S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటిన మొక్కలపై నివేదికలు సమర్పించాలి

సంగారెడ్డి టౌన్, జూలై 28: హరితహారంలో భాగంగా జిల్లావ్యాప్తంగా నాటిన మొక్కలపై ఖచ్చితమైన సమాచారం సమర్పించాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో హరితహారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారంపై అధికారులు సమర్పించే నివేదికల్లో సమన్వయం కొరవడుతోందని, మండల వారీగా ఖచ్చితమైన సమాచారం సమర్పించాలని ఆదేశించారు. రోజువారీగా మూడు రకాల ప్రొఫార్మాలలో ప్రభుత్వానికి హరితహారం నివేదికలు పంపాల్సి ఉన్నందున ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదన్నారు.

శాంతి భద్రతల పరిరక్షణలో అలసత్వం వద్దు

జగదేవ్‌పూర్, జూలై 28: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు అలసత్వం వహించరాదని డిఐజి అకుల్‌సబర్వాల్ సూచించారు. గురువారం జగదేవ్‌పూర్ పోలీస్‌స్టేషన్ సందర్శించారు. ఈసందర్భంగా పోలీస్‌క్వాటర్ల ముందు మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. సరిహద్దు ప్రాంతమైనందున అనునిత్యం పోలీసులు అప్రమతంగా ఉండాలని,అనుమానితులపై ప్రత్యేక నిఘా పెట్టి శాంతిభద్రతలకు ఆటాంకం కలుగాకుండా చర్యలు తీసుకోవాలని చేప్పారు. ఆలాగే సిఎం ఫాంహౌస్‌కు చేపట్టిన పోలీస్‌భద్రత చర్యలను, భద్రత దృష్ట్య అక్కడ ఏర్పాటు చేసిన నిఘా నేత్రల పనితీరును స్థానిక ఎస్సై వీరన్నను అడిగి తెలుసుకున్నారు.

పెండింగ్ కేసులు పూర్తి చేయాలి

సంగారెడ్డి టౌన్, జూలై 28: పెండింగ్‌లో ఉన్న కేసులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి పోలీస్ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నియంత్రణ, నేర పరిశోధన, మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

ప్రతి ఎకరాకు సాగునీరందిస్తాం

పాన్‌గల్, జూలై 28: పాలమూరు జిల్లాలోని భీమ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కెఎల్‌ఐ, జూరాల ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి ప్రతి ఎకరాకు సాగు నీరు అందిస్తామని పంచాయిత్‌రాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం మండల పరిదిలోని కేతేపల్లి, గోపల్‌దినే్న, చింతకుంట, మాందాపూర్, మల్లాయిపల్లి గ్రామాల వెంట ఉన్న భీమ, జూరాల కాలువలను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ప్రన్తుతం పాలమూరు జిల్లాలో కాలువల ద్వారా నాలుగున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించటం జరుగుతుందన్నారు.

మీ పనితీరు భేష్

ఆత్మకూర్, జూలై 28: కృష్ణానదికి వరద రావడంతో దిగువ జూరాలలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు దిగువ జూరాల వద్ద జెన్‌కో డైరెక్టర్ కెఆర్‌కె రెడ్డి ఆధ్వర్యంలో రెండు యూనిట్ల ద్వారా 80 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు. దిగువ జూరాల వద్ద నిర్మిస్తున్న జల విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులో భాగంగా మొత్తం ఆరు యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు 2007 ఈ ప్రాజెక్టు శ్రీకారం చుట్టారు.

ఎత్తిపోతల సాధించేవరకు పోరాటం

దౌల్తాబాద్, జూలై 28: నారాయణపేట - కొడంగల్ ఎత్తిపోతల పథకం సాదించేవరకు పోరాటం అగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెల్చి చెప్పారు. గురువారం నారాయణపేట -కొడంగల్ ఎత్తిపోతల పథకం మహపాదయాత్ర దౌల్తాబాద్ మండలంలో కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని అనుమతులు ఉండి బడ్జెట్ కేటాయించిన నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని విస్మరించిందని ఆరోపించారు. పార్టీలన్ని ఏకమై ఈ ప్రాజెక్టును నిర్మించాలని డిమాండ్ చేస్తుంటే ముఖ్యమంత్రి కెసిఆర్ మాత్రం ఉలకడం, పలకం లేదని ఆరోపించారు.

రెండేళ్లలో 460 పంచాయతీల్లో బిటిరోడ్ల పూర్తికి చర్యలు

షాద్‌నగర్, జూలై 28: రాష్ట్ర వ్యాప్తంగా 8695 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, వాటిలో 460 పంచాయతీల్లో బిటి రోడ్లు లేవని, రెండేళ్లలో బిటి రోడ్లను పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో గురువారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 8695 పంచాయతీలకు గాను 460 పంచాయతీల్లో బిటిరోడ్లు లేవని, అందులో మహబూబ్‌నగర్ జిల్లాలోనే 185 పంచాయతీలకు ఎలాంటి రోడ్డు సౌకర్యం లేదని వివరించారు.

పిఆర్ ఉద్యోగుల పనితీరుపై ఇఎన్‌సి ఆగ్రహం

షాద్‌నగర్ రూరల్, జూలై 28: హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించేది లేదని, చర్యలు తప్పవని పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీరింగ్ చీఫ్ సత్యనారాయణరెడ్డి అన్నారు. గురువారం ఫరూఖ్‌నగర్ మండలం నాగులపల్లి గ్రామంలో పంచాయతీ రాజ్‌రోడ్డుకు ఇరువైపుల మొక్కలు నాటారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ షాద్‌నగర్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 115 కిలో మీటర్లకు 46వేల 800మొక్కలు నాటాల్సి ఉన్నప్పటికి 36 కిలో మీటర్లలో 4వేల 735 మొక్కలు నాటడం ఏమిటని స్థానిక పంచాయతీ రాజ్ అధికారుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పుష్కర భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి

గద్వాల, జూలై 28: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కృష్ణా పుష్కరాలను నిర్వహిస్తుందని, ఇక్కడ పుష్కర స్నానాల కోసం వచ్చే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. గురువారం కృష్ణానది పరీవాహక ప్రాంతాలలో నిర్మిస్తున్న పుష్కరఘాట్లను పరిశీలించారు. గద్వాల మండలంలోని బీరెల్లి, తెలుగోనిపల్లి పుష్కరఘాట్లను పరిశీలించి ట్రాఫిక్ నియంత్రణకు పలు సూచనలు, సలహాలు అందించారు. పార్కింగ్ స్థలాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని, ఘాట్‌కు దూరంగా వాహనాలు నిలిపే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.

పిడిఎస్‌యు కలెక్టరేట్ ముట్టడి

నల్లగొండ టౌన్, జూలై 28 : తెలంగాణాలో ఎంసెట్-2 పేపర్ లీకేజ్‌ను నిరసిస్తూ, అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం పిడిఎస్‌యు ఆద్వర్యంలో కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఎస్. ప్రదీప్ మాట్లాడుతూ అందుకు బాధ్యతగా విద్యాశాఖ మంత్రులు కడియం శ్రీహరి, లక్ష్మారెడ్డిలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్ధులు నష్టపోకుండా వారికి న్యాయం చేయాలని, ఇంటర్ విద్యార్ధులకు సైతం మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పిడి ఎస్‌యు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తున్నామన్నారు.

Pages