S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువర్స్ లవ్వింగ్లీ..32

‘నీ సబ్జెక్ట్ కాదు కదా? ఈ పుస్తకం తీసుకున్నావెందుకు?’’ అడిగిందామెని ఆశ్చర్యంగా.
‘‘సైకాలజీ నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్. నాకు ఖాళీ దొరికినపుడల్లా ఆ పుస్తకాలు చదువుతుంటాను. ప్రతీ ఒక్కరూ చదివి తెలుసుకోవాల్సిన పుస్తకాలు ఇవి. నువ్వు కూడా చదువు వీలైతే’’
హరితకి మొదటి రోజు ఆమెని చూసిన సందర్భం గుర్తుకు వచ్చింది. తనెంతో ఆకట్టుకున్న ఆమె కళ్ళలో ఎదుటివాళ్ళని కట్టిపడేసేలాంటి ఆ శక్తి ఏమిటో ఆమె కప్పుడు అర్థమయ్యింది. ఆ శక్తి ఆకర్షణతోనో, అందంతోనో, డబ్బుతోనో వచ్చింది కాదు.. విజ్ఞానంవల్ల వచ్చింది!

వరలక్ష్మి మురళీకృష్ణ

నేర్చుకుందాం

తే. ఏను నీ యింతియును గాని యెఱుఁగ రన్యు
లర్థిఁ గణ్వమహాముని యాశ్రమంబు
నందు గాంధర్వవిధి వివాహమునఁ గరము
నెమ్మిఁ జేసెన దీని పాణిగ్రహణము

హరివంశం 197

భూమ్యాకాశాలను దద్దరిల్లజేస్తూ గణ గణ గంటలు మోగుతుండగా కళ్ళు మిరుమిట్లు గొలిపేట్లు జ్వాలాయమానంగా సకల సురాసురులు భయద చకిత వీక్షణులై ఉండగా అది హరిమీదకు వేగంగా వస్తుండగా శ్రీకృష్ణుడు ప్రతిశస్త్రాన్ని ఏమీ ప్రయోగించకుండా అశక్త్యాయుధం తనను సమీపిస్తుండగా ఒక్క హుంకారం చేశాడు యదుకులపతి. దానితో ఆ ప్రచండాస్త్రం నిస్తేజమై స్తంభించిపోయింది. అప్పుడు కృష్ణుడు తన చక్రాయుధాన్ని షణ్ముఖుడిపై ప్రయోగించడానికి సంసిద్ధుడైనాడు.

సత్యస్వరూపులు

జీవితం నలుగురితో కలసి బతికే వీలును కలిగిస్తుంది. ఏ ఒక్కరూ ఒక్కరుగా బతకలేరు. కనుకనే మనిషి సంఘజీవి అన్నారు. ప్రకృతి, పురుషుడు ఇద్దరూ పరస్పర పోషకాలు. ప్రతి మనిషి మరో మనిషితో అవసరం చేతనో లేక మరింకేదైనా పని వల్లనో మాట్లాడి వారి సహకారం తీసుకోవాలి అపుడే జీవన యానాన్ని సాగించ గలుగుతారు. ఈ క్రమంలో ఎందరో స్నేహితులు వస్తారు. మరెందరో శత్రువులు కలుస్తారు. మిత్రత్వశత్రుత్వాలు రెండూ కూడా జీవితంలో ఉంటున్నట్టు ఉంటాయే కాని అవి ఏవీ శాశ్వతం కానివి. అందుకే రాముడు లక్ష్మణునితోరావణునితో మనకున్నది శత్రుత్వం కేవలం అధర్మంతో కూడిన రావణుని చర్యలే నని చెప్పాడు.

- హనుమాయమ్మ

త్వరలో ఇంకొక్కడు

విక్రమ్, నయనతార, నిత్యామీనన్ ముఖ్యపాత్రల్లో తమిళంలో రూపొందుతున్న ‘ఇరుమగన్’ చిత్రాన్ని ‘ఇంకొక్కడు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన తెలుగు హక్కులను దక్కించుకుంది ఎన్.కె.ఆర్ ఫిలింస్. శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణ సినిమాలతో ఆకట్టుకున్న విక్రమ్, కొంత గ్యాప్ తరువాత చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్, సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన వివరాలు నిర్మాత నీలం కృష్ణారెడ్డి తెలియజేస్తూ, ‘ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన టీజర్‌తో భారీ అంచనాలు నెలకొన్నాయి.

శాటిలైట్‌లో గ్యారేజ్ సంచలనం

ఎన్టీఆర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. దీన్ని సెప్టెంబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రేడ్ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్న ఈ సినిమా బిజినెస్ కూడా 60 కోట్లకుపైగానే జరిగిందని సమాచారం. ప్రస్తుతం ఈసినిమా శాటిలైట్ హక్కులు హాట్ కేక్‌లా అమ్ముడయ్యాయట. రెండు సంచలన విజయాల తరువాత కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా శాటిలైట్ హక్కులు 12.5 కోట్లకు ఓ ప్రముఖ ఛానెల్ తీసుకున్నట్టు సమాచారం. ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్లుగా సమంత, నిత్యామీనన్‌లు నటిస్తున్నారు.

తిక్క కోసం శింబు పాట

ఈమధ్య ఓ హీరో కోసం మరో పాట పాడటం సాధారణమైంది. తమిళ హీరో ధనుష్ ఇటీవలే ఓ పాట పాడిన విషయం తెలిసిందే. సాయిధరమ్‌తేజ్ హీరోగా రూపొందుతున్న తిక్క చిత్రం కోసం ధనుష్ ఓ పాట పాడాడు. ఇపుడు ఈ సినిమా కోసం మరో తమిళ హీరో కూడా గొంతు కలిపాడు. ఒకే చిత్రంలో ఇలా ఇద్దరూ తమిళ హీరోలు పాటలు పాడటం విశేషం. తమన్ సంగీత దర్శకత్వంలో ‘తిక్క తిక్క’ అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్‌ని ధనుష్ పాడగా, ‘హీ ఈజ్ హాట్ షాట్’ అంటూ సాగే పాటను శింబు పాడాడు. ఈ సినిమాలోని పాటలు త్వరలోనే విడుదల కానున్నాయి. సునీల్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర వివరాలను నిర్మాత రోహన్‌రెడ్డి తెలియజేస్తూ,‘సాయిధరమ్ కెరీర్‌లో భారీ సినిమా ఇది.

మంచి ప్రేమకథా చిత్రం

నాగశౌర్య, పారుల్, సరయు హీరో హీరోయిన్లుగా లారెన్స్ దాసరి దర్శకత్వంలో శ్రీ సత్యవిదుర మూవీస్ పతాకంపై ఎం.వి.చౌదరి, నాగరాజ్‌గౌడ్ నిర్మిస్తున్న చిత్రం ‘నీ జతలేక’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఆగస్టు 13న విడుదలవుతున్న సందర్భంగా హీరో నాగశౌర్య చెప్పిన విశేషాలు..
అచ్చమైన ప్రేమకథ
మంచి లవ్ ఫీల్ వున్న సినిమా ఇది. ఇందులో నేను మోడల్‌గా కనిపిస్తా. కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్న ఓ యువకుడి జీవితంలోకి అమ్మాయి ప్రవేశిస్తే, అతని కెరీర్ ఎలా టర్న్ అయింది అనే మంచి పాయింట్‌తో తెరకెక్కిన సినిమా ఇది.
అన్ని రకాల అంశాలు

అలాంటి పాత్రలు కావాలట!

ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా తక్కువ సినిమాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది రాశీఖన్నా. అందానికి అందం, నటనకు నటనతో ఆకట్టుకుంటున్న ఈ భామకు తెలుగులో అవకాశాలు జోరుగా వస్తున్నాయి. ఇటీవలే సుప్రీమ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రాశి తాను ఛాలెంజింగ్ పాత్రలు కూడా చేయాలని ఆశపడుతోందట. కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా నటనతోనూ ప్రూవ్ చేసుకోవాలని వుందని చెబుతోంది. గీతాంజలి సినిమాలో తరహా పాత్రలు చేయాలని ఆసక్తిగా వుందట. ఇలాంటి పాత్రలే తనలోని నటనకు ఓ పరీక్షగా నిలుస్తాయని, అలాగే మాస్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యే అవకాశం వుంటుందని చెబుతోంది.

Pages