S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భయం గుప్పిట్లో కుక్కలగుడూర్

గోదావరిఖని, జూలై 28: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లోకి రోజు రోజుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో నీటి మట్టం విపరీతంగా పెరిగిపోతూ ముంపు గ్రామాల నిర్వాసిత కుటుంబాలు బిక్కుబిక్కుమంటున్నాయ. గురువారం ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో పాక్షికంగా ముంపునకు గురైన రామగుండం మండలంలోని కుక్కలగుడూర్ గ్రామ శివారు ప్రాంతాల్లోకి ప్రాజెక్ట్ నీరు చొచ్చుక రావడంతో గ్రామస్థులు జంకుతున్నారు. ఏక్షణాన ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందోనని.. ప్రాజెక్ట్‌లో నీటి మట్టం మరింతగా పెరిగితే గృహాలన్ని జల దిగ్బంధం అవుతుందని కుక్కలగుడూర్ గ్రామస్థులు జాగరణ చేస్తున్నారు.

ప్రాధాన్యత క్రమంలో గ్రామాల అభివృద్ధి

గంభీరావుపేట, జూలై 28: రాజకీయాలకు అతీతంగా ప్రాధాన్యత క్రమంలో గ్రామాలను అభివృద్ధి పరుస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. గురువారం మండలంలోని గజసింగవరంలో సహకార సంఘ ఆధ్వర్యంలో రూ. 40 లక్షలతో నిర్మించతలపెట్టిన గోదాం నిర్మాణానికి ఆయన శంకుస్థాపనచేశారు. హరితహారంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో అంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రెండేళ్ల ప్రభుత్వ కాలంలో గ్రామంలో రూ. 3.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు.

సింగరేణి కార్మికులకు 350 కోట్లు సకల వేతనం

గోదావరిఖని, జులై 28: ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో భాగంగా తలపెట్టిన సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికుల పాత్ర చారిత్రాత్మకం. 35 రోజుల పాటు 67,025 మంది సింగరేణి భూమి పుత్రులు విధులను బహిష్కరించి రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగస్వామ్యులు కావడంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్ర ప్రకటన చేసింది. సమ్మె కాలపు వేతనాల కోసం గడిచిన రెండేళ్లుగా ఎదురు చూస్తున్న సింగరేణి బొగ్గు గని కార్మికుల సమ్మె వేతనం చెల్లించేందుకు ఎట్టకేలకు యాజమాన్యం అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది.

మిషన్ కాకతీయకు నిధులు కేటాయించాలి

ఎల్లారెడ్డిపేట, జూలై 28: గత అరవై ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో చెరువులు నిరధారణకు గురయ్యాయి.. గ్రామీణ ప్రాంత ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. ప్రతి వర్షం చుక్కను ఒడిసి పట్టి చెరువులకు జలకళ తీసుకురావడానికి తమ ప్రభుత్వం మిషన్‌కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టింది.. అందుకు 20 వేల కోట్లు వెచ్చించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.. మిషన్ కాకతీయకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసేలా ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి కెటిఆర్ సాగీ డైరెక్టర్ డాక్టర్ కుశాల్ పథక్‌ను కోరారు. కరీంనగర్ ఎంపి వినోద్‌కుమార్ దత్తత గ్రామమైన వీర్నపల్లిలో గురువారం కుశాల్ పథక్ పర్యటించారు.

ఇండోర్ సిటీలా.. కరీంనగర్ సిటీ...

కరీంనగర్, జూలై 28: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలోని రహదారులు, ఇతరత్రా సౌకర్యాలు ఎలా ఉన్నాయో అదే తరహాలో కరీంనగర్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. గురువారం నగరంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల తాము ఇండోర్‌లో పర్యటించి ఆధ్యయనం చేశామన్నారు. రాష్ట్రంలోనే కరీంనగర్ నగరాన్ని నెంబర్ వన్‌గా నిలుపుతామని, ఇందుకు నగర ప్రజలు సహకరించాలని కోరారు.

2017 లోపు మధ్యమానేరు పనులు పూర్తి

ఇల్లంతకుంట, జూలై 28: జిల్లాలోని సిరిసిల్ల మధ్యమానేరు పనులను 2017 లోపు పూర్తి చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని కందికట్కూరు శివారు పల్లె అయిన గుర్రంవానిపల్లెలో నిర్మిస్తున్న మధ్యమానేరు ప్రాజెక్టు స్పిల్‌వేను ఆయన పరిశీలించారు. మధ్యమానేరు లోకి నీరు రావడంపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. 2017లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మధ్యమానేరులో ముంపునకు గురైన నిర్వాసితులందరికి న్యాయం జరిగేలా చేస్తామన్నారు. నిర్వాసితులందరికి బకాయిలు కూడా చెల్లించడనికి సిద్ధంగా ఉన్నాయన్నారు.

మధ్య మానేరు పూర్తిచేసి మల్లన్నసాగర్ నింపుతాం

బోయినపల్లి, జూలై 28: మధ్యమానేరు జలాశయ నిర్మాణాన్ని పూర్తి చేసి ఇందులో నీటితో మల్లన్న సాగర్ ప్రాజెక్టు నింపుతామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. గురువారం మండలంలోని మానువాడ వద్ద నిర్మిస్తున్న మధ్యమానేరు జలాశయం స్పిల్‌వే నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మధ్యమానేరు నిర్మాణపు పనులు అర్ధాంతరంగా ఆగిపోవడంతో రాష్ట్రం ఏర్పడిన తరువాత టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి త్వరలో పూర్తి చేస్తుందన్నారు. ఈ జలాశయం పూర్తయితే ఇక్కడ నిలువ ఉంచిన నీటితో మెదక్ జిల్లాలోని మల్లన్న సాగర్‌కు తరలిస్తామన్నారు.

మొక్కలు నాటడంతో పాటు సంరక్షించాలి

సుల్తానాబాద్, జూలై 28: మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని జిల్లా జడ్జి నాగమారుతి శర్మ అన్నారు. గురువారం మండలంలోని కొదురుపాక గ్రామ పంచాయతీ పరిధిలోని దేవునిపల్లిలో గల లక్ష్మినంబులాద్రి స్వామి దేవాలయం ఆవరణలో ఆయన మొక్కలను నాటారు. ఈసందర్భంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కల పెంపకం ఒక్కటే మార్గమన్నారు. నాటిన మొక్కలను బాధ్యతగా సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లోకిని కోమలత, లోక్ అదాలత్ సభ్యుడు ఆనంద రావు, అడ్వకేట్ ఆలూరి శ్రీనివాస రావు పాల్గొన్నారు.

2017 లోపు మధ్యమానేరు పనులు పూర్తి

ఇల్లంతకుంట, జూలై 28: జిల్లాలోని సిరిసిల్ల మధ్యమానేరు పనులను 2017 లోపు పూర్తి చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని కందికట్కూరు శివారు పల్లె అయిన గుర్రంవానిపల్లెలో నిర్మిస్తున్న మధ్యమానేరు ప్రాజెక్టు స్పిల్‌వేను ఆయన పరిశీలించారు. మధ్యమానేరు లోకి నీరు రావడంపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. 2017లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం విలేఖరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మధ్యమానేరులో ముంపునకు గురైన నిర్వాసితులందరికి న్యాయం జరిగేలా చేస్తామన్నారు. నిర్వాసితులందరికి బకాయిలు కూడా చెల్లించడనికి సిద్ధంగా ఉన్నాయన్నారు.

అందరి సహకారంతో వీర్నపల్లికి గుర్తింపు

ఎల్లారెడ్డిపేట, జూలై 28: మారుమూల పల్లెను తాను దత్తత తీసుకుంటే కొందరు సాధ్యమవుతుందా.. అని ప్రశ్నించారు. మధ్యలోనే వదిలి వెళ్లిపోతారని హేళనగా మాట్లాడుకున్నారు. అందరి సహకారంతో అభివృద్ధి పరిచి దేశంలో వీర్నపల్లికి గుర్తింపు తీసుకు వచ్చామని కరీంనగర్ ఎంపి బోయనపల్లి వినోద్‌కుమార్ అన్నారు. గురువారం ఆయన మంత్రి కెటిఆర్, సాగీ డైరెక్టర్ కుశాల్ పథక్‌లతో కలిసి పర్యటించారు. ఎంపి వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేని వీర్నపల్లిని మంత్రి కెటిఆర్ సహకారంతో ముందు వరుసలో నిలిపాలని అన్నారు. ఎనిమిది గిరిజన తండాలను కలుపుతూ రింగ్ రోడ్డును నిర్మించామని అన్నారు. ఉపాధి అవకాశాలు కల్పించామని అన్నారు.

Pages