S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంసెట్‌-2 లీకేజీపై ఆదిలాబాద్‌, కరీంనగర్‌లో సీఐడీ విచారణ

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో నలుగురు, కరీంనగర్‌ జిల్లాల్లో ఇద్దరు విద్యార్థులకు ఎంసెట్‌-2 పేపర్‌ లీకేజీ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఎంసెట్‌ పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు రెండు రాష్ట్రాల్లో వచ్చిన ర్యాంకుల్లో భారీ తేడాలు ఉండటంతో సీఐడీ దర్యాప్తు విస్తృతం చేసింది. ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోనూ సీఐడీ విచారణ చేస్తోంది. కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, గుడిహత్నూర్‌కు చెందిన విద్యార్థులు లబ్ధి పొందినట్లు అనుమానిస్తున్నారు.

కాలిఫోర్నియాలో విమానం కూలి నలుగురి మృతి

కొలంబియా: సెస్నా310 అనే ప్రైవేట్‌ విమానం ఉత్తర కాలిఫోర్నియాలోని విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతూండగా పక్కకు ఒరిగిపోవడంతో మంటలు వ్యాపించాయని అధికారులు వెల్లడించారు. విమానంలోని నలుగురు ప్రయాణికులు మృతిచెందారు. సిబ్బంది వచ్చి మంటలు అదుపుచేసేలోపే విమానం పూర్తిగా కాలిపోయినట్లు పేర్కొన్నారు.

రైలు కిందపడి తల్లీకొడుకు ఆత్మహత్య

వరంగల్ : రైలు కింద పడి తల్లీ కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కేసముద్రం మండలం ఇంటికన్నెలో గురువారం చోటుచేసుకుంది. ఈజరిగింది. కుటుంబ కలహాల నేపధ్యంలోనే వీరు ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.

శ్రీశైలం జలదోపిడీపై త్వరలో బైరెడ్డి దీక్ష!

ర్నూలు: శ్రీశైలం నుంచి 10 టీఎంసీలను వదలడం రాయలసీమ వాసుల గొంతుకోయడమే అని రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డిరాజశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. శ్రీశైలం జలదోపిడీపై త్వరలో దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. కృష్ణా బోర్డు నిర్ణయాలు సీమకు ఉరితాళ్లుగా మారుతున్నాయని ధ్వజమెత్తారు.

రేపు రాజ్యసభకు జీఎస్‌టీ బిల్లు

ఢిల్లీ : జీఎస్‌టీ (వస్తువులు, సేవల పన్ను) బిల్లును శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లుకు సవరణలను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకారం తెలిపాయి. జీఎస్‌టీ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదించింది. ఒక శాతం మాన్యుఫ్యాక్చరింగ్‌ పన్నును ఉపసంహరణ, మొదటి ఐదేళ్ళలో రాష్ట్రాలకు సంభవించే రెవిన్యూ నష్టానికి పరిహారం చెల్లింపు వంటి సవరణలను కేబినెట్ ఆమోదించింది. రాజ్యసభ ఆమోదం తెలిపితే లోక్‌సభలో ప్రవేశపెడతారు. ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లోనే జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందుతుందని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది.

అమర్‌నాథ్‌ యాత్ర నిలివేత

శ్రీనగర్‌ : కొండచరియులు విరిగిపడుతుండడంతో అమర్‌ నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భారీ వర్షాల
కు జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిని మూసివేశారు. జమ్మూలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అమర్‌నాథ్‌ వైపు వెళుతున్న 800 ముంది మధ్యలోనే ఆగిపోయారు. శాంతి భద్రతల దృష్ట్యా ఇటీవల కొన్ని రోజుల పాటు అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేశారు. ముళ్లీ ఇప్పుడు యాత్రకు ఆటంకాలు ఎదురయ్యాయి.

ఎసిబికి చిక్కిన ఎస్‌ఎస్‌సి బోర్డు డైరెక్టర్

హైదరాబాద్: డిఎడ్ విద్యార్థుల నుంచి వెయ్యి రూపాయల చొప్పున లంచం పుచ్చుకుంటుండగా ఎపి ఎస్‌ఎస్‌సి బోర్డు డైరెక్టర్ ప్రసన్నకుమార్‌ను గురువారం నాడు ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

ఎంసెట్-2 లీకేజీపై బిజెవైఎం ధర్నా

హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీక్‌కు సంబంధించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ జెఎన్‌టియు ఎదుట భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు గురువారం ధర్నా జరిపారు. పరీక్ష నిర్వహణలో ప్రభుత్వం అసరమర్ధత వల్ల అమాయక విద్యార్థులు ఇక్కట్ల పాలవుతున్నారని అన్నారు. జెఎన్‌టియు వద్ద ఉద్రిక్తత నెలకొనడంతో కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.

కడియం, లక్ష్మారెడ్డిలను తొలగించాలి

హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్-2 పేపర్ లీకేజీకి ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్య-ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డిలను పదవుల నుంచి వెంటనే తొలగించాలని ఓయు నిరుద్యోగ జెఎసి డిమాండ్ చేసింది. లీకేజికి కారకులైన వారిని శిక్షించాలని కోరుతూ గురువారం నిరుద్యోగ జెఎసి ఆధ్వర్యంలో ఓయులో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఎంసెట్-2 లీక్‌లో ఓ కీలకవ్యక్తి పాత్ర!: రేవంత్

హైదరాబాద్: ఎంసెట్-2 పేపర్ లీకేజీలో తెలంగాణ ప్రభుత్వంలోని ఓ కీలకవ్యక్తి ప్రమేయం ఉందని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి గురువారం ఆరోపించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే వ్యక్తులే లీకేజీకి కారకులని, కొంతమంది దళారులను అరెస్టు చేసి జైలుకు పంపితే సరిపోదన్నారు. పేపర్ లీక్‌కు సంబంధించిన మూలాలు దిల్లీ, ముంబయిలో ఉన్నందున సిబిఐ చేత విచారణ జరిపించాలన్నారు. విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డిని తక్షణం పదవుల నుంచి తొలగించి సమగ్ర దర్యాప్తు జరపాలన్నారు.

Pages