S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాజీ ఎమ్మెల్యే విఠల్‌రావ్ దేశ్‌పాండే కన్నుమూత

ఆదిలాబాద్, జూలై 28: ఆదిలాబాద్ మాజీ శాసన సభ్యుడు విఠల్‌రావు దేశ్‌పాండే (84) గురువారం హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుముశారు. 1932 ఫిబ్రవరి 1న జన్మించిన విఠల్‌రావ్ దేశ్‌పాండే గత రెండు నెలలుగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల కిందటే పరిస్థితి విషమించడంతో ఆయనను హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించగా సాయంత్రం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిరాడంబరజీవిగా, నిజాయితీ శాసన సభ్యునిగా జిల్లాలో పేరున్న గాంధేయవాధి విఠల్‌రావ్ దేశ్‌పాండే ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు.

నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలి

నిర్మల్, జూలై 28: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పకడ్భందీగా అమలయ్యే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్‌లోని ఆర్డీవో కార్యాలయ సమావేశ మందిరంలో హరితహారం కార్యక్రమంపై నియోజకవర్గస్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాలని ఆదేశించారు. మొక్కల ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాటి ప్రయోజనాలను తెలియజేయాలన్నారు.

ఆర్థిక ఇబ్బందులతో గిరిజన యువ జంట ఆత్మహత్య

జన్నారం, జూలై 28: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక, సంతానం కాలేదన్న మనస్థాపంతో ఓ గిరిజన యువ దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గోండుగూడెంలో విషాదం నింపింది. వివరాల్లోకి వెళితే జన్నారం మండలం కలమడుగు గ్రామ పరిధిలోని గోండుగూడకు చెందిన పెందూర్ కిరణ్ (26) పెందూర్ అంజలి(23)కి మూడేళ్ల కిందట వివాహం జరిగింది. పేదరికంతో మగ్గుతున్న ఈ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు అధికం కావడం, మరోవైపు మూడేళ్లు గడిచిన సంతానం లేదన్న చింత అప్పుడప్పుడు కుటుంబంలో మనస్పర్థల కారణంగా వీరిద్దరూ బుధవారం రాత్రి ఇంట్లో పడుకున్న సమయంలో పురుగుల మందు తాగారు.

విరివిగా మొక్కలు నాటుదాం

నిర్మల్, జూలై 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రెండవ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు స్వచ్చందంగా పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని ఏ ఎన్ రెడ్డి కాలనీ, మల్లన్నగుట్టపై గల అయ్యప్ప ఆలయ ఆవరణలో, పాత బస్టాండ్‌లోని జామా మసీదు ఆవరణలో, ఆర్డివొ కార్యాలయ ఆవరణలో మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయా ప్రాంతాల్లో మాట్లాడుతూ హరితహారంలో భాగంగా విరివిగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదామన్నారు.

సాగరకన్యల సాహస వేట

సముద్ర జలాల్లో చకచకా ముందుకు దూసుకుపోయేవారు మత్స్యకన్యలు కారు. అలాగని వారు స్కూబా డైవింగ్ హాబీగా కలిగిన ప్రొఫెషనల్స్ కూడా కారు. వాళ్లను మించిన నైపుణ్యంతో సముద్రపు లోతుల్లో వేటాడే హాన్యోలు దక్షిణ కొరియాలోని బేజు ద్వీపంలోని మహిళలు. పదిహేనేళ్ల బాలిక నుంచి ఎనభై ఏళ్ల బామ్మవరకు చేపవలే వేగంగా, చాకచక్యంగా సముద్రపు లోతులకు చేరుకుంటారు. అక్కడ లభించే సముద్ర సంపదను తెచ్చుకుని పంచుకుంటారు. స్కూబా డైవింగ్‌కి కావలసిన ఎలాంటి పరికరాలు అంతగా ఉపయోగించకుండానే సముద్రం లోపలికి సాగిపోవడం వీరి ప్రత్యేకత. ప్రపంచంలోనే అత్యంత వేగంగా, చాకచక్యంగా ఈదగల ఫ్రీ డైవర్లుగా వీరికి పేరుంది.

-గాయత్రి

కలువరేకుల్లాంటి కనుబొమలు..

ఒత్తయిన కనుబొమలున్న మహిళ ఇట్టే ఆకర్షిస్తోంది. కనుబొమలు కంటికే కాదు అమ్మాయిల అందాన్ని ఇనుమడింపజేస్తోంది. పుట్టుకతోనే కొంతమందికి వత్తయిన కనుబొమ్మలు ఉంటాయి. పలుచగా ఉండే కనుబొమలను తీర్చిదిద్దుకోవటానికి అమ్మాయిలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎందుకంటే కనుబొమలు ఒత్తుగా ఉంటే వయసు తక్కువగా కనిపిస్తుంది. కనుబొమలు ఒత్తుగా ఉంటే వారి చూపులు సైతం ఆకర్షిస్తాయి. అలాంటివారు తమ కనుబొమలను ఒత్తుగా చేసుకునేందుకు, సహజ సిద్ధమైన దినుసులతో చక్కగా చేసుకోవచ్చు.
ఇలా చేయండి...

పసితనం నుంచే శిక్షణ

ఏడెనిమిదేళ్ల వయసు వచ్చేసరికే బాలికలకు ఈ వేటలో శిక్షణనివ్వడం మొదలుపెడతారు. శిక్షణ కూడా అత్యంత కఠినంగా ఉంటుందట. అలా సుమారు ఏడేళ్లపాటు వారికి వేటలో వెళకువలను నేర్పించి, అప్పటికే అనుభవం సంపాదించిన మహిళల నేతృత్వంలో శిక్షణ ఇచ్చి పదిహేనేళ్ల వయసు వచ్చేసరికి వారిని వేటకు పంపిస్తారు.

రుచికి పెట్టింది పేరు..

వంటింట్లో ఎన్ని సుగంధ ద్రవ్యాలున్నా గుప్పుమని కమ్మని సువాసనలు వెదజల్లుతూ ఆహార పదార్థాలను తయారుచేసుకోవాలన్నా.. మానవ శరీరంలోని వాత, పిత్త, కఫ దోషాలలో ఏ ఒకటి దరిచేరకుండా కాపాడాలన్నా.. కావలసింది ఇంగువ. హింగువతో గుబాళించే తాలింపు పెట్టినే ఏ ఆహార పదార్థమైనా రుచికరమే. ఇన్ని సుగుణాలున్న ఇంగువతో కొన్ని చిట్కాలు చూద్దాం.
- తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవడానికి ఇంగువ బాగా పనిచేస్తుంది. ఇది వాడడంవల్ల రోగ నిరోధకశక్తి ఇనుమడింపజేస్తుంది. దీనికి కారణం కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, కెరటిన్, బి విటమిన్‌లు దీంట్లో పుష్కలంగా లభ్యమవడమే.

-హర్షిత

తులసి ప్రయత్నం ఫలించేనా?

అమెరికా.. ప్రపంచంలో ఎక్కువమందికి తెలిసిన పేరు ఇది. అమెరికాను భూతల స్వర్గంగా భావించే భారతీయులు ఎక్కువ. దూరపు కొండలు నునుపు అన్న చందాన భారతీయులలో ఎక్కువమంది అమెరికా వెళ్లడానికి అర్రులు చాచుతుంటారు. ప్రపంచంలో శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలిగినా అందుకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అమెరికా పాత్ర ఉంటుంది. అందుకు కారణం ప్రపంచ దేశాలన్నింటికీ, ఆయా దేశాలలో వున్న తీవ్రవాద సంస్థలకు ఆయుధాలు విక్రయించేది అమెరికానే. ఆధునిక నాగరికత అనేది అమెరికా ధరించిన ముసుగు మాత్రమే. అమెరికాలోని పలు ప్రాంతాలలో వర్ణవివక్షత ఇంకా కొనసాగుతూనే వుంది. అమెరికన్‌లకు హిందువులు అంటే చాలా లోకువ.

- పి.హైమావతి

వర్షాకాలంలో ఆహారం

వర్షాకాలం జల్లుల్లో తడిస్తే మధురానిభూతి కలుగుతుంది. అదే సమయంలో అలెర్జీలు, ఇన్‌ఫెక్షన్లను మోసుకొస్తుందని మరువవద్దు. జలుబు, దగ్గు, జ్వరం, కీళ్లనొప్పులు, శ్వాసకోశ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఇవి గనుక చుట్టుముడితే ముఖ్యంగా పిల్లలు, పెద్దల్లో రోగనిరోధక శక్తి సన్నగిల్లి నానాఇబ్బందులు పడాల్సివస్తోంది. గట్టిగా, రాయి వలే ఉండేవారు ఏ కాలాన్నైనా తట్టుకోగలరు. రోగనిరోధక శక్తి లేనివారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. దుస్తులు, ఆహార పానియాల విషయంలో శ్రద్ధవహించటం ఎంతో అవసరం. ఈ కాలంలో వేడి పదార్థాలను మాత్రమే తినాలి. దీనికితోడు పోటీ ప్రపంచంలో ఆధునిక జీవనశైలి జీవిత విధానానే్న మార్చేస్తోంది.

Pages