S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త మంత్రులు వీరే

ఎంజె అక్బర్
ప్రముఖ పాత్రికేయుడు. 2014 ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఎన్నికల్లో పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. ఇటీవలే పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. అక్బర్ రాజకీయాలకు కొత్తేమీ కాదు. 1989లో కాంగ్రెస్(ఐ)టికెట్‌పై బిహార్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీకి అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. ఇప్పుడు మోదీ కేబినెట్‌లో ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తరువాత రెండో ముస్లిం ప్రతినిధి అక్బర్.
పిపి చౌదరి

తలపాగాలతో వచ్చిన మేఘ్వాల్, అతవాలే

న్యూఢిల్లీ, జూలై 5: అర్జున్‌రామ్ మేఘ్వాల్, రాందాస్ అతవాలే రాష్టప్రతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారానికి తలపాగాలు ధరించి వచ్చారు. లోక్‌సభలో బిజెపి చీఫ్‌విప్ అయిన మేఘ్వాల్ ఎప్పుడూ కూడా రంగురంగుల తలపాగా ధరించే ఉంటుండగా, అతవాలే నేవీబ్లూ తలపాగా ధరించి ప్రమాణ స్వీకారానికి వచ్చారు.

చిత్రాలు.. సైకిల్‌పై ప్రమాణ స్వీకారానికి వస్తున్న మన్సుఖ్ భాయ్ మాండవియ, అర్జున్‌రామ్ మేఘ్వాల్

పంట రుణాలకు వడ్డీ రాయితీ

న్యూఢిల్లీ, జూలై 5: రైతులు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) స్వల్పకాలిక రుణాలుగా 3 లక్షల రూపాయల వరకు అందుకోవచ్చు. రాయితీపై 4 శాతం వడ్డీరేటుకే ఈ రుణం లభిస్తుంది. అయితే నిర్ణీత వ్యవధిలో చెల్లించనట్లైతే ఈ వడ్డీరేటు 7 శాతానికి వెళ్తుంది. ‘కేంద్ర ప్రభుత్వం రైతులందరికీ ఏడాది వరకు గరిష్ఠ కాలపరిమితితో స్వల్పకాలిక రుణంగా 3 లక్షల రూపాయల వరకు 4 శాతం వడ్డీరేటుకే అందించనుంది. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో తీసుకునే రుణాలకే ఈ రాయితీ వడ్డీరేటు వర్తిస్తుంది. ఒకవేళ సకాలంలో చెల్లించనట్లైతే 7 శాతం వడ్డీరేటు రైతులు చెల్లించాల్సి ఉంటుంది.’ అని కేబినెట్ సమావేశం అనంతరం ఓ అధికారిక ప్రకటన విడుదలైంది.

వచ్చే నెల 4కు విజయ్ మాల్యా చెక్ బౌన్సు కేసు విచారణ వాయిదా

హైదరాబాద్, జూలై 5: దేశీయ ప్రైవేట్‌రంగ విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ ఎయర్‌లైన్స్ అధిపతి విజయ్ మాల్యా కేసు విచారణను వచ్చే నెల 4వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఎర్రమంజిల్ కోర్టు మంగళవారం ప్రకటించింది. తమకు విజయ్ మాల్యా ఇచ్చిన 50 లక్షల రూపాయల విలువైన చెక్‌లు బౌన్స్ అయ్యాయనే అభియోగంతో జిఎంఆర్ సంస్థ కోర్టుకు ఫిర్యాదు చేసినది తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న కోర్టు.. మాల్యాకు సమన్లు కూడా జారీ చేసింది. అయతే మాల్యా ప్రస్తుతం దేశంలో లేకపోవడంతో మాల్యాను కూడా విచారించాకే తుది తీర్పు ఇవ్వనున్నట్లు గతంలోనే కోర్టు ప్రకటించింది.

ఆరు రోజుల లాభాలకు బ్రేక్

ముంబయి, జూలై 5: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. గత ఆరు రోజుల వరుస లాభాలకు సూచీలు బ్రేక్ వేశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 111.89 పాయింట్లు క్షీణించి 27,166.87 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 34.75 పాయింట్లు దిగజారి 8,335.95 వద్ద నిలిచింది. ఆటో, పవర్, రియల్టీ, టెక్నాలజీ, ఐటి, ఆయిల్, గ్యాస్, బ్యాంకింగ్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్ నష్టపోగా, చైనా సూచీ లాభపడింది. అయితే ఐరోపా మార్కెట్లలో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సూచీలు పడిపోయాయి.

టి హబ్‌తో ఏరీస్ టెక్నాలజీ గ్రూప్ ఒప్పందం

హైదరాబాద్, జూలై 5: దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్ టి హబ్ అంతర్జాతీయ టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్ ఏరీస్ గ్రూప్‌తో మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. అవుట్ సోర్సింగ్, టెక్నాలజీ సేవలను అందించే ఏరీస్.. స్టార్టప్ సంస్థ (అంకుర సంస్థలు)లకు పెద్ద ఊతంగా ఉంటుందని టి హబ్ సిఇఒ జయకృష్ణన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెబ్, ఎంటర్‌ప్రైజ్ కంప్యూటర్ అప్లికేషన్స్‌ను నిరంతరం అంతరాయం లేకుండా ఏరీస్ సంస్థ పర్యవేక్షించనుంది. ఈ అవగాహన ఒప్పందం తమ సంస్థకు గొప్ప ముందడుగు అని ఏరీస్ సంస్థ సిఇఒ రమణకుమార్ అభిప్రాయపడ్డారు. తాము కుదుర్చుకున్న ఒప్పందం తమకు ఒక పెద్ద సవాల్ అయినప్పటికీ స్వీకరిస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

టివిఎస్ స్కూటీ జస్ట్ 110 ‘హిమాలయన్ హైస్’ సీజన్-2

హైదరాబాద్, జూలై 5: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టివిఎస్.. వచ్చే నెల ఆగస్టులో టివిఎస్ స్కూటీ జస్ట్ 110 ‘హిమాలయన్ హైస్’ సీజన్-2ను ప్రారంభించనుంది. ఈ మేరకు ఇక్కడ మంగళవారం ఓ ప్రకటనలో ఆ సంస్థ ప్రకటించింది. నిరుడు ఆగస్టులో టివిఎస్ స్కూటీ జస్ట్ 110తో హిమాలయాల్లోని ఖార్దుంగ్ లా వరకు వెళ్లిన లక్నోకు చెందిన ఆనం హషిం ఆధ్వర్యంలో ‘హిమాలయన్ హైస్’ సీజన్-2 జరుగుతుందని స్పష్టం చేసింది. కాగా, ఎంట్రీలు, ఆడిషన్ల ఆధారంగా 10 మంది మహిళా రైడర్లను ఎంపిక చేస్తామని, వారికి బెంగళూరులోని టివిఎస్ బృందం తగిన శిక్షణను అందిస్తుందని సంస్థ తెలిపింది.

మార్కెట్‌లోకి అంబికా దర్బార్ కొత్త ఉత్పత్తులు

ఏలూరు, జూలై 5: అంబికా దర్బార్ బత్తి నుంచి మరో నాలుగు ఉత్పత్తులు మంగళవారం మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని శ్రీ కన్యకాపరమేశ్వరి సత్రం వద్ద అంబికా అగరుబత్తి ‘సత్యపూజ’ బ్రాండ్ అగరుబత్తీలు నాలుగు రకాలను సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంబికా రాజా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థ నుంచి విడుదలవుతున్న నాణ్యమైన ఉత్పత్తులపట్ల ఆదరాభిమానాలను ప్రదర్శిస్తున్న వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని నాణ్యమైన ఉత్పత్తులను ప్రవేశపెడతామని తెలిపారు.

సామ్‌సంగ్ భారీ ఆవిష్కరణ

న్యూఢిల్లీ, జూలై 5: సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ మంగళవారం దేశీయ మార్కెట్‌కు ఏకంగా 44 సరికొత్త స్మార్ట్ టీవీ మోడళ్లను పరిచయం చేసింది. గరిష్ఠ ధర 24 లక్షల రూపాయలు. నిరుడు 82 లక్షల టెలివిజన్లను విక్రయించి భారతీయ టీవీ మార్కెట్‌లో 31 శాతం వాటాను దక్కించుకున్న సామ్‌సంగ్ ఇండియా.. ఈ ఏడాది 35 శాతం వాటాను లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే మార్కెట్‌లోకి ఇంత భారీ ఎత్తున నూతన మోడల్ టీవీలను విడుదల చేసినట్లు సామ్‌సంగ్ ఇండియా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఉపాధ్యక్షుడు రాజీవ్ భుటాని ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఇకపోతే తాజాగా విడుదలైన మోడళ్లలో తొమ్మిది ఎస్‌యుహెచ్‌డి శ్రేణివి అవగా, మరో ఏడు జాయ్ బీట్ శ్రేణికి చెందినవి.

ఇనె్వస్టర్ల ఆకర్షణకు కార్యాచరణ

హైదరాబాద్, జూలై 5: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేశామని పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ తెలిపారు. పెట్టుబడులకు సంబంధించి మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశానికి 26 మంది పర్యాటక రంగ పెట్టుబడిదారులు వచ్చారన్నారు. ఏఎన్‌ఏ టెక్నాలజీస్, అమరావతి టూరిజం, సముద్ర షిప్‌యార్డు, షోర్ ఫ్యూ హాస్పిటాలిటీ, స్కై చోపర్స్, వాటర్ స్పోర్ట్స్ సింపుల్ సంస్థలు ఈ సమావేశానికి హాజరై పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేశాయన్నారు. రాష్ట్రంలో 2029 నాటికి ఈ రంగంలో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

Pages