S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్

కడప: వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి కడప నగరంలో ముస్లింలు ఇచ్చిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అమీన్‌పీర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న జగన్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పెద్దదర్గాలోని ప్రధాన మజార్ వద్ద పూలఛాదర్ ఉంచి ప్రార్థనలు చేశారు.

గుంటూరు యార్డు చైర్మన్ పదవికి గ్రీన్‌సిగ్నల్!

గుంటూరు, జూలై 5: ఆసియాలోకెల్లా అతిపెద్దదయిన గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవిపై నెలకొన్న పీటముడి వీడింది. యార్డు చైర్మన్ పదవిపై ఇప్పటి వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రాజీఫార్ములా ప్రకారం పంపకాలు జరపాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ పంచాయితీ చివరకు ముఖ్యమంత్రి కోర్టుకు చేరింది. యార్డు చైర్మన్ పదవి భర్తీలో పేచీలు తలెత్తడంతో గుంటూరు జిల్లా నేతలను సిఎం చీవాట్లు పెట్టినట్లు తెలిసింది.

‘సదావర్తి సత్రం’లో వాస్తవాలు ఇవీ!

విజయవాడ, జూలై 5: అమరావతి సదావర్తివారి సత్రం భూముల వేలం విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, అంతా పారదర్శకంగానే జరిగిందని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేశారు. మంగళవారం సిఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడులో ఉన్న సదావర్తివారి సత్రం భూములు చాలాకాలం కిందటే ఆక్రమణలకు గురయ్యాయన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు సుమారు 471.76 ఎకరాల భూమి సదావర్తివారి సత్రం కింద ఉండేది. అయితే తమిళనాడు దేవాదాయశాఖ చట్టాన్ని అనుసరించి ఇందులో 346.25 ఎకరాల భూమికి అక్కడి ప్రభుత్వం పట్టాలు జారీ చేసింది. మరో 36.55 ఎకరాల భూమి గవర్నమెంట్ పోరంబోకుగా ఉంది.

కొండవెలగాడలో ప్రబలిన అతిసార

విజయనగరం, జూలై 5: జిల్లాలోని నెల్లిమర్ల మండలం కొండవెలగాడలో అతిసార విజృంభిస్తోంది. అతిసారతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, గ్రామస్తులు మాత్రం ముగ్గురు మరణించారంటున్నారు. కానీ వైద్యఆరోగ్య శాఖ అధికారులు మాత్రం వీరి మరణానికి కారణాలు వేరే అంటూ సమస్య నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కలుషిత నీరు తాగటమో, లేక అపరిశుభ్రమైన ఆహారం తినడం వల్లో గత నాలుగు రోజులుగా కొండవెలగాడలో అతిసార ప్రబలింది. సోమవారం సాయంత్రానికి బాధితుల సంఖ్య 20 కాగా, మంగళవారానికి 30కి దాటింది. గడచిన రెండురోజుల్లో మొయిద సన్యాసమ్మ, సీల నారాయణ డయేరియాతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

వౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి

విజయవాడ, జూలై 5: రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామిక, వాణిజ్య రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పెద్దఎత్తున పారిశ్రామిక ప్రాజెక్టులను చేపట్టిన ప్రభుత్వం వౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ ప్రతినిధులు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొంటున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలను కలిసి పలు ఒప్పందాలు చేసుకుంటున్నారన్నారు. సత్వర పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు వౌలిక సదుపాయాలు పటిష్టపరుస్తోంది. ఆసక్తి చూపుతున్న కంపెనీలకు భూముల కేటాయింపు సత్వరం జరిగే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది.

ప్రజల ముంగిట ‘సమాచారం’

విజయవాడ, జూలై 5: రాష్ట్రంలో అనుక్షణం ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు ముఖ్యమంత్రి పరిశీలనకు, ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ముఖ్యమంత్రి డ్యాష్ బోర్డు సమాచారం రూపొందించినట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న తెలిపారు. ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా’ (ఆధార్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆధార్ ఎనేబుల్డ్ అప్లికేషన్స్’ రెండు రోజుల సదస్సు మంగళవారం ముగిసింది.

నేడే ఎంసెట్ తుది ర్యాంకులు

కాకినాడ, జూలై 5: ఇంటర్మీడియెట్ బోర్డులో సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంబంధించి ఎంసెట్-2016 తుది ర్యాంకులను బుధవారం జెఎన్‌టియుకె వెల్లడించనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇంటర్మీడియెట్ సహా ఇతర బోర్డులు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంబంధించి ఈ ఫైనల్ ర్యాంకులను వెల్లడించనున్నట్టు ఎంసెట్-2016 కన్వీనర్ డాక్టర్ సిహెచ్ సాయిబాబు చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సంబంధించిన మార్కులు ఆయా సంస్థల నుండి తెప్పించుకున్నట్టు ఆయన చెప్పారు.

గవర్నర్‌తో నేడు చంద్రబాబు భేటీ

విజయవాడ, జూలై 5: గవర్నర్ నరసింహన్ బుధవారం ముఖ్యమంత్రి భేటీ అవనున్నారు. వాస్తవానికి బుధవారం ఉదయం గవర్నర్ విజయవాడకు చేరుకుని, ముఖ్యమంత్రితో సమావేశంకావల్సి ఉంది. అయితే, ముఖ్యమంత్రి పట్టిసీమ ప్రారంభోత్సవానికి వెళుతున్నందున, భేటీని సాయంత్రానికి వాయిదా వేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివిధ అంశాల్లో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైకోర్టు వివాదం రోజు రోజుకూ జఠిలమవుతోంది. అలాగే కృష్ణా జలాల పంపిణీ విషయంలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కీచులాటకు దిగుతున్నాయి.

ఆవులను కబేళాలకు తరలిస్తున్న ముఠా!

రేణిగుంట, జూలై 5: మూగజీవాలను గుట్టుచప్పుడు కాకుండా కబేళాలకు తరలిస్తున్న ఓ ముఠా రేణిగుంట, తిరుపతి ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. రోడ్లపై సంచరిస్తున్న ఆవులను ఈ ముఠాకు చెందిన వ్యక్తులు ఎవరికీ అనుమానం రాని రీతిలో ఊరుబయటకు తోలుకెళ్తారు. అక్కడ నుంచి రాత్రిపూట వాహనాల్లో కబేళాలకు తరలిస్తున్నారు. ముందుగా ఈ ముఠా సభ్యులు రేణిగుంట మండలంలో సంచరిస్తూ బలంగా ఉన్న ఆవులను ఎంచుకుంటారు. ఆపై ఆ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉంటారు. సమయం చూసుకొని వారు ఎంచుకున్న ఆవును సాధారణ పౌరులు ఆవులను తరిమినట్లుగా తరుముతారు. కొంతదూరం వెళ్లిన తరువాత ఆవును వదిలి అక్కడ వ్యాపారం చేస్తున్నట్లు నటిస్తారు.

కోస్తాలో తేలికపాటి వర్షాలు

విశాఖపట్నం, జూలై 5: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తా తీరం మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలో చెదురు మదురు వర్షాలు కురుస్తాయని తెలిపారు. కోస్తా అంతటా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రుతుపవనాలు ఒక మోస్తరుగా కదులుతున్నాయని పేర్కొన్నారు.

Pages