S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉనికిని కాపాడుకునేందుకే ప్రైవేటు బిల్లు

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకే ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టిందని కేంద్రమంత్రి సుజనాచౌదరి ఆరోపించారు. ఆప్‌ సభ్యుడిపై చర్చకు కాంగ్రెస్‌ సహకరించి ఉంటే గంటన్నర తర్వాత ప్రైవేటు బిల్లుపై చర్చకు అవకాశం వచ్చేదన్నారు. గందరగోళం సృష్టించి సభ వాయిదా పడేలా కాంగ్రెస్‌ చేసిందన్నారు.

గోరఖ్‌పూర్‌లో ఎయిమ్స్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన

గోరఖ్‌పూర్‌: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఎయిమ్స్‌కు, ఎరువుల ప్లాంట్‌ పునరుద్ధరణకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. 150 ఆపరేషన్‌ థియేటర్లు, 750 పడకలతో ఎయిమ్స్‌ను ఏర్పాటుచేయనున్నారు. ఎరువుల ప్లాంట్‌ను తిరిగి ప్రారంభిస్తే 4వేల మందికి ఉద్యోగాలు లభించడంతో పాటు రైతులకు యూరియా అందుతుంది. శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు.

ప్రత్యేకహోదాపై చిత్తశుద్ధి లేని టిడిపి

దిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా సాధించాలన్న విషయంలో టిడిపికి చిత్తశుద్ధి లేదని, బిజెపిని ఒప్పించడంలో ఆ పార్టీ విఫలమైందని వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఎంపీ కెవిపి ప్రతిపాదించిన బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తోందని, ఈ విషయంలో ఎలాంటి పోరాటాలకైనా తాము సిద్ధమేనన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఎపికి ప్రత్యేక హోదా పదేళ్లపాటు ఇవ్వాలన్న బిజెపి నేతలు నేడు వౌనం వహించడం దారుణమన్నారు. ప్రత్యేకహోదా కోసం తమ పార్టీ అధినేత జగన్ దిల్లీలో నిరాహారదీక్ష చేశారని ఆయన గుర్తుచేశారు.

బిల్లును వ్యతిరేకిస్తే బిజెపికి కష్టమే: చిరంజీవి

దిల్లీ: ఎపికి ప్రత్యేకహోదా కోసం తమ పార్టీ ఎంపీ కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు బిజెపి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆ పార్టీకి మనుగడ కష్టమేనని కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి అన్నారు. రాజ్యసభకు హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేయడంతో ఆయన సినిమా షూటింగ్ వాయిదా వేసుకుని హుటాహుటిన దిల్లీ చేరుకున్నారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలూ ప్రైవేటు బిల్లుకు సహకరించాలన్నారు.

నా భర్త తలతీసే వరకూ మాయావతి నిద్రపోరు!

లక్నో: ‘నా భర్తపై పోలీసులు కేసు పెట్టారు.. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన క్షమాపణ చెప్పారు.. బిజెపి నుంచి ఆయనను బహిష్కరించారు.. అయినా బిఎస్‌పి అధినేత్రి మాయావతి ఇంకా శాంతించడం లేదు.. నా భర్త తలతీసే వరకూ ఆమె నిద్రపోరు..’- అంటూ దయాశంకర్ భార్య స్వాతి సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. మాయావతిని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన యుపి బిజెపి బహిష్కృత నేత దయాశంకర్ సింగ్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తుండగా ఈ వివాదం మరో మలుపు తిరిగింది. బిఎస్‌పి కార్యకర్తలు తనను, తన 12 ఏళ్ల కుమార్తెను వేధిస్తున్నారని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్వాతి సింగ్ మీడియాకు తెలిపారు.

మహంకాళి జాతరకు విస్తతృ సన్నాహాలు

హైదరాబాద్: ఈనెల 24, 25 తేదీల్లో జరిగే సికిందరాబాద్ మహంకాళి జాతరకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. జాతరకు ఏర్పాట్లపై ఆయన శుక్రవారం జిహెచ్‌ఎంసి, పోలీసు, ఇతర శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. మూడువేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

శ్రీనగర్‌లో కొనసాగతున్న బంద్

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్‌లో శాంతి భద్రతల పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది. పలుచోట్ల హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్‌ను భద్రతాదళాలు కాల్చిచంపినందుకు నిరసనగా సుమారు రెండు వారాలుగా కాశ్మీర్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి. శ్రీనగర్‌లో 14 రోజులుగా బంద్ కొనసాగుతోంది. వ్యాపార సంస్థలు మూతపడడం, రవాణా వ్యవస్థ స్తంభించడంతో నిత్యావసర సరకుల కోసం ప్రజలు నానా యాతన పడుతున్నారు. అధికధరలకు పాలు, కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయలేక సమస్యలతో సతమతమవుతున్నారు.

ఎస్‌ఎంఎస్‌లతో ఇక ఉద్యోగ సమాచారం

గుంటూరు: ఉద్యోగాలకు సంబంధించి నిరుద్యోగులకు ఇకపై ఎస్‌ఎంఎస్‌ల ద్వారా తాజా సమాచారాన్ని అందిస్తామని ఎపిపిఎస్‌సి చైర్మన్ ఉదయ్‌భాస్కర్ శుక్రవారం ఇక్కడ మీడియాకు తెలిపారు. తమ వెబ్‌సైట్‌లో ఉద్యోగార్థులు ఒకసారి వివరాలు నమోదు చేసుకుంటే ప్రతిసారీ దరఖాస్తు చేయనవసరం లేదని, విద్యావంతుల సమాచారం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఉంచుతామని వివరించారు. రాబోయే రెండేళ్లలో వివిధ శాఖలో సుమారు నాలుగువేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు విడుదలవుతాయన్నారు.

భగవంత్ మాన్‌పై రభస: లోక్‌సభ వాయిదా

దిల్లీ: భద్రతావ్యవస్థను దాటుకుంటూ పార్లమెంటులోకి ఎలా వెళ్లాలన్న విషయమై వీడియో తీసి సామాజిక మీడియాలో పోస్టు చేసిన ఆప్ ఎంపీ భగవంత్ మాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభలో శుక్రవారం కూడా సభ్యులు డిమాండ్ చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, దేశ భద్రతకు సంబంధించి ఎవరు ఎలాంటి తప్పు చేసినా క్షమించరాదన్నారు. ఇతర పార్టీలకు చెందిన సభ్యులు కూడా ఈ విషయమై నినాదాలు చేయడంతో గందరగోళం ఏర్పడింది. భగవంత్‌మాన్‌పై చర్యలు తీసుకుంటానని స్పీకర్ సుమిత్రా మహాజన్ హామీ ఇచ్చినప్పటికీ సభ్యులు శాంతించలేదు.

లోక్‌సభ స్పీకర్ ఎదుట హాజరైన భగవంత్ మాన్

దిల్లీ: భద్రతా వ్యవస్థను ఛేదించి పార్లమెంటులోకి వెళ్లడంపై ఓ వీడియో తీసి సామాజిక మీడియాలో పోస్టు చేసిన ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపి భగవంత్ మాన్ వ్యవహారంపై శుక్రవారం పార్లమెంటు ఉభయసభల్లో కాంగ్రెస్, బిజెపి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎదుట వెంటనే హాజరు కావాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ భగవంత్ మాన్‌కు సమన్లు జారీ చేశారు. దీంతో ఆయన స్పీకర్ ఎదుట హాజరై సుమారు 20 నిమిషాలపాటు వివరణ ఇచ్చారు. పార్లమెంటు భద్రతకు సంబంధించి వీడియో తీసిన భగవంత్‌మాన్‌పై చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు.

Pages