S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరనాథ్ యాత్రలో చిక్కుకున్న జిల్లావాసులు

ఏలూరు, జూలై 19 : ఆకస్మికంగా అమర్‌నాధ్ యాత్రను రద్దు చేయడంతో ఏలూరు నగరం అంబికా ట్రావెల్స్ ద్వారా వెళ్లిన దాదాపు వంద మంది యాత్రీకులు శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. గత మూడు రోజుల క్రితం యాత్రను రద్దు చేయడంతో దాదాపు అయిదు కిలోమీటర్ల దూరం ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో యాత్రీకులు ఇబ్బందులు పడుతున్నారు. యాత్రను పునరుద్ధరిస్తామని అధికారులు ఎప్పటికప్పుడు చెప్పడమేగానీ కొనసాగించకపోవడంతో అక్కడికక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ట్రాఫిక్ నిలచిపోవడం వలన వెనక్కి వచ్చే మార్గం కూడా లేక అక్కడే ఉండిపోయినట్లు అంబికా ట్రావెల్స్ అధినేత పైడి భీమేశ్వరరావు తెలిపారు.

అంబికా కృష్ణను పరామర్శించిన ముఖ్యమంత్రి

ఏలూరు, జూలై 19 : ఇటీవల గుండె శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకుంటున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వాణిజ్య సెల్ అధ్యక్షులు అంబికా కృష్ణను మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలిఫోన్‌లో పరామర్శించారు. అంబికా కృష్ణ త్వరగా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యం కలగాలంటూ చంద్రబాబు ఆకాంక్షించారు. తనను ప్రత్యేకంగా పరామర్శించినందుకు అంబికాకృష్ణ కృతజ్ఞతలు చెప్పారు. కాగా సోమవారం హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత వేర్వేరుగా అంబికా కృష్ణతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.

సెలవుపై వెళ్లిన వీరవాసరం ఎస్సై

వీరవాసరం, జూలై 19: వీరవాసరం ఎస్సైగా పనిచేస్తున్న శ్యామ్‌సుందర్ సెలవుపై వెళ్ళారు. గత కొద్దిరోజులుగా ఏపి ట్రాన్స్‌కో విజిలెన్స్‌కు బదిలీ అవుతారని భారీగా చర్చ జరిగింది. అయితే కొద్దిరోజుల క్రితం ఎస్సై శ్యామ్‌సుందర్‌కు బదిలీ అయినట్లు తెలిసింది. ఉన్నతాధికారులు ఇంకా రిలీవ్ చేయకపోవడంతో శ్యామ్‌సుందర్ సెలవుపై వెళ్ళినట్లు సమాచారం. ఒక వారంరోజులు సెలవుపై వెళ్లినట్లు తెలిసింది. అయితే బదిలీ అయినప్పటికీ ఉన్నతాధికారులు రిలీవ్ చేయకపోవడంతో సెలవుపై వెళ్ళినట్లు సమాచారం. మంగళవారం నుండి ట్రైనీ ఎస్సైగా వచ్చిన సుబ్రహ్మణ్యం బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

భారీ కొండచిలువను హత

ఆకివీడు, జూలై 19: అయిభీమవరం రోడ్డులోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో మంగళవారం తెల్లవారుఝామున భారీ కొండచిలువను హతమార్చారు. పెద్దింట్లమ్మ దేవస్థానానికి సంబంధించిన పొలంలోని ముళ్ళపొదలను ఇటీవలే తగలబెట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున ఆ ప్రాంతంలో గుడిసెల్లోకి వస్తున్న కొండచిలువను గమనించి పరసా రమేష్‌తో పాటు మరికొంతమంది యువకులు కర్రలతో కొట్టి హతమార్చారు. కొండచిలువ 10 అడుగుల పొడవు ఉంటుంది. ఇటీవల కాలంలో కొండచిలువల సంచారం ఎక్కువగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భీమవరం యువకుడికి ‘కబాలి’ పంపిణీ హక్కులు

భీమవరం, జూలై 19: సుమారు నాలుగున్నరేళ్లుగా సినీపరిశ్రమలో ఎన్నో చిత్రాలకు పంపిణీదారుడిగా ఉన్న షణ్ముఖ ఫిలిమ్స్‌కు గొప్ప అవకాశం లభించింది. ఈనెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హక్కులను భీమవరానికి చెందిన షణ్ముఖ ఫిలిమ్స్ అధినేత కొత్తపల్లి ప్రవీణ్‌కుమార్‌వర్మ సొంతం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోయే సూపర్‌స్టార్ చిత్రానికి రెండు రాష్ట్రాలకు పంపిణీదారుడు కావడం అన్నీ రజనీసార్ ఆశీస్సులేనని అన్నారాయన.

అంత్య పుష్కరాలకు భద్రత కట్టుదిట్టం

పోలవరం, జూలై 19: పోలవరం మండలంలో అంత్య పుష్కరాలు జరిగే ఘాట్లలో మంగళవారం సాయంత్రం బాంబ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. ఎస్సై మోహనరావు ఆధ్వర్యంలో నలుగురు పోలీసులు బాంబులను గుర్తించే రాంబో అనే ట్రైన్డ్ డాగ్‌తో ఈతనిఖీలు నిర్వహించారు. కొవ్వూరు, జంగారెడ్డిగూడెం డివిజన్లలో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, అలాగే విఐపిలు ఎక్కువగా సందర్శించే పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో కూడా తనిఖీలు నిర్వహించామని ఎస్సై మోహనరావు తెలిపారు. అలాగే పట్టిసం వీరేశ్వరస్వామి ఆలయం వద్ద కూడా తనిఖీలు నిర్వహిస్తామన్నారు.

కాకినాడ రూరల్‌లో కొక్కొరోకో!

కాకినాడ సిటీ, జూలై 19: చట్టాలను రక్షించాల్సిన వారే చట్టవిరుద్ధంగా వ్యవహరించి కోడి పందేలపై దాడి కేసును గప్‌చుప్ చేసేశారని కాకినాడ రూరల్ ప్రాంతం కోడై కూస్తోంది. ఈ దాడిలో దొరికిన నగదు ఏమైందోగానీ, స్వాధీనం చేసుకున్న కోళ్లను మాత్రం పంచుకుని, నంచుకు తినేశారని సమాచారం. దాడిచేసి, ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన ఒక యువ అధికారి మాత్రం సీనియర్ల తీరుకు బిత్తరపోతున్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళితే... కాకినాడ రూరల్ మండలంలోని ఓ ప్రాంతంలో పెద్ద ఎత్తున కోడి పందాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు ఓ యువ అధికారి కొంతమంది సిబ్బందితో కలిసి గత శనివారం సాయంత్రం సమయంలో దాడిచేసినట్టు తెలిసింది.

కార్పొరేషన్ ఖాతాలోకి కళాకేంద్రం

రాజమహేంద్రవరం, జూలై 19: చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆనం కళాకేంద్రం నిర్వహణ బాధ్యతలను నగరపాలక సంస్థకు అప్పగించడం తీవ్ర కలకలం రేకెత్తిస్తోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కళాకారులు ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. ఆనం కళాకేంద్రం నిర్వహణను కార్పొరేషన్‌కు అప్పగిస్తే అధోగతేనని ఆందోళన వ్యక్తమవుతోంది. వివిధ సంస్థలు, ప్రభుత్వ నిధులతో ఇపుడిపుడే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుంటున్న ఆనం కళాకేత్రాన్ని కార్పొరేషన్‌కు అప్పగించడం హేతుబద్ధం కాదని కళాకారులు ఆందోళన చెందుతున్నారు.

ఎల్‌ఇడి బల్బులతో భారీగా ఆదా

రాజమహేంద్రవరం, జూలై 19: ప్రతి ఇంట్లో ఎల్‌ఇడి బల్బులను వినియోగించి విద్యుత్‌ను ఆదా చేయాలని రాష్ట్ర ఇంధన పరిరక్షణ కమిటీ సిఇఓ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ అధ్యక్షతన జిల్లా ఇంధన పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిఇఓ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటిలో ఒక ఎల్‌ఇడి బల్బు వినియోగిస్తే ఏడాదికి 73 యూనిట్ల విద్యుత్ బిల్లు తగ్గుతుందన్నారు. జిల్లాలో 11 లక్షల గృహాలకు పైగా ఎల్‌ఇడి బల్బులు పంపిణీ చేశామన్నారు. విద్యుత్ పొదుపు, సామర్ధ్యం పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైనుకు సర్వే

కాకినాడ, జూలై 19: కోటిపల్లి-నరసాపూర్ మధ్య రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సర్వే ప్రక్రియను యుద్ధప్రాతిపదికన నిర్వహించాలని సంయుక్త కలెక్టర్ ఎస్ సత్యనారాయణ సంబంధిత శాఖల అధికారులకు స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం కాకినాడ కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో జెసి వివిధ అంశాలపై మాట్లాడారు. కోటిపల్లి-నర్సాపూర్ బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ అభివృద్ధి పనుల కోసం రామచంద్రపురం డివిజన్ కోటిపల్లి గ్రామంలోను, అమలాపురం డివిజన్‌లో భట్నవల్లి నుండి సఖినేటిపల్లి వరకు ఉమ్మడి సర్వే పనులను తక్షణం చేపట్టాలని ఆదేశించారు.

Pages