S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోచేతులపై నలుపు ఇలా పోగొట్టండి...

ఎంత తెల్లగా ఉన్నవారికైనా మోచేతులు, మోకాళ్లపై నల్లగా, గరుకుగా ఉంటుంది. చూడటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నలుపుపోవాలంటే ఇలా చేయండి.
రాత్రి పడుకోబోయే ముందు మోకాళ్లకీ, మోచేతులకీ ఖచ్చితంగా ఆలివ్ ఆయిల్ లేదా ఆముదం నూనెతో మర్దన చేసుకుని నిద్రపోండి. ఈ నూనెలు చర్మం ముడతలు పడడాన్ని తగ్గిస్తాయి.

కొవ్వుని కరిగించే మసాల దినుసులు

బరువు పెరగటానికి అనేక కారణాలు ఉండవచ్చు. శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, భోజనానికి సమయపాలన లేకపోవడం, శారీరక శ్రమ అస్సలు లేకపోవడం, కొన్నిసార్లు వంశపారంపర్యంగా కూడా అధిక బరువు నమోదు కావచ్చు. మరి ఇటువంటి సమస్యల బారిన పడకుండా కొవ్వు కరిగించుకొని పొట్ట తగ్గించుకొనేందుకు కొన్ని ఆహారాలు ప్రత్యేకంగా తీసుకోవాలి. శరీరం నుండి కొవ్వును కరిగించడంలో ఇది ఒక చాలా ముఖ్యమైన ఇంటి చిట్కా. వ్యాయామం చేయడంవల్ల శరీరంలోని కొవ్వును కరిగించుకోవచ్చు. కొవ్వులు మనిషి ఆరోగ్యానికి చాలా అవసరం. అయతే అవి పెరగకుండా చూసుకోవాలి. మనం వాడే కొన్ని మసాలా దినుసులు కొమ్వును కరిగించడంలో మంచి ఫలితాన్ని ఇస్తాయ.

- వినీతామూర్తి

గోదావరికి వైభవంగా నిత్య హారతి

రాజమహేంద్రవరం, ఆగస్టు 4: గోదావరి నది వరద తాకిడితోక్రమేణా ఉగ్రరూపం దాలుస్తోంది. అఖండ హారతికి నిత్య హారతి విశేషంగా జరుగుతోంది. అశేష భక్తజనం నిత్యం సాయంత్రం వేళ హారతిని తిలకించి తరిస్తున్నారు. గురువారం రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో అఖండ గోదావరి నదికి అఖండ హారతి కార్యక్రమం వైభవంగా సాగింది. పుణ్య నది గోదావరికి వేద పండితులు విశేష హారతి నీరాజనాలు పలికారు. దూప హారతి, ఏక, బిల్వ, నాగ, పంచ, వృక్ష, నంది, సింహ, రుద్ర, చక్ర, కుంభ, కర్పూర, నక్షత్ర హారతులు ఇచ్చారు. రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

వృద్ధ తల్లిని రోడ్డుపై వదిలిన తనయుడు

అమలాపురం, ఆగస్టు 4: నవ మాసాలు మోసి, కని, పెంచిన కొడుకుకు తన కన్నతల్లి భారమైంది. ఆమెకు పట్టెడన్నం పెట్టలేక రోడ్డు పక్కన వదిలి పోవడంతో స్థానికులు, పోలీసులు ఆమెను వృద్ధాశ్రమంలో చేర్చి ఆశ్రయం కల్పించారు. తల్లిని రోడ్డుపై వదిలిన కొడుకుపై సీనియర్ సిటిజన్ యాక్ట్ 24 ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి సిఐ వైఆర్‌కె శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అమలాపురం పేరూరుపేటలో నివాసం ఉంటున్న హనుమంతరావుకు వివాహమై భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అయితే భార్య అనారోగ్యంతో మంచం పట్టింది.

వైభవంగా సత్యదేవుని ఆవిర్భావ దినోత్సవం

శంఖవరం, ఆగస్టు 4: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఆవిర్భావ దినోత్సవం రత్నగిరిపై గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. రత్నగిరిపై దేవస్థానం ఛైర్మన్ ఐవి రోహిత్, ఇఓ కాకర్ల నాగేశ్వరరావుల పర్యవేక్షణలో నిర్వహించిన స్వామివారి జయంతోత్సవాలను రత్నగిరిపై వేద పండితుల మంత్రోచ్ఛారణలతో భక్తుల సత్యదేవ నామస్మరణతో మార్మోగింది. స్వామివారి జన్మనక్షత్రమైన మఖ నక్షత్రం పురస్కరించుకుని వేకువజామున 3 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఉదయం 8 గంటలకు స్వామివారి దర్బారు మండపంలో జపాలు, పారాయణలు, ఆయుష్య హోమం, సువాసినీ పూజ, కౌమారీ పూజ గావించారు.

ప్రతి శనివారం విధిగా మొక్కలు నాటాలి

కాకినాడ, ఆగస్టు 4: జిల్లాలో ప్రతి శనివారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని విధిగా చేపట్టాలని కలెక్టర్ హనుమంతు అరుణ్‌కుమార్ సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రతి మండలంలో కనీసం 2 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు చెప్పారు. కాకినాడ కలెక్టరేట్‌లో గురువారం అటవీ శాఖ, చిన్న పత్రికల సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన మనం-వనం కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం 1.50 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంతో 162 నర్సరీల్లో 1.64 మొక్కలను పెంచినట్టు చెప్పారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా జూలై 29వ తేదీన 10 లక్షల మొక్కలను నాటినట్టు తెలిపారు.

ఉపాధి హామీకి నిధుల కొరత లేదు: కలెక్టర్

రంపచోడవరం, ఆగస్టు 4: ఉపాధి హామీ పథకం అమల్లో నిధులకు కొదవలేదని, గిరిజనుల జీవనోపాధి కల్పనకు అధికారులు సమన్వయంతో కృషిచేస్తూ వారి అభివృద్ధికి తోడ్పాడాలని జిల్లా కలెక్టర్ అరుణకుమార్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం స్థానిక ఐటిడిఎ సమావేశపు హాల్లో వివిధ శాఖల జిల్లా, డివిజన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ అనుసంధానంతో చేపడుతున్న ఉద్యానవన సాగు, ఎన్టీఆర్ జలసిరి-2, సేద్యపు నీటిగుంటల నిర్మాణ పురోగతి తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.

నెల రోజుల్లోగా దీపం కనెక్షన్లు పంపిణీ: జెసి

కాకినాడ సిటీ, ఆగస్టు 4: జిల్లాకు మంజూరైన దీపం కనెక్షన్లను నెల రోజుల్లోగా లబ్ధిదారులకు పంపిణీ పూర్తిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ ఆయిల్ కంపెనీల ప్రతినిధులు, ఎల్‌పిజి డీలర్లను ఆదేశించారు. కలెక్టరేట్ కోర్టు హాలులో గురువారం సాయంత్రం ఆయన ఆయిల్ పరిశ్రమల ప్రతినిధులు, వంటగ్యాస్ డీలర్లతో సమావేశం ఏర్పాటుచేశారు. దీపం కనెక్షన్ల పంపిణీ పురోగతిని సమీక్షించి అవసరమైన ఆదేశాలు జారీచేశారు. దీపం పథకం కింద జిల్లాకు 2 లక్షల 26 వేల వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు కాగా ఇందులో లక్షా 31 వేల కనెక్షన్లను ఇప్పటికే లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు.

ఆత్రేయపురంలో ఎసిబి దాడులు

ఆత్రేయపురం, ఆగస్టు 4: ఆత్రేయపురంలోని డిఎడ్ కళాశాలలో గురువారం ఎసిబి దాడులు నిర్వహించింది. ఎసిబి సిఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో సిబ్బంది మహాత్మాగాంధీ డిఎడ్ కళాశాలలో రికార్డులు పరిశీలించారు. సిబ్బంది నుండి వివరాలు సేకరించారు. కమిటీ సభ్యులు సత్యనారాయణరాజు గృహంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రాజశేఖర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో డిఎడ్ కళాశాలలపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

నదుల అనుసంధానాన్ని వ్యతిరేకించడం తగదు

కాకినాడ సిటీ, ఆగస్టు 4: గోదావరి-ఏలేరు నదుల అనుసంధానాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి వ్యతిరేకించడం తగదని పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌విఎస్‌ఎన్ వర్మ అన్నారు. కాకినాడ నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి తన పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారా గోదావరి నదితో ఏలేరు నదిని అనుసంధానం చేయకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.

Pages