S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊహించని చొరబాటు!

గోడ దూకడం తోడేలునకు నిరంతర కృత్యం..చైనా మళ్లీ గోడ దూకింది! ఈసారి ఉత్తరఖండ్‌లోకి చొరబడింది! ఒకచోట దూకుతున్న తోడేలును కాపరులు కనిపెట్టనంతవరకు ఆ వికృత మృగం దూకుతూనే ఉంటుంది! కనిపెట్టిన కాపరులు తోలడానికి తరమడానికి బద్ధకించినట్టయితే ఆ కోరల వృకానికి మరింత ధైర్యం వస్తుంది. తరమడానికి వెళ్లినట్టయితే ఆ హింసమృగం తమను కూడ కరిచి గాయపరస్తుందన్న భయం కాపరులకు కలిగితే మరీ ప్రమాదం. యథేచ్ఛగా తోడేలు చీకటి పడగానే గోశాలల గోడలను దూకుతూనే ఉంటుంది..ఆవుల గొంతులను కొరుకుతునే ఉంటుంది..అలా గొంతులను కొరికి గాయపరచడం తోడేలు సహజ స్వభావం.

సీమలో హైకోర్టు

హైకోర్టు తమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలన్న రాయలసీమ నేతల డిమాండ్ సహేతుకమైంది. నిజానికి ఇది 1937లో కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన తెలుగు నేతలు, రాయలసీమ వారికి ఇచ్చిన హామీ కూడ. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం..ఆంధ్రలో రాజధాని ఉన్నట్లయతే, హైకోర్టును మాత్రం రాయలసీమలో ఏర్పాటు చేయాలి. విశాఖపట్టణంలో విశ్వవిద్యాలయం ఎట్లాగూ ఉన్నది. అదేవిధంగా రాయలసీమలో విశ్వవిద్యాలయం ఉన్నప్ప టికీ, హైకోర్టు ఏర్పాటుకు అప్పట్లో కోస్తాంధ్ర నేతలు అంగీకరించారు. ఈ ఒప్పందాన్ని ఇప్పుడు గౌరవిం చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హైకోర్టు ఏర్పాటు కర్నూలులోనా లేక తిరుపతిలోనా అన్నది రాయలసీమ వాసుల అభీష్టం మేరకు నిర్ణయంచాలి.

నియామకాలపై నిర్లక్ష్యం తగదు

ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో పారదర్శకత, స్పష్టత లోపిస్తున్నది. ఉద్యోగ నియామక ప్రక్రియలలో ప్రభుత్వ విధానం రానురాను మోసపూరితంగా మారుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో ప్రభుత్వం అసలు ఎటువంటి నిబంధనలు, నియమాలు పాటించడం లేదు. ఉద్యోగ నియామక ప్రక్రియలలో చివరకు నోటిఫికేషన్ ప్రక్రియ కనుమరుగవుతున్నదంటే మన ప్రభుత్వాల పనితీరు, చేతగానితనం ఇట్టే అర్ధమవుతుంది. తీవ్రమైన లొసుగులతో నిరుద్యోగులను మోసపుచ్చేలా ప్రభుత్వ ఉద్యోగ నియామక బోర్డులు పనిచేస్తున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు.

- డి.చాంద్ బాష

పాఠ్యపుస్తకాల్లోనూ స్ర్తీ వివక్ష

పాఠ్యపుస్తకాలు సామాజిక ప్రతిబింబాలు. సామాజిక విలువలను, ఆశయాలను, ఆకాంక్షలను, అవసరాలను అక్షర రూపంలో అందించి అభ్యసనానుభవాలను, ఆమోదయోగ్యమైన వైఖరులను కలిగించి విద్యార్థుల సమగ్రమూర్తిమత్వాభివృద్ధికి దోహదపడే సాధనాలుగా విద్యావేత్తలు వాటిని గుర్తించారు. జాతీయ విద్యావిధానం 1986 విద్యా ప్రణాళికలో దేశ పాఠశాలలన్నింటిలోను పది వౌలికాంశాలు విధిగా పొందుపరచాలని నిర్దేశించింది. 1. భారతదేశ స్వాతంత్రోద్యమ చరి త్ర, 2.రాజ్యాంగ బాధ్యతలు 3. జాతీయ భావాలను పెంపొందించేందుకు అవసరమైన విషయాలు, 4. భారతదేశపు సామా న్య సాంస్కృతిక వారసత్వం 5. దేశ సమైక్యత 6. స్ర్తి పురుష సమానత్వం 7.

-డాక్టర్ సరోజన బండ (విశ్రాంతాచార్యులు, ప్రభుత్వ ఉన్నతస్థాయి విద్యా అధ్యయన సంస్థ)

నేను మళ్లీ జీవిస్తా

‘‘నేను మళ్లీ పుడతా.. మళ్లీ జీవిస్తా.. మనుషుల గౌరవాన్ని నిలబెట్టడం కోసం, మానవీయతను మనుషుల ప్రాథమిక హక్కుగా గుర్తింపు సాధించటం కోసం.. ఒహో.. నేను మళ్లీ జీవిస్తా..’’ కొద్దికాలం క్రితం జైపూర్‌లో జరిగిన సాహిత్య పండుగలో భారతదేశం గర్వించదగ్గ సాహితీమూర్తి మహాశే్వతాదేవి పలికిన పలుకులివి. తమ ఆశలు, కలలను నిజం చేసేందుకు రెండోసారి జీవించాలని ఉందని ఆమె అన్న మాటలు నిజం కావాలని గురువారం మధ్యాహ్నం మహాశే్వతాదేవి భౌతిక దేహం ముందు సామాన్యుడు రోదిస్తున్నాడు.

-కోవెల సంతోష్ కుమార్

ఫలించిన హరీష్ మంత్రాంగం

సిద్దిపేట, జూలై 28: కొమురవెళ్లి మల్లన్నసాగర్ నిర్మాణానికి ముంపు గ్రామాల బాధితులు స్వచ్ఛందంగా ముందుకు వస్తుండటంతో ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమవుతుంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు నిర్వాసితులతో జరుపుతున్న సంప్రదింపులు, మంత్రాంగం సఫలమవుతుండటంతో జఠిలంగా గ్రామాలు సైతం ప్రాజెక్టు నిర్మాణానికి సైఅంటున్నాయి. తమ ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేదిలేదని భీష్మించుకున్న గ్రామాలు సైతం మంత్రి హరీష్‌రావు తనదైన శైలిలో నిర్వాసితులకు నచ్చచెప్పి, మెరుగైన పరిహారంతో పాటు అన్ని విధాలుగా బాధితులను అండగా ఉంటానని స్పష్టం చేయటంతో ప్రాజెక్టు నిర్మాణానికి జై కొడుతున్నారు.

భారీ వర్షం.. రైతుల్లో ఆనందం

మెదక్, జూలై 28: మెదక్‌లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పగలంతా ఎండలు కాచాయి. సాయంత్రం 5:30 గంటల ఊరుములు, మేరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం రైతులు, ప్రజలలో ఆనందం నింపింది. రైతులు నారుమల్లు పోసి పొలాలు దుక్కులు దున్నుకొని సిగత వారం రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో గురువారం కురిసిన భారీ వర్షంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 20 శాతం అధికంగా వరి పంటలకు రైతులు మొగ్గుచుపారని మెదక్ వ్యవసాయ శాఖ అధికారి రెబల్‌సన్ మాట్లాడుతూ తెలిపారు. 1010 రకం విత్తనాలు అత్యధికంగా రైతులు ఖరీదు చేసి నారుమల్లు పోసుకున్నట్లు తెలిపారు.

డయేరియాతో వణుకుతున్న బండపోతుగల్

కౌడిపల్లి, జూలై 28: గత నాలుగు రోజులుగా డయేరియాతో కౌడిపల్లి మండలం బండపోతుగల్ గ్రామస్థులు వణికిపోతున్నారు. బుధవారం కలెక్టర్ రోనాల్డ్ రోస్ గ్రామాన్ని సందర్శించి తాగునీటి కలుషితంతో డయేరియా వ్యాప్తి చెందిందని తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం జిల్లా తాగునీటి సరఫరా విభాగం ఎస్‌ఈ చక్రవర్తి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్‌బాబు, ఆర్‌డబ్ల్యుఎస్ డిఈ కిషన్‌ల బృందం గ్రామంలోని అన్ని వీధులలోని తాగునీటి పైపులైన్ల, రక్షిత మంచినీటి ట్యాంకు, కట్‌వాల్వులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో మూడు చోట్ల లీకేజిలతో తాగునీరు కలుషితమవుతున్నట్లు అధికారులు గుర్తించారు.

ప్రాణహిత ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తిచేయాలి

సిద్దిపేట, జూలై 28: ప్రాణహిత ప్రాజెక్టు పనులన్ని త్వరిగత గతిన పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావుఅన్నారు. గురువారం రాత్రి స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, అధికారులతో మంత్రి సమీక్షించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కలసి సమన్వయంతో పనిచేయాలన్నారు. పది రోజుల్లో మళ్లీ సమీక్షలు నిర్వహిస్తానన్నారు. అధికారులు పారదర్శకతతో కూడిన నివేదికలు సిద్ధం చేయాలన్నారు. హరితహరంలో కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్క సంరక్షణ బాధ్యతను తీసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు సంరక్షణపై ప్రత్యేక బాధ్యత తీసుకోవాలన్నారు.

ఎంసెట్ లీకేజీ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి

సిద్దిపేట టౌన్, జూలై 28: ఎంసెట్ 2అక్రమాలకు నైతిక బాధ్యత వహించి వైద్యవిద్యశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని టిఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద అర్దనగ్న ప్రదర్శన నిర్వహించి నరసన తెలియజేశారు. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ జాతీయ సమన్వయ కమిటి సభ్యుడు తాటికొండ రమేష్ మాట్లాడుతూ మెడికల్ విద్యార్థులకు సంబందించిన ఎంసెట్ 2పేపర్ లీకేజి అయిందన్న నిర్థరణతో సిఐడి అధికారులు కేసునమోదు చేయడం జరిగిందన్నారు. పేపర్ లీకేజి వ్యవహారంలో సంబందిత వైద్యవిద్యశాఖ మంత్రి నేతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలన్నారు.

Pages