S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారు

రామచంద్రపురం, జూలై 19: చదువుచెప్పించి, వివాహం చేస్తామని తల్లిదండ్రులకు హామీయిచ్చి, ఎనిమిదేళ్ల బాలికను ఇంట్లో పనిమనిషిగా పెట్టుకుని, ఆమెతో బలవంతంగా శారీరక సంబంధం ఏర్పరచుకుని, చివరకు ఆమెను హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘాతుకమిది. ద్రాక్షారామ పోలీసు స్టేషన్ పరిధిలోని తాళ్ళపొలం గ్రామంలో గత నెల 7వ తేదీ రాత్రి పప్పుల ఆదిలక్ష్మి అనే బాలిక ఉరివేసుకుని మృతిచెందినట్టు అందిన ఫిర్యాదుపై పోలీసులు జరిపిన దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

ముంగండ భారీ చోరీ కేసులో నిందితుడు అరెస్టు

డి.గన్నవరం, జూలై 19: ముంగండలో ఈ నెల 11న జరిగిన చోరీ కేసులో నిందితుడిని అరెస్టుచేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు అమలాపురం డిఎస్పీ ఎల్.అంకయ్య తెలిపారు. ఆయన మంగళవారం పి.గన్నవరం పోలీసుస్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ముంగండ గ్రామానికి చెందిన బొడ్డు కోటసత్య రమణీకుమారి ఈ నెల 12వ తేదీన తన ఇంట్లో చోరీ జరిగిందని పి.గన్నవరం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. చోరీ జరిగిన ఇంటి పక్కన అద్దెకు ఉంటున్న రాజోలు మండలం పొన్నమండ గ్రామానికి చెందిన కుక్కల శ్రీనివాసరావుపై అనుమానం రావడంతో గాలించారు.

యువకుడిపై హత్యాయత్నం

అయినవిల్లి, జూలై 18: తన సోదరిని ప్రేమిస్తున్నాడనే అక్కసుతో ఒక యువకుడిపై మరొక యువకుడు హత్యాయత్నం చేయగా గాయాలతో బయటపడిన ఘటన నేదునూరు గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అయినవిల్లి మండలం నేదునూరు గ్రామానికి చెందిన కాగిత మోహన్ (22)పై అదే గ్రామానికి చెందిన పులిదిండి నాగరాజు వేట కొడవలితో హత్యాయత్నం చేశాడు. మంగళవారం కాగిత మోహన్ ఇంటి నుండి మరుగుకోసం మురుగుకాలువ వద్దకు వెళ్లాడు. అయితే నాగరాజు సోదరి అటువైపు పశువులను మేపుతున్నదని స్థానికులు తెలిపారు. మోహన్ ఇంటికి తిరిగి వస్తుండగా కణితి భాస్కరాచార్యులు పొలం వద్ద మాటువేసిన నాగరాజు ఒక్కసారిగా మోహన్‌పై కొడవలితో దాడి చేశాడు.

కడియంలో పర్యాటక అభివృద్ధికి ప్రణాళికలు

కడియం, జూలై 19: కడియం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు జరుగుతున్నాయని అఖండ గోదావరి ప్రాజెక్టు డైరెక్టర్, టూరిజం స్పెషలాఫీసర్ భీమశంకరం అన్నారు. కడియపులంక గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం స్థానిక నర్సరీ రైతులతో భీమశంకరం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించేందుకు ఇక్కడున్న సహజమైన అందాలకు మరికొన్ని రంగులు అద్దితే దేశవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షించే అవకాశముందన్నారు. పర్యాటకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని పేర్కొన్నారు.

అమర్‌నాథ్ యాత్రలో గుండెపోటుతో మృతి

గండేపల్లి, జూలై 19: అమరనాథ్ యాత్రకు వెళ్లిన మండలంలోని కె గోపాలపురంలో ఒక భక్తుడు మృతిచెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇందుకు సంబంధించి మృతుని బంధువులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..ఈ నెల 15న అమర్‌నాథ్ యాత్రకు బుదిరెడ్డి నూకరాజు, అతని భార్య నరసమ్మ, బంధువులు మరో అయిదుగురు, అలాగే కోరుకొండ మండలం బాపూజీపేట నుంచి 40మంది భక్తులతో కలిసి అమరనాథ్ యాత్రకు బయల్దేరారు. అమరనాథ్ సమీపంలో సోమవారం రాత్రి నూకరాజు గుండెలో నొప్పి వస్తోందని చెప్పడంతో ఇక అమరనాధ్ ఆలయానికి వెళ్లకుండా దిగువనే ఉండిపోయారు. నూకరాజుకు గుండె నొప్పి ఎక్కువ కావడంతో కాట్రా గ్రామంలోని ఆసుపత్రికి తరలించారు.

‘వ్యవసాయం’లో ర్యాంకుల పంట

రాజమహేంద్రవరం, జూలై 19: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన పిజి ప్రవేశ పరీక్షలో రాజమహేంద్రవరం వ్యవసాయ కళాశాల విద్యార్థులు ర్యాంకుల పంట పండించారు. జాతీయస్థాయిలో కూడా సత్తా చాటారు. రాజమహేంద్రవరం కళాశాల విద్యార్థిని కొవ్వూరి సరిత విశ్వవిద్యాలయ స్థాయిలో ద్వితీయ, ఆంధ్రాయూనివర్శిటీ పరిధిలో ప్రథమ ర్యాంకును సాధించింది. మొత్తం 40 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, 33 మంది విద్యార్థులు అర్హత సాధించారని కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ పి జయరామిరెడ్డి తెలియజేశారు. వారిలో 12మంది 50లోపు ర్యాంకులు, 18 మంది 100లోపు, 21 మంది 150లోపు, 28 మంది 200లోపు ర్యాంకులు సాధించారని వివరించారు.

కేంద్ర మంత్రులను కలిసిన పుదుచ్చేరి సిఎం, మంత్రులు

యానాం, జూలై 19: పుదుచ్చేరిలో నెలకొన్న పలు శాఖల సమస్యలపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి నారాయణస్వామి ఆధ్వర్యంలో మంత్రుల బృందం కేంద్ర మంత్రులను కలిసిందని పుదుచ్చేరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. మంగళవారం ఉందయం కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతిని కలిసి యానాంలో పెండింగ్‌లో ఉన్న పలు పనులకు నిధులను కేటాయించమని కోరామన్నారు. యానాం దరియాలతిప్ప మార్గంలో 139 కోట్ల రూపాయలతో చేపట్టిన ఏటిగట్టు ఆధునికీకరణ నిలిచిపోయిందని, వాటికి 116 కోట్ల రూపాయలు మంజూరు చేయవలసి ఉందని ఉమాభారతి దృష్టికి తీసుకెళ్ళామన్నారు.

మహిళల సొమ్ము స్వాహా చేసిన పిఆర్‌పి, ఆర్‌పిలను అరెస్టు చేయాలి

మదనపల్లె, జూలై 19: పాచిపనులు, కూలీపనులు, తోపుడుబండ్లుపై, ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు చేసుకుని పోగుచేసి పొదుపుచేసిన పేదమహిళల సొమ్ములు, ప్రభుత్వం మహిళా సంఘాలకు మంజూరుచేసిన అభయహస్తం, జనశ్రీ్భమా యోజన పథకాల సొమ్ములతో పాటు, బినామి గ్రూపులు సృష్టించి సుమారు రూ.4కోట్లు దిగమింగిన మెప్మా పిఆర్‌పి ఉమేష్‌రావు, ఆర్‌పి వసంతలను అరెస్టుచేయాలని కాంగ్రెస్‌పార్టీ రాష్టమ్రహిళా కార్యదర్శి ఎఎస్ మహబూబ్‌జాన్, డిసిసి ఉపాధ్యక్షురాలు శ్రీదేవి, కాంగ్రెస్‌పార్టీ మదనపల్లె పట్టణాధ్యక్షురాలు విజయ, స్థానిక మహిళా నాయకురాలు రెడ్డిపార్వతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

‘ప్రేమతత్వమే సాయితత్వం’

తిరుపతి, జూలై 19: ప్రేమతత్వమే సాయితత్వమని తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, టిడిపి జిల్లా ఆరోగ్యవిభాగం అధ్యక్షురాలు డాక్టర్ ఆర్.సుధారాణి, ఐ ఎం ఎ నాయకులు సుకుమార్, భారతీయ విద్యాభవన్ ఫౌరసంచాలకులు, కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణ రాజు అన్నారు. గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాల్లో సాయినిలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సాయిబాబా ఆలయాల్లో స్వామి విగ్రహానికి విశేష అభిషేకాలు, అలంకరణలు చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని సాయి ప్రార్థనలో పులకించి తరించారు. అలాగే ఇతర హైందవ ఆలయాలు కూడా భక్తులతో కిటకిటలాడాయి.
మారుతీ నగర్‌లో..

వేదవ్యాసుని జన్మదినమే గురుపౌర్ణమి

వేదవ్యాసుని జన్మదినమే గురుపౌర్ణమిగా జరుపుకుంటున్నామని తిరుపతి సంస్కృత విద్యాపీటం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్ తెలిపారు. గురుపౌర్ణమిని పురస్కరించుకొని భారతీయ విద్యాభవన్ గౌరవ సంచాలకులు, కోశాధికారి డాక్టర్ నడింపల్లి సత్యనారాయణ రాజు ఆధ్వర్యంలో డాక్టర్ చక్రవర్తి రంగనాథన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత చక్రవర్తి రంగనాథన్ మాట్లాడుతూ ఆషాడ శుద్ధ పూర్ణిమను వేదవ్యాసుని జన్మదినంగా, అదేరోజును గురుపౌర్ణమిగా జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా గురువులను పూజించడం ఆనవాయితీగా అనుసరిస్తున్నామన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు మూలాలుగల విద్య వేదవిద్య అన్నారు.

Pages