యుడు, చంద్రుడు, దిక్పాలకులు, గంధర్వులు విచ్చేశారు. ఆ యజ్ఞంలో కుబేరుని కొడుకు నలకూబరుడు ధనాగారానికి పాలకుడిగా, వీరభద్రుడు రక్షకుడుగా, గణపతి సేవా కార్యక్రమమునకు గాను వియోగింపబడ్డారు. ధర్మతత్పరుడైన కార్తికేయుడు సదస్యులకు మర్యాదచేయసాగాడు. కుబేరుని మంత్రులు ఘంటానాథుడు, పార్శ్వవౌళి- శాస్తక్రారులకు పెద్దలుగా దానాధ్యక్షులుగా వ్యవహరింపసాగారు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు

ఆవులను దండించినా పాపమేనా?

* విభీషణుడు రావణుని సొంత సోదరుడేనా? - శివాజీరావు, హైద్రాబాద్
ఒకే తల్లితండ్రులకు పుట్టిన సోదరులే. తల్లి పేరు కైకసి, తండ్రి పేరు విశ్రవోముని.
* పేరు తెలియని వారిని అగస్యభ్రాత అంటారు. కాని ఆగస్తునికి తమ్ముడు లేడా! ఉన్నా అయనంత ప్రతిభావంతుడు కాదా! - పార్వతీశం, ఒంగోలు

కుప్పా వేంకట కృష్ణమూర్తి

mataata

Pages