S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేంసూరు, చౌడవరం చెరువులకు గోదావరి జలాలు తెస్తాం

వేంసూరు, జూలై 19: ఎన్ని ఆటంకాలు ఎదురైనా తమ్మిలేరు రాకపోయినా సీతారామ ప్రాజెక్టుద్వారా మూడు నాలుగేళ్లలో చౌడవరం, వేంసూరు చెరువులకు గోదావరి జలాలను తీసుకొచ్చి సస్యశామలం చేస్తానని రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళ వారం మండలంలోని చౌడవరం లోరూ.24 లక్షల వ్యయంతోనిర్మించిన మంచినీటి పథకాన్ని ఆయన ప్రారంభించారు. అదే విధంగా రూ.10 కోట్లతో గూడూరు ఎత్తిపోతల పథకాలకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు కోసం వారంలో టెండర్లు పిలుస్తున్నామన్నారు. ఇకనుండి లిఫ్టుల పని తీరు బాధ్యత ప్రభుత్వానిదేనని, వాటిని చూసుకోవాల్సిన బాధ్యత రైతులదేనన్నారు.

సామాజిక భద్రత కోసమే భూపంపిణీ

కొణిజర్ల, జూలై 19: దళితుల సామాజిక భద్రత కోసమే భూ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని స్థానిక ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ పేర్కొన్నారు. మండల పరిధిలోని గుబ్బగుర్తిలో రెండో విడత భూ పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో భూమిని పంపిణీ చేశారు. మొత్తం భూ పంపిణీకి 223 మంది దరఖాస్తు చేసుకోగా 114 మందిని అనుర్హులుగా అధికారులు గుర్తించారు. 109 మందిని అర్హులుగా గుర్తించినప్పటికీ 17 ఎకరాల భూమి మాత్రమే ఉండడంతో లబ్ధిదారుల ఎంపికను లాటరీ పద్ధతిలో చేపట్టారు.

ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పాతర

గార్ల, జూలై 19: ప్రజా సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర పాలకులు పాతరేసి నియంతృత్వ విధానాలతో పాలన సాగిస్తున్నారని న్యూడెమోక్రసీ (చంద్రన్నవర్గం) జిల్లా కార్యదర్శి ఎస్‌కె ముక్తార్‌పాష ఆరోపించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రయోజనాలను ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయని, తమకు ఉపయోగ పడే విధంగా పథకాల రూపకల్పన చేస్తూ కోట్లాది రుపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.

పోలీసు సంక్షేమానికి పెద్దపీట

గుంటూరు, జూలై 19: పోలీసు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ జెవి రాముడు అన్నారు. మంగళవారం రాత్రి గుంటూరు పోలీసు కల్యాణ మండపంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. సత్తెనపల్లి ఎస్‌డిపిఒ ఆఫీసు వద్ద మెయిన్‌రోడ్డు సమీపంలో డిపార్టుమెంట్‌కు సంబంధించిన స్థలంలో పెట్రోల్, ఇతర దుకాణాలు నిర్వహిస్తున్నారని జిల్లా రూరల్ ఎస్‌పి నారాయణ నాయక్ దృష్టికి వచ్చింది. ఆక్రమణలో ఉన్న ఈ పోలీసు స్థలాన్ని స్వాధీనపర్చుకుని ఉద్యోగుల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా ఓ పెట్రోలియం అవుట్‌లెట్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు ఉన్నతాధికారుల అనుమతి లభించింది.

గురుకుల పాఠశాలలకు పూర్వవైభవం

తాడికొండ, జూలై 19: రాష్ట్రంలోని గురుకుల పాఠశాలలకు పూర్వవైభవాన్ని తీసుకొస్తామని మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మండల కేంద్రం తాడికొండ గురుకుల ఎక్స్‌లెన్సీ పాఠశాలను మంగళవారం మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి గంటా మాట్లాడుతూ తమ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. తాడికొండ ఎక్స్‌లెన్సీ పాఠశాలకు రూ. 10.70 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నిధుల ద్వారా పాఠశాలకు ప్రహరీ, డార్మిటరీ నిర్మిస్తామని వివరించారు.

మున్సిపల్ పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సులు

గుంటూరు, జూలై 19: రాష్ట్రంలోని మునిసిపల్ పాఠశాలల్లో ఐఐటీ ఫౌండేషన్ కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ నెల 29వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరులో ప్రారంభించనున్నారు. గత ఏడాది ప్రవేశపెట్టిన ఈ కోర్సులను వేసవి తరగతులకే పరిమితం చేశారు. ఈ ఏడాది నుంచి రెగ్యులర్ గా మునిసిపల్ పాఠశాలల్లో రెండు గంటల పాటు తప్పనిసరి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మునిసిపల్ పాఠశాలల విద్యార్ధులతో ఆరోజు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి పూర్తిస్థాయిలో కోర్సును ప్రారంభిస్తారు.

కార్మిక హక్కులను కాలరాసే ప్రభుత్వాలు కూలడం ఖాయం

గుంటూరు (కొత్తపేట), జూలై 19: ఎన్నో పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న హక్కులను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కాలరాయాలని చూస్తున్నాయని, అలాంటి ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయమని ఎఐటియుసి జాతీయ కార్యదర్శి వహిదా నిజాం వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 2వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ నగరంలోని మహిమాగార్డెన్స్‌లో పలు ట్రేడ్‌యూనియన్ల ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన రాష్టస్థ్రాయి సదస్సుకు ఎఐటియుసి రాష్ట్ర నాయకుడు వీరాస్వామి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నిజాం మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం కాంగ్రెస్‌తో పాటు బిజెపిపై కూడా అనేక పోరాటాలు నిర్వహించామన్నారు.

స్విస్ ఛాలెంజ్ గురించి తెలియక మాట్లాడుతున్న జగన్

గుంటూరు (కొత్తపేట), జూలై 19: దేశవ్యాప్తంగా స్విస్ ఛాలెంజ్ విధానాన్ని పాటిస్తుంటే ఎపిలో చేపడుతున్న అభివృద్ధి పనులకు స్విస్ ఛాలెంజ్ విధానం వద్దని అనడం జగన్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని టిడిపి జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు విమర్శించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం సైతం రోడ్లు, టూరిజం, ఇళ్ల నిర్మాణ విషయంలో స్విస్ ఛాలెంట్ పద్ధతిని అనుసరించారని గుర్తుచేశారు. స్విస్ ఛాలెంజ్ విధానం దోపిడీ లేకుండా పనుల్లో పారదర్శకత, నైపుణ్యంతో పాటు పనివేగాన్ని పెంచడానికి ఎంతగానో దో హద పడుతుందన్నారు.

అంగరంగ వైభవంగా ఆదికేశవస్వామి పున్నమి గరుడోత్సవం

చేబ్రోలు, జూలై 19: చేబ్రోలులో గల అతి పురాతనమైన ఆదికేశవ స్వామి పున్నమి గరుడోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఫణిహారం శ్రీ్ధర్ పర్యవేక్షణలో స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై ఊరేగించారు. మంగళవారం గురుపౌర్ణమిని పురస్కరించుకుని గరుడోత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న వారికి నాగదోషాలు తొలగిపోతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందన్న విశ్వాసంతో భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆదికేశవస్వామిని దర్శించుకుని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

జిల్లా అథ్లెటిక్స్ జట్టు

గుంటూరు (స్పోర్ట్స్), జూలై 19: అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఇటీవల బిఆర్ స్టేడియంలో జరిగిన అండర్-18, 20 బాలబాలికల అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభకనబర్చి, రాష్టప్రోటీలకు ఎంపికైన క్రీడాకారుల వివరాలను మంగళవారం సంఘ కార్యదర్శి జి శేషయ్య ప్రకటించారు. అండర్-18 బాలుర విభాగంలో డి అశోక్, ఎస్ రాజ్, షేక్ ఖాశింవలి, సిహెచ్ అశోక్‌కుమార్, ఎ ప్రేమ్‌కుమార్, ఎం విష్ణువర్ధన్, ఎం పృధ్విరాజ్, ఎం గౌరీశంకర్, డి శివాజీ, రాజు, నాగుల్‌మీరా బాలికల విభాగంలో బి దీప్తివందన, ఎన్ వెంకటరమణ, వై పద్మప్రియ, వి సుహాసిని, ఎండి కరిష్మా, వై సంధ్యారాణి, డి నాగసృజన, షేక్ నేహలు ఎంపికయ్యారని తెలిపారు.

Pages