S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ స్వరూపునికి పుష్పాభిషేకం

గుంటూరు (కల్చరల్), జూలై 19: మహాపర్వదినాల్లో ఒకటిగా ఉన్న గురుపౌర్ణమి మహోత్సవాన్ని మంగళవారం నగరంలోని వివిధ డివిజన్లలో ఆయా భక్తబృందాలు, పలు ధార్మిక సంస్థల ఆధ్వర్యాన రోజంతా మహా వైభవంగా జరుపుకున్నారు. అష్టాదశ పురాణాలను యావత్ విశ్వానికి అందించి, రుషిలోక అరాధ్యుడుగా విఖ్యాతిపొందిన శ్రీవ్యాస భగవానుని జన్మదినాన్ని ప్రతియేటా గురుపౌర్ణమి ఉత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఇదేరోజున కోట్లాది మంది ఆరాధించే సాయినాథుడు కూడా షిరిడి ప్రాంతంలో అవతరించడాన్ని పురస్కరించుకుని స్వామివారి భక్తులంతా ఉత్సవాన్ని శ్రద్ధాశక్తులతో జరుపుకుంటున్నారు.

29న గుంటూరులో దేశీ విత్తన సంబరం

గుంటూరు, జూలై 19: ఈనెల 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ ద్వితీయ దేశీ విత్తన సంబరాన్ని నిర్వహిస్తున్నట్లు హరిత భారతి ట్రస్ట్ ప్రతినిధి త్రినాథరావు పేర్కొన్నారు. మంగళవారం గుంటూరులో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో త్రినాథరావు మాట్లాడుతూ స్థానిక శ్రీ వెంకటేశ్వరా విజ్ఞాన మందిరంలో సంప్రదాయ విత్తన ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా అదేరోజు పాలేకర్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సాయిబాబాను దర్శించుకున్న మంత్రి గంటా

మంగళగిరి, జూలై 19: గురుపౌర్ణమిని పురస్కరించుకుని మంగళవారం పట్టణ, పరిసర గ్రామాల్లోని సాయిబాబా మందిరాలు సాయి నామస్మరణతో మార్మోగాయి. మండల పరిధిలోని పెదవడ్లపూడిలో గల శ్రీ సత్యషిరిడీ సాయిబాబా మందిరంలో స్వామిని రాష్ట్ర ఉన్నత విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు దర్శించుకుని పూజలు జరిపారు. భక్తులు అందజేసిన బంగారు కిరీటాన్ని స్వామివారికి అలంకరింపజేశారు. గంటాకు ఆలయ కమిటీ చైర్మన్ పాతూరి నాగభూషణం ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను మంత్రి గంటాకు అందజేశారు.

రోడ్డు విస్తరణ పేరుతో నివాసాలు కూల్చివేస్తే సహించం

అచ్చంపేట, జూలై 19: నూతన రాజధాని అమరావతిని త్వరితగతిన చేరుకోవడానికి గాను అచ్చంపేటలో చేయబోతున్న రోడ్డు విస్తరణ పనుల నిర్ణయాన్ని ప్రజలు, చిరు వ్యా పారుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం విరమించుకుని, ఊరి వెలుపల నుండి బైపాస్ రోడ్డు నిర్మించుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. జిల్లా సర్వే అధికారులు రోడ్డు విస్తరణకై మార్కింగ్ చేయడంతో గ్రామంలో కొద్దిరోజులు గా ఇదే విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు. 70 నుండి 80 యేళ్ల తరబడి ప్రభుత్వ అనుమతితో పక్కా రిజిస్ట్రేషన్లతో నివాసాలు ఏర్పర్చుకుని జీవనం సాగిస్తున్నారు.

సమాచారం ఇవ్వడంలో ‘రెవెన్యూ’ నిర్లక్ష్యం

ఏలూరు, జూలై 19: సమాచారహక్కు చట్టం ప్రకారం దరఖాస్తుదారు కోరుకున్న వివరాలను సంబంధిత శాఖల పౌరసమాచార అధికారులు నిర్దేశించిన కాలంలో అందజేయాలని రాష్ట్ర సమాచారహక్కు చట్టం కమిషనర్ డాక్టరు ఎన్ విజయనిర్మల చెప్పారు. స్ధానిక కలెక్టరేట్‌లో మంగళవారం రెవిన్యూ శాఖకు సంబంధించి సమాచార హక్కుచట్టంపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో సమాచారహక్కు చట్టం ప్రకారం దరఖాస్తుదారులకు వివరాలు అందించటంలో రెవిన్యూ శాఖాధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ప్రజలకు మేలు జరిగేలా ప్రతి అధికారి పనిచేయాలని, ప్రజలు కోరుకునే వివరాలను సకాలంలో తప్పనిసరిగా అందజేయాలన్నారు.

డెల్టాలో సాగునీటి ఎద్దడి వాస్తవమే

పెరవలి, జూలై 19: డెల్టాలో శివారు ప్రాంతాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడడం వాస్తవమని కలెక్టర్ కాటమనేని భాస్కర్ అభిప్రాయపడ్డారు. డెల్టాలో సాగునీటి సమస్యలపై మంగళవారం పెరవలి మండల పరిషత్ కార్యాలయంలో నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ మరో మూడు రోజులలో సాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. వరి పంటను ముందుగా జిల్లాలో వేయడానికి ఏర్పాట్లు చేయడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు తెలిపారు. ఒకేసారి డెల్టా అంతా నాలుగున్నర లక్షల ఎకరాలలో రైతులు నాట్లు వేయడానికి ఏర్పాట్లు చెసుకోవడంతో శివారు ప్రాంతాలకు నీటి ఎద్దడి ఏర్పడినట్లు తెలిపారు.

శాకాంబరిగా మావుళ్ళమ్మ అమ్మవారు

భీమవరం, జూలై 19: భీమవరం ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు మంగళవారం శాకాంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల నుండి తీసుకువచ్చిన కూరగాయలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ఎసి నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

ఎస్సై పేరుతో టోకరా

వీరవాసరం, జూలై 19: తాను కొత్తగా వచ్చిన ఎస్సైనని, తనతో రావాలంటూ ఇరువురు విద్యార్థులను వేరే గ్రామానికి తీసుకువెళ్ళి వారి వద్ద ఉన్న సుమారు 20 గ్రాములు బంగారు గొలుసు, ఉంగరం అపహరింఛిన సంఘటన మంగళవారం వీరవాసరంలో సంచలనం కలిగించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వీరవాసరం బొంతువారిపేటకు చెందిన తాడపర్తి అనిల్ వీరవాసరం జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. బాలేపల్లి గ్రామానికి చెందిన అడిదం మోషే ఐటిఐ చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఇరువురు జూనియర్ కళాశాల వద్ద నిల్చుని ఉండగా, మోటారుసైకిల్ పై ఒక వ్యక్తి వచ్చి మీరెవరంటూ ప్రశ్నించాడు. తాము ఇక్కడ చదువుకుంటున్నామని చెప్పారు.

రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

ద్వారకాతిరుమల, జూలై 19: రాష్ట్రీయ రహదారిపై సంభవించిన ఒక రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. వరుసకు సోదరులైన వీరి మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ద్వారకాతిరుమల మండలం ఎం నాగులపల్లి పంచాయతీ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..మండలంలోని పి కన్నాపురం పంచాయతీ సత్తాల గ్రామానికి చెందిన అనె్నం రాజేష్ (32), అనె్నం నరసింహారావు (28)లు ఘటనా స్థలంలోనే మృతిచెందారు.

పడవలపై మత్స్యకార మహిళల నిరసన

మొగల్తూరు, జూలై 19: మండలంలోని ముత్యాలపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం గొదావరి మెగా ఆక్వాఫుడ్ పార్కు ఫ్యాక్టరీ నిర్మాణ పనులు నిలుపుదల చేయాలని కోరుతూ పడవలపై ముత్యాలపల్లి గ్రామం గొంతేరు డ్రెయిన్లో మహిళలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మెగా ఆక్వాపుడ్ పార్కు ఫ్యాక్టరీ నిర్మించడం వలన మత్య్సకార కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళభ వ్యక్తం చేశారు. కార్యక్రమానికి మహిళా మత్స్యకార సంఘం నాయకులు వాటాల ధనలక్ష్మి, కొల్లాటి సరస్వతి, కొల్లాటి పెద్దింట్లమ్మ, ఎస్ మాణిక్యమ్మ, వాటాల బాలకృష్ణ, బర్రే చల్లారావు, తిరుమాని నాగేశ్వరరావు, కొల్లాటి నాగరాజు తదితరులు నాయకత్వం వహించారు

Pages