S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అబ్బాయితో పుట్టినరోజు వేడుక

ఆది హీరోగా వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ‘చుట్టాలబ్బాయి’ ఆగస్టులో ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇందులో ముఖ్యపాత్రలో నటిస్తున్న సాయికుమార్ తన జన్మదినం సందర్భంగా మాట్లాడుతూ, ‘నేను, ఆది కలిసి నటించాలనుకుని మంచి కథ కోసం ఎదురుచూసిన సమయంలో ఈ అవకాశం వచ్చింది. మేమిద్దరం చేసిన తొలి చిత్రం ఇది. యూనిట్ సమక్షంలో నా 55వ పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం ఆనందంగా వుంది.ఆదికి మంచి కమర్షియల్ విజయాన్ని అందిస్తుందన్న నమ్మకం వుంది’ అన్నారు. దర్శకుడు వీరభద్రమ్ మాట్లాడుతూ, ‘సాయికుమార్ ఇందులో మంచి పాత్ర చేశాడు.

భారీ సెట్స్‌లో జాగ్వార్

నూతన కథానాయకుడు నిఖిల్‌కుమార్‌ను పరిచయం చేస్తూ చెన్నాంబిక ఫిలింస్ పతాకంపై ఎ.మహదేవ్ దర్శకత్వంలో అనితా కుమారస్వామి రూపొందిస్తున్న చిత్రం ‘జాగ్వార్’. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.దేవెగౌడ మనవడైన నిఖిల్‌కుమార్‌ను తెలుగులో పరిచయం చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ- ఈ చిత్రాన్ని 75 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నామని, హాలీవుడ్ చిత్రాలకు దీటుగా హైయాక్షన్ ఎంటర్‌టైనర్‌గా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బెల్జియంలో కోట్లాది రూపాయల వ్యయంతో చిత్రీకరించిన ఛేజింగ్, ఫైట్స్ హైలెట్‌గా నిలుస్తాయని తెలిపారు.

19న సాహసం శ్వాసగా..

నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై వాసుదేవ మీనన్ దర్శకత్వంలో మిరియాల రవిందర్‌రెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగింపు దశలో వున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ- ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చే నెల 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. నాగచైతన్య, ఎ.ఆర్.రెహమాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలయికలో మరోమారు వస్తున్న ఈ మ్యూజికల్ సెనే్సషనల్ హిట్ చిత్రం ఏమాయ చేసావె చిత్రంకన్నా మరింత విజయవంతం అవుతుందన్న నమ్మకం వుందని తెలిపారు.

సన్నీలియోన్ సరికొత్త రికార్డు

ఏదేమైనా సన్నీలియోన్ తీరే వేరు. పోర్న్‌స్టార్‌గా కెరీర్‌ను ప్రారంభించిన ఆమె ఇప్పుడు సరికొత్త రికార్డులను సృష్టించడానికి సిద్ధమవుతోంది. గతంలో ఎవరూ చేయని ప్రయోగం ఆమెపై చేయనున్నారు. తన కథలో తానే నటించడం అనేది ఓ రికార్డ్. గతంలో ఇద్దరు, ముగ్గురు ఇలాంటి ప్రయోగాలు చేసినా, తన చుట్టూ వున్న పాత్రలు కూడా ఆ నిజమైన నటులే నటించడం ఇక్కడ సరికొత్త రికార్డు.

తెలుగు సావిత్రి

తెలుగు తెరపై తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకుంది మహానటి సావిత్రి. ఆమె తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఆమె జీవిత కథతో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన తన రెండో ప్రయత్నంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తికాగా, ప్రస్తుతం హీరోయిన్ అనే్వషణలో ఉన్నాడట. మహానటి సావిత్రి పేరుతో తెరకెక్కే ఈ సినిమా కోసం ఇప్పటికే పలువురు హీరోయిన్లతో చర్చలు జరిపిన నాగ్‌అశ్విన్, బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ను సంప్రదించినట్టు తెలిసింది.

దయాశంకర్ అరెస్టుపై ‘స్టే’ నిరాకరణ

లక్నో: యుపి మాజీ సిఎం, బిఎస్‌పి అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిజెపి బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ అరెస్టు వారంటుపై ‘స్టే’ ఇచ్చేందుకు అలహాబాద్ హైకోర్టు గురువారం నిరాకరించింది. దయాశంకర్ ప్రసుత్తం పరారీలో ఉండగా ఆయన తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూనే, ఈ విషయంలో వారంలోగా యుపి ప్రభుత్వం స్పందించాలని కోర్టు స్పష్టం చేసింది.

ప్రజాసాధికార సర్వే వేగవంతం : చంద్రబాబు

విజయవాడ: ప్రజాసాధికార సర్వేను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సర్వే తీరుతెన్నులపై ముఖ్యమంత్రి గురువారం తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. సాంకేతిక సమస్యలను అధిగమించి అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. సేకరించిన సమాచారం కచ్చితత్వాన్ని సరిచూసుకోవాలన్నారు.

ఎంసెట్‌-2 రద్దు చేయొద్దని సచివాలయం వద్ద ఆందోళన

హైదరాబాద్‌: ఎంసెట్‌-2 పరీక్షను రద్దు చేయొద్దని డిమాండ్‌ చేస్తూ గురువారం విద్యార్థులు, తల్లిదండ్రులు సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. పరీక్ష రద్దు చేస్తే వూరుకునేది లేదన్నారు. పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తే దానిని సవాల్‌ చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరిస్తున్నారు. కొందరు స్వార్థపరులు చేసిన తప్పుకు తమను బాధ్యులు చేయడం సరికాదన్నారు.

ఎంసెట్‌-2లో రెండు సెట్ల పేపర్లు లీక్‌ : సీఐడీ

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌-2లో రెండు సెట్ల పేపర్లు లీకయ్యాయని సీఐడీ గురువారం ప్రకటన చేసింది. ‘ హైదరాబాద్‌, ఏపీ, బెంగళూరులో కొందరు బ్రోకర్లను గుర్తించాం. ఇప్పటివరకు విష్ణుధర్‌ అలియాస్‌ విష్ణువర్థన్‌, తిరుమల్‌ అలియాస్‌ తిరుమలరావును అరెస్టు చేశాం. వీరిద్దరూ 25 మంది విద్యార్థులను బెంగళూరుకు తీసుకెళ్లారు. పరీక్షకు 2, 3 రోజుల ముందు ప్రశ్నాపత్రాలు వారికి అందజేశారు. 320 ప్రశ్నలు, వాటి సమాధానాలను ఇచ్చి విద్యార్థులతో ప్రాక్టీస్‌ చేయించారు. నిందితులను రేపు నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు’ అని సీఐడీ అధికారులు తెలిపారు.

ఏపీ ఎంసెట్‌ పేపర్ లీక్‌ కాలేదు: మంత్రి కామినేని

హైదరాబాద్‌: ఏపీ ఎంసెట్‌ మెడికల్‌ పేపర్ బహిర్గతం కాలేదని ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ గురువారం వెల్లడించారు. ఆగస్టు 6, 7, 8 తేదీల్లో మెడికల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠ పాలు చేసేందుకు వైకాపా ఈ విధంగా దుష్ప్రచారం చేస్తోందన్నారు.

Pages