S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదేమి అన్యాయ ం...!

నల్లగొండ, జూలై 28: టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటం పట్ల గులాబీ తమ్ముళ్లు గుస్సా వ్యక్తం చేస్తున్నారు. టిఆర్‌ఎస్ జిల్లా, నియోజకవర్గ, మండల నేతలు కార్పోరేషన్ పదవులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, దేవాలయ కమిటీల చైర్మన్లపై ఆశలు పెట్టుకున్నారు. వారి ఎదురుచూపులు రెండేళ్లు గడిచినా ఫలించకపోతుండటం..పైగా కొత్త జిల్లాల ఏర్పాటు పిదపనే నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం యోచిస్తుండంతో మరికొంత కాలం నిరీక్షణ తప్పని దుస్థితి నెలకొంది.

కళ్లకు కట్టిన అభివృద్ధి

మిర్యాలగూడ, జూలై 28: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత జరుగుతాయన్న మార్పులు కళ్లకు కొట్టొచ్చినట్టు జరుగుతున్నాయని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో హరితహారం, ఇండోర్ స్టేడియం ప్రారంభ కార్యక్రమం అనంతరం ఎన్‌ఎస్‌పి మైదానంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ వస్తే జరిగే పనుల గురించి ప్రజలు ఏది ఆలోచించారో అదేచేసి దేశంలోనే సిఎం కెసిఆర్ నంబర్ వన్ ముఖ్యమంత్రి అయ్యారని ఆయన అన్నారు. గతంలో పాలకులు వందేళ్లలో చేయలేని పనులను రెండేళ్లలో కెసిఆర్ చేసి చూపిస్తున్నారని ఆయన అన్నారు.

‘బస్వాపురం రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలి’

భువనగిరి, జూలై 28: బస్వాపురం రిజర్వాయర్ సామర్థ్యాన్ని 11.38టి ఎంసిలకు తగ్గించి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని, భూనిర్వాషితులకు 2013్భసేకరణ పునరావాసం చట్టం క్రింద నష్టరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం భువనగిరి ఆర్‌డిఒ కార్యాలయం ముందు బస్వాపురం రిజర్వాయర్ భూనిర్వాసితులు నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు ముఖ్యఅతిధిగా విచ్చేసిన జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ రిజర్వాయర్ సామర్ధ్యాన్ని తగ్గించి గ్రామాలు ముంపుకు గురికాకుండా ప్రాజెక్టులు నిర్మించాలని అన్నారు.

సూర్యాపేట ఆర్డీవో హల్‌చల్

సూర్యాపేట, జూలై 28: ఇటీవలే సూర్యాపేట ఆర్డీవోగా బాధ్యతలు స్వీకరించిన సి.నారాయణరెడ్డి పాలనలో తనదైన మార్క్ చూపేడుతున్నారు. బాధ్యతలు స్వీకరించిన రెండోరోజే ఏరియా ఆసుపత్రిని, ఫైలేరియా విభాగాన్ని తనిఖీచేసి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు ఉద్యోగులకు మోమో జారీచేశారు. కాగా గురువారం ఆర్డీవో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తనిఖీలు, మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు వివిధవర్గాలతో సమావేశాలు నిర్వహించి మార్పుదిశగా ముందుకు సాగుతున్నారు. పట్టణంలో ఇష్టారాజ్యంగా వాటర్‌ప్లాంట్లు నిర్వహిస్తున్న విషయం తన దృష్టికి రావడంతో పట్టణంలోని పలు వాటర్‌ప్లాంట్లను తనిఖీచేశారు.

ఫిల్టర్‌బెడ్‌ను పరిశీలించిన ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ

బాసర, జూలై 28: బాసర గ్రామానికి, ఆలయానికి తాగునీరు అందించే ఫిల్టర్‌బెడ్‌ను గురువారం జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మల్లేష్‌గౌడ్ పరిశీలించారు. గోదావరిలో పుష్కలంగా నీరు ఉన్నా గ్రామానికి, ఆలయానికి తాగునీరు సరఫరా కావడం లేదని స్థానిక సర్పంచ్ శైలజా సతీశ్వర్‌రావు ఎస్‌ఈ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నెల 31 నుండి అంత్యపుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బాసర ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఫిల్టర్‌బెడ్‌ను పునరుద్దరించి తాగునీరు అందించేలా కృషిచేయాలని కోరారు. స్పందించిన ఎస్‌ఈ మల్లేష్‌గౌడ్..

దళారుల జోక్యాన్ని తగ్గించేందుకే ఆన్‌లైన్‌లో రవాణాసేవలు

ఆసిఫాబాద్, జూలై 28: దళారుల జోక్యాన్ని తగ్గించేందుకే ప్రభుత్వం రవాణా సేవలను అన్‌లైన్ ద్వారా అందించేందుకు సిధ్దమైందని ఆసిఫాబాద్ సబ్‌కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. ఆగష్టు 2వ తేదీ నుండి ఈసేవలు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో డివిజన్‌లోని ఆయా మండలాలకు చెందిన మీసేవ, ఈసేవ నిర్వాహకులకు గురువారం డివిజన్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబ్‌కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రవాణా శాఖలోని 59సేవలను అన్‌లైన్‌లో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ధృవపత్రాలు కావాలన్నా వినియోగ దారులు సంభందిత మీసేవ, ఈసేవల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ముగిసిన కానిస్టేబుల్ అభ్యర్థుల దేహాదారుఢ్య పరీక్షలు

ఆదిలాబాద్ రూరల్, జూలై 28: కానిస్టేబుళ్ళ ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈనెల 15 నుండి అభ్యర్థులకు నిర్వహించిన దేహాదారుఢ్య పరీక్షలు గురువారంతో ముగిశాయని జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ తెలిపారు. చివరి రోజు గురువారం హెడ్‌క్వార్టర్స్‌లోని పరేడ్ మైదానంలో నిర్వహించిన పరీక్షలకు 455 మంది అభ్యర్థులు హాజరుకాగా వారికి ముందుగా 800 మీటర్ల పరుగు పరీక్షను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ పరీక్షలో 180 మంది అర్హత సాధించగా వీరికి నేడు 100 మీటర్ల పరుగు, షాట్‌పుట్, లాంగ్‌జంప్, హైజంప్ విభాగాల్లో పరీక్షలు ఉంటాయని అన్నారు. అదే విధంగా 65 మంది మహిళా అభ్యర్థులు హాజరుకాగా వీరిలో 49 మంది అర్హత సాధించడం జరిగిందన్నారు.

నాటిన మొక్కలను సంరక్షించాలి

వేమనపల్లి, జూలై 28: హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం నీల్వాయి వాగులో నాటుపడవలో ప్రయాణం చేసి మండల కేంద్రమైన వేమనపల్లిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం ఉద్యమంలా కొనసాగుతుందన్నారు. మండలంలోని నీల్వాయి, దస్నాపూర్, వేమనపల్లి, గొర్లపల్లి పునరావాస కాలనీలలోని పాఠశాలల్లో ఆయన విద్యార్థులతో కల్సి మొక్కలను నాటారు. కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంసెట్ లీకేజీపై ప్రభుత్వం బాధ్యత వహించాలి

బెల్లంపల్లి, జూలై 28: అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఎంసెట్ 1,2 పేపర్ లీకేజీ ప్రధాన నిందితుడు రాజగోపాల్ రెడ్డి,ఎంసెట్ కన్వీనర్ రమణారావు,విద్యా,వైద్య రాష్ట్ర మంత్రులు కడియం శ్రీహరి,లక్ష్మారెడ్డిల పొటోలతో కూడిన ఫ్లెక్సిలను పట్టణంలోని బజార్ ఏరియాలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎబివిపి జిల్లా కన్వీనర్ చిలుముల కృష్ణ దేవరాయులు మాట్లాడుతూ చాలమంది విద్యార్థులు కష్టపడి ఎంసెట్ 1,2 పరీక్ష రాశారని ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతగానితనం, నిర్వాహణలోపం వల్ల ఎంసెట్ పేపర్‌లు లీకయ్యాయని విమర్శించారు.

ప్రజల ఆరోగ్యంలో ఆశాకార్యకర్తల పాత్ర కీలకం

ఉట్నూరు, జూలై 28: గిరిజన గ్రామాల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆశాకార్యకర్తల పాత్ర కీలకమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌వి కర్ణన్ అన్నారు. గురువారం స్థానికంగా ఆశాకార్యకర్తల సమ్మేళనం మొదటిసారి నిర్వహించా పెద్దఎత్తున ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో వైద్యాధికారికంటే ముందుగా వ్యాధులను అరికట్టడంలో ఆశాకార్యకర్తల వల్లే సాధ్యమవుతుందని అన్నారు. ఆశాకార్యకర్తల కృషివల్లనే గ్రామాల్లో ప్రజలు రోగాల బారిన పడకుండా ఉంటారని, మలేరియా, డయేరియా, కలార, మాతాశిశు మరణాల నిరోదానికి ఎంతో కృషి ఉంటుందన్నారు.

Pages