S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎట్టకేలకు భీమేశ్వరాలయ ట్రస్టుబోర్డు ప్రమాణ స్వీకారం

సామర్లకోట, ఆగస్టు 4: సాక్షాత్తూ భీమేశ్వరుని యోగలింగం సాక్షిగా ఎట్టకేలకు సామర్లకోట పంచారామ క్షేత్రం భీమేశ్వరాలయానికి పాలక మండలి ట్రస్టుబోర్డు ఏర్పాటయింది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఉత్తర్వులతో గురువారం ఉదయం ఆలయంలోని స్వామివారి అంతరాలయం ఎదురుగా నియమితులైన పదిమంది సభ్యులతో ఆలయ ఇఒ పులి నారాయణమూర్తి ప్రమాణ స్వీకారం చేయించారు.

పి నాయకంపల్లిలో డయేరియా

గండేపల్లి, ఆగస్టు 4: గండేపల్లి మండలం పి నాయకంపల్లి గ్రామంలోని ఎస్సీ పేటలో గురువారం డయేరియా వ్యాధిన పడి 10 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులను పెద్దాపురం, రాజమండ్రి, కాకినాడ ఆసుపత్రులకు తరలించారు. జోడా కుమారి, తాడేపల్లి రాఘవ, గంధం సత్యనారాయణ, సాంబత్తుల చంద్ర, ఇజ్జిన ఆంజనేయులు, ఇజ్జిన స్వరూప, బ్రహ్మదేవి, జీవిత, మురారి అప్పారావు, బొళ్లం అపర్ణ, బొళ్లం మానస విరోచనాలు, వాంతులతో బాధపడుతుండటంతో స్థానిక పిహెచ్‌సి సిబ్బంది ప్రాథమిక చికిత్స అనంతరం పెద్దాపురం ఆసుపత్రికి తరలించారు.

గాలి మళ్లిపోయింది (కథ)

రాఘవరావుగారికి నిద్రపట్టడం లేదు. టైమెంతైందో తెలీటం లేదు. గదిలో వెలుగుతున్న గుడ్డి బల్బువల్ల గడియారంలో టైము తెలీటంలేదు.
‘సుజీ.. సుజీ. టైమెంతైంది.?’ నెమ్మదిగా పక్కనే పడుకున్న భార్యని తట్టి లేపుతూ అడిగారు.
‘‘అబ్బబ్బ.. యిప్పటికి యిది నాలుగోసారి అడగడం.. తెల్లవారితే నేనే లేపుతాగా.. నాకిప్పుడే నిద్ర పట్టింది.. అయినా లేచి చేసే నిర్వాకం ఏవిటంట..’ విసుక్కుంది ఆవిడ.
‘అదికాదు.. రేపేగా మనం మన యింటికి వెళిపోయేది..’ నసుగుతూ అన్నారు.

-అంగర వెంకట శివప్రసాదరావు రచయిత సెల్ నెం:9393101132

mataata

నేర్చుకుందాం

క. వీరైలులుఁ బౌరవులను
భారతులును గౌరవులును బాండవులు ననన్
వీరులయి పరఁగి రిది నయ పారగ
భవదీయ వంశ పరిపాటి మహిన్
వీరు బలులనీ, పౌరవులనీ, భారతులనీ, కౌరవులనీ, పాండవులనీ పిలువబడుతూ వీరులుగా ప్రసిద్ధి చెందారు. ఓ నయకోవిదుడా ఇది లోకంలో వాసికెక్కిన నీ వంశక్రమం అని జనమేజయునితో వైశంపాయనుడు చెప్పాడు.
క. నరవరుఁడగు శంతనున క
మరనదికిని నట్లు సంగమం బయ్యె మహా
పురుషుండు భీష్ముఁ డెట్ల
య్యిరువురకును బుట్టె ? దీని నెఱిఁగింపు మొగిన్

యువర్స్ లవ్వింగ్లీ... 39

ఆ ఆత్మ భరణిని కాంటాక్ట్ చేయడానికి ఎంచుకున్న మాధ్యమాలు- ఉత్తరాలు, సెల్ ఫోన్ కాల్స్. దీన్ని బట్టి చూస్తే బ్రతికున్నపుడు తను తిరిగిన పరిసరాల పట్ల, తను ఇష్టంగా ఉపయోగించుకున్న మాధ్యమాలపట్ల చనిపోయిన సంధ్యకి మక్కువ పోలేదని, అటువంటి చోట సంధ్య ఆత్మ భరణికి కనిపిస్తోందని అర్థవౌతోంది.
ఊరి చివరనున్న భరణి వాళ్ళ గెస్ట్‌హౌస్‌లో చాలాసార్లు సంధ్య భరణితో గడిపింది. ఆ గెస్ట్‌హౌస్ అంటే కూడా సంధ్యకి చాలా ఇష్టం. అందుకే సంధ్య ఆత్మ భరణిని అక్కడికి లాక్కెళ్ళింది. తనకిష్టమైన భరణిని అక్కడే హత్య చేసి తనలో కలిపేసుకుంది’’.

వరలక్ష్మి మురళీకృష్ణ

హరివంశం 204

ఇంద్రుడు కూడా సకల దేవతా గణాలతో, అప్సరసలతో కృష్ణుడు ద్వారక చేరటానికి ముందే వచ్చి ద్వారకానగరాన్ని సకల సౌందర్య విరాజితంగా అమరావతికన్నా వైభవోపేతంగా అలంకరింపజేశాడు. భవుడూ, భవానీ, స్కందుడు కూడా ద్వారకా నగరం ఉపవనాలలో ఒకదానిలో విడిది చేశారు. సప్తర్షులు, సకల మునులు, దేవతలు, వసురుద్రాదిత్యులు అందరూ ద్వారకా నగరానికి శ్రీకృష్ణుడి ఆగమన శోభన వైభవాన్ని దర్శించి ఆనందించటానికి కుతూహలులై వచ్చారు. యాదవ ప్రముఖులందరూ ఎప్పుడెప్పుడు తమ ప్రభువు వస్తున్నాడా? అని ఎదురుచూశారు.

ధర్మో రక్షతిః రక్ష

ధర్మో రక్షతిః రక్ష అనేది మన వేద వాక్కు. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది అనే భావం. ధర్మం అంటే ఏమిటి? ధర్మం అనేది మతానికి, ఓ వర్గానికి సంబంధించి కాదు. ఆధ్యాత్మిక చైతన్యాన్ని, మానవతా విలువలు మార్గదర్శనం చేసేది ధర్మం. ధర్మం అంటే ధారణ, ఆచరించి మన జీవితంలో విలువల ద్వారా వ్యక్తియొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది.

-బ్రహ్మకుమార్ సాంబమూర్తి

మహేష్‌ యాక్షన్

మహేష్‌బాబు హీరోగా, మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంచలనాత్మక చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే భారీ అంచనాలని పెంచుకున్న ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లోనే షూటింగ్ జరుపుతున్నారు. అనల్ అరసు ఫైట్ మాస్టర్ నేతృత్వంలో సాగే ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని తెలిసింది. బ్రహ్మోత్సవం భారీ డిజాస్టర్‌తో ఎలాగైనా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలనే కసితో వున్నాడు మహేష్. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.

Pages