S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర నిధులతోనే రాష్ట్భ్రావృద్ధి

వెంకటాచలం, జూలై 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీని విమర్శించడం సరికాదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి అన్నారు. వెంకటాచలంలో మంగళవారం బిజెపి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేంద్రరెడ్డి మాట్లాడుతూ విభజన బిల్లులో హోదాపై ప్రస్తావించని కారణంగా హోదా ఇవ్వటం సాధ్యపడటం లేదన్నారు. అయితే అంతకుమించి 1.47 లక్షల కోట్ల నిధులను కేంద్రం రాష్ట్భ్రావృద్ధికి కేటాయించిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కమిటీల్లో టిడిపి కార్యకర్తలతోపాటు బిజెపి కార్యకర్తలకు కూడా చోటు కల్పించాలని ఆయన కోరారు.

కాళంగి పొర్లుకట్టను పరిశీలించిన కలెక్టర్

సూళ్లూరుపేట, జూలై 19: సూళ్లూరుపేట, తడ మండలాల్లో ముంపు ప్రాంతాలైన గొల్లలమొలువు, గోపాల్‌రెడ్డిపాళెం, ఇలుపూరు గ్రామాల పరిధిలో ఉన్న కాళంగి నది పొర్లుకట్టను మంగళవారం జిల్లా కలెక్టర్ జానకి అధికారులతో కలసి పరిశీలించారు. ఈ గ్రామాల్లో వర్షాకాలంలో కాళంగి పొంగి తరచూ ముంపునకు గురవుతుంటుంది. పొర్లుకట్టను వేసేటప్పుడు అక్కడ భూసమస్య తలెత్తడంతో కొంతదూరం పొర్లుకట్ట నిర్మించలేదు. దీంతో ఆ గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె గూడూరు సబ్ కలెక్టర్ గిరీషా, ఇరిగేషన్ ఇఇ నారాయణ నాయక్ తదితరులతో కలసి పరిశీలించి అక్కడ ప్రజలను వివరాలడిగి తెలుసుకొన్నారు.

కాళంగి గండ్లను వెంటనే పూడ్చాలి:కలెక్టర్

తడ: గత ఏడాది భారీ వర్షాలకు ఏర్పడిన కాళంగి గండ్లను వెంటనే మరమ్మతులు చేయాలని జిల్లా కలెక్టర్ జానకి ఆదేశించారు. కాళంగి నదికి పడిన గండ్లను మంగళవారం ఆమె పరిశీలించారు. గొల్లల మలుపు వద్ద పడిన గండ్లను పరిశీలించిన తర్వాత ఆమె మాట్లాడుతూ గండ్లను వెంటనే పూడ్చాలని కాళంగికి పొర్లుకట్టలను ఏర్పాటుచేస్తున్న కాంట్రాక్టర్లను ఆదేశించారు. తమకు పొర్లుకట్టల గండ్లను పూర్తిచేస్తే బిల్లును మంజూరు చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈమెతో పాటు తడ, సూళ్లూరుపేట తహశీల్దార్లు ఏడుకొండలు, రవీంద్రబాబు, సబ్ కలెక్టర్ గిరీషా, జెడ్పీటిసి శ్రీ్ధర్, రైతులు, ఇరిగేషన్ అధికారులున్నారు.

చల్లకాలువను పరిశీలించిన కలెక్టర్

కోట: మండలంలోని కర్లపూడి వద్ద అసంపూర్తిగా వున్న చల్లకాలువ పొర్లుకట్ట పనులను మంగళవారం జిల్లా కలెక్టర్ జానకి పరిశీలించారు. సుమారు నాలుగు సంవత్సరాల క్రితం పొర్లుకట్టల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే అప్పటి నుంచి మరమ్మతు పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో గత ఏడాది కురిసిన వర్షాల కారణంగా ఏర్పడిన వరదలకు కర్లపూడి వద్ద చల్లకాలువకు, పుచ్చలపల్లి వద్ద స్వర్ణముఖి నదికి భారీ గండ్లు పడ్డాయి. అప్పట్లో ఆగ్రామాలను సందర్శించిన మంత్రులు, అధికారులు గండ్లు పూడ్చేందుకు సత్వర చర్యలు చేపడుతామన్నారు.

ఆక్వా రైతులను ఆదుకోవాలి

నెల్లూరు టౌన్, జూలై 19: ఆక్వా రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సిఆర్‌డిఎ) సభ్యుడు బీద మస్తాన్‌రావు జిల్లా ఆక్వా రైతులతో కలిసి మంగళవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నివాసంలో వినతిపత్రాన్ని అందించినట్లు మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో రొయ్యలు సాగుచేస్తున్న రైతులకు సకాలంలో గిట్టుబాటు ధరలు లేక ఎంతో నష్టాన్ని చవిచూస్తున్నారని అన్నారు. వారికి ఆక్వారంగ ఎగుమతుల సుంకాన్ని రద్దుచేయాలని కోరినట్లు తెలిపారు.

పిఆర్ కండ్రిగలో పనుల నాణ్యతపై కలెక్టర్ అసంతృప్తి

గూడూరు, జూలై 19: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ దత్తత గ్రామమైన గూడూరు మండలం పుట్టంరాజువారి కండ్రిగ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల నాణ్యతపై జిల్లా కలెక్టర్ ఎం జానకి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం ఆమె పుట్టంరాజువారి కండ్రిగ గ్రామాన్ని అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని సంబంధిత శాఖ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ గ్రామంలో అభివృద్ధి పనులు 90 శాతం వరకు పూర్తయ్యాయని, అయితే జరిగిన పనుల్లో నాణ్యతాప్రమాణాలు తనకు సంతృప్తి ఇవ్వలేదన్నారు.

రూ.40 కోట్లతో 17 ఎత్తిపోతల పథకాల అభివృద్ధి

ఖమ్మం, జూలై 19: జిల్లాలో అనేక ఏళ్ళక్రితం నిర్మించిన ఎత్తిపోతల పథకాలకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రపంచ బ్యాంకు నిధుల నుంచి మంజూరు చేసిన 40.46కోట్ల ద్వారా 17 ఎత్తిపోతల పథకాలను ఆధునీకరించనున్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని ఈ 17 ఎత్తిపోతల పథకాల్లో అనేకం కొనే్నళ్ళుగా నిరుపయోగంగా ఉన్నాయి. నేలకొండపల్లి మండలంలో 4, రఘునాథపాలెం మండలంలో 1, కల్లూరులో 5, పెనుబల్లిలో 3, ఏన్కూరులో 1, వేంసూరులో 3 ఎత్తిపోతల పథకాలను ఆధునీకరించి తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ఎత్తిపోతల పథకం పరిధిలో దాదాపు 13,500 ఎకరాల ఆయకట్టు ఉంది.

దమ్మక్కకు గిరిజనం నీరాజనం

భద్రాచలం, జూలై 19: మహాభక్తురాలు దమ్మక్క సేవాయాత్ర ఆషాఢశుద్ధపౌర్ణమి వేళ శ్రీసీతారామచంద్రస్వామి సన్నిధిలో మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన గిరిజనులు మంగళనీరాజనాలు పలికారు. ఆమెను స్మరించుకుంటూ డప్పు,కొమ్ము నృత్యాలు చేస్తూ ఆనందంలో మునిగితేలిపోయారు. దమ్మక్క సేవాయాత్ర భక్తులకు ఆధ్యాత్మికతను పంచింది. భక్తిప్రవత్తులతో గిరిసంప్రదాయాలతో జరిగిన ఈ ఉత్సవంలో భాగంగా నిర్వహించిన శోభాయాత్ర గిరిజనుల ప్రత్యేకతను చాటింది. దమ్మక్క మొక్కిన స్వామికి గిరిజనులు పుష్పాలు, ఫలాలు నైవేథ్యంగా సమర్పించి ఆమె వారసత్వాన్ని చాటుకున్నారు.
ముందుగా స్వామికి అభిషేకం

జిల్లాలో 98శాతం పోలింగ్

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 19: ఆర్టీసి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. ఖమ్మం రీజియన్ వ్యాప్తంగా ఆరు డిపోల పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో కార్మికులు ఉత్సాహంగా పాల్గొని తమ సంఘాలకు మద్దతు తెలుపుతూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కార్మికుల విధులకు ఆటంకం కలగకుండా కార్మికశాఖ అధికారులు ఉదయం 5 గంటలకే పోలింగ్‌ను ప్రారంభించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం జిల్లా పరిధిలోని ఆరు డిపోల్లో 2,844 మంది ఓటర్లు ఉండగా 2,792 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జిల్లాలో కూటమికే మెజార్టీ

ఖమ్మం(మామిళ్ళగూడెం), జూలై 19: తెలంగాణ ఆర్టీసిలో గుర్తింపు సంఘానికి మంగళవారం జరిగిన ఎన్నికలు ఆసక్తికరంగా సాగాయి. మొత్తం ఓట్లలో 98శాతం ఓట్లు పోల్‌కాగా అన్ని డిపోల పరిధిలోనూ కూటమి మెజార్టీ సాధించింది. ఎంప్లాయిస్ యూనియన్, స్ట్ఫా అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కూటమిగా ఏర్పడి జిల్లాలో పోటీ చేశాయి. ఈ కూటమికి మధిరలో 215, మణుగూరులో 191, భద్రాచలంలో 256, కొత్తగూడెంలో 291, ఖమ్మంలో 418 ఓట్లు లభించాయి. కాగా గట్టి పోటీ ఇస్తుందనుకున్న టిఎంయుకు మధిరలో 85, మణుగూరులో 86, భద్రాచలంలో 202, కొత్తగూడెంలో 103, ఖమ్మంలో 183 ఓట్లు మాత్రమే లభించాయి.

Pages