S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజన్న సన్నిధిలో తుమ్మల, ఈటల

వేములవాడ, జూలై 5: శ్రీ రాజరాజేశ్వరస్వామిని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపి బోయనపల్లి వినోద్‌కుమార్ మంగళవారం దర్శించుకున్నారు. మంత్రులు ఆలయంలోకి రాగానే ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, ఇవో రాజేశ్వర్, స్థానాచారి శంకరయ్య ఆధ్వర్యంలోని అర్చకులు పూర్ణకుంభంతో వారి ఎదురేగి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా వారు కోడె పూజ చేసుకున్నారు. అనంతరం అంతరాలయంలోని శ్రీలక్ష్మిగణపతి స్వామివారికి వారితో అర్చకులు తొలి పూజలను చేయించారు. అక్కడి నుంచి లింగాకారంలో కొలువుదీరిన శ్రీ రాజరాజేశ్వరుడిని దర్శించుకున్నారు.

జిల్లాలో 8 నుండి హరితహారం షురూ

కరీంనగర్, జూలై 5: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమాన్ని జిల్లాలో 8 నుంచి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె హరితహారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారంపై పోస్టర్లు, కరపత్రాలు, క్యాపులతో పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 7వ తేదీన జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాలలో, గ్రామాలలో కళాకారులు, స్వయం సహాయక మహిళలు, యువకులతో ర్యాలీలు నిర్వహిస్తూ అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. 8న పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

ఎల్కతుర్తి, జూలై 5: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 6 లక్షల రూపాయలు వసూలు చేసిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు హుజురాబాద్ రూరల్ సిఐ గౌస్‌బాబా తెలిపారు. మంగళవారం ఎల్కతుర్తి పోలీస్‌స్టేషన్‌లో ముగ్గురు నిందితులను అరెస్టు చూపించారు.

తెలంగాణకే మణిహారం

వేములవాడ, జూలై 5: తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం - భద్రాచలం - కౌముతాల రహదారిని 370 కిలో మీటర్ల మేర జాతీయ రహదారిగా నిర్మిస్తున్నామని, ఇది తెలంగాణ రాష్ట్రానికే మణిహారంకానుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ రహదారి పూర్తయితే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలకు మధ్య దూరం తగ్గి రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని, ఆ దారి వెంట ఉన్న ప్రాంతాలను త్వరిగత గతిన అభివృద్ధి సాధిస్తాయని ఆయన అన్నారు.

ఓ మోస్తారు వర్షం..!

కరీంనగర్, జూలై 5: జూన్ మాసమంతా ఊరించి ఉసురుమన్పించిన వరుణ దేవుడు జూలై మొదటివారం నుంచే కొంతమేర కరుణ చూపిస్తున్నాడు. ఫలితంగా జిల్లాలో ఓ మోస్తారుగా వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో జిల్లాలోని పలుచోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడగా, సోమవారం రాత్రి నుంచి మంగళవారం వేకువజాము వరకు కూడా రెండు మండలాలు మినహా జిల్లా అంతటా వర్షాలు పడ్డాయి. జిల్లాలో సోమవారం రాత్రి నుంచి ఆదివారం వేకువముజాము వరకు కురిసిన వర్షాపాతం వివరాలు ఇలా ఉన్నాయి.

విధుల్లోకి న్యాయమూర్తులు

లీగల్ (కరీంనగర్), జూలై 5: హైకోర్టు విభజన కోసం న్యాయమూర్తులు మూకుమ్మడిగా రాజీనామా చేసిన సందర్భంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా 16మంది న్యాయమూర్తులు విధుల్లోకి చేరారు. తెలంగాణ న్యాయమూర్తుల ఆధ్వర్యంలో ఆంధ్ర న్యాయమూర్తుల ఆప్షన్లను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. ఈసందర్భంగా గవర్నర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని న్యాయమూర్తులు ఒక నిర్ణయానికి వచ్చి కోర్టు విధులు చేపట్టారు. తెలంగాణ న్యాయమూర్తుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వరప్రసాద్ మరో న్యాయమూర్తి తిరుపతిలపై సస్పెన్షన్ వేటు పడింది.

ప్రజారంజక ప్రభుత్వం మాది..

వేములవాడ, జూలై 5: ఉద్యమాల పార్టీగా 15 ఏళ్ల కాలంలో ప్రజల ఆకాంక్షలను దగ్గర నుంచి చూసి వారి ఆశయాల మేరకే పనిచేసే ప్రభుత్వం మాదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. మంగళశారం పట్టణంలో రూ.28కోట్లతో మూలవాగుపై నిర్మిస్తున్న రెండు బ్రిడ్జిల నిర్మాణానికి మంత్రి ఈటల రాజేందర్, ఎంపి బోయనపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబులతో కలిసి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా తుమ్మల మాట్లాడుతూ వచ్చే ఏడాది జూన్ నాటికి బ్రిడ్జి నిర్మాణం పూర్తికావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

చినుకులు తెచ్చే చింతలతో జాగ్రత్త!

వర్షం పడగానే గుంటలలో నీరు నిలువ వుండి, మురికినీరుగా మారిన తరువాత ఆ నీటిలో దోమలు నివాసాలు ఏర్పరచుకుని విపరీతంగా వృద్ధి చెందుతాయి.
దోమకాటువల్ల వచ్చే వ్యాధుల్లో తీవ్రమైనవి డెంగ్యూ, చికున్ గున్యా, మెదడువాపు, మలేరియా. ఈ వ్యాధులను సకాలంలో నయం చేయకపోతే మరణాలు కూడా సంభవిస్తాయి.
అలాగే వర్షాలు పడిన చోట నీరు కలుషితం కావడంతో అతిసార వ్యాధి సంభవిస్తుంది. ఇటువంటి వ్యాధులకు హోమియా బాగా ఉపయోగపడుతుంది.
మలేరియా
మలేరియా జ్వరం ప్రతి ఏటా ఎక్కువగా వర్షాలు పడిన తరువాత దోమల వల్ల వ్యాధి చెందుతుంది.

డా.పావుశెట్టి శ్రీ్ధర్.. 9440229646

మనో శారీరక వ్యాధులంటే...?

ప్రశ్న: మనో శారీరక వ్యాధులంటే...?
మానసిక వ్యాధులకు మనో శారీరక వ్యాధులకు మధ్య తేడా ఉంది. ఆ సున్నితమైన తేడాని గుర్తించక చాలామంది తికమక పెడుతుంటారు.

నిజాంసాగర్‌లో భారీ వర్షం

నిజాంసాగర్, జూలై 5: నిజాంసాగర్ మండల కేంద్రంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. నిజాంసాగర్-నర్సింగరావుపలి ల ప్రధాన రహదారిలోవర్షం కురవడంతోగుంతలలో వర్షపు నీరు వచ్చి చేరడంతోప్రయాణీకులు ఇబ్బందు ఎదుర్కొన్నారు. ఈరహదారి విస్తీర్ణం పనుల్లో భాగంగా మొరం జరుగడంతో, మొరం బురదగా మారి ద్విచక్ర వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపురైతులు కురిసిన భారీ వర్షానికి పొలం పనులు ప్రారంభించడానికి అవకాశం కలుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు కురిసి జలాషయంలోకి నీరు చేరాలని రైతలు ఆకాశంవైపు ఎదురు చూస్తున్నారు.

Pages