S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూలై 1న దొర

తమిళంలో జాక్సన్‌దొరైగా రూపొందిన చిత్రాన్ని తెలుగులో ‘దొర’ పేరుతో అందిస్తున్నారు. రత్నా సెల్యులాయిడ్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో సత్యరాజ్, అతని కుమారుడు శిబిరాజ్ నటించారు. బిందుమాధవి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని జక్కం జవహర్‌బాబు తెలుగులో అందిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ, తమిళంలో పీరియాడికల్ హారర్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలను ఈనెల 21న విడుదల చేసి, సినిమాను జూలై 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామన్నారు. హారర్ చిత్రాల ప్రేమికులకు ఈ సినిమా సరికొత్తగా వుంటుందని ఆయన అన్నారు.

యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా త్రయం

పంచాక్షరి పిక్చర్స్ పతాకంపై విష్ణురెడ్డి, అభిరామ్, సంజన, అశోక్ ప్రధాన తారాగణంగా గౌతమ్‌నాయుడు దర్శకత్వంలో పద్మజనాయుడు రూపొందిస్తున్న చిత్రం త్రయం. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ యువతరం మెచ్చే అంశాలతో పక్కా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, ముగ్గురు వ్యక్తుల శక్తియుక్తుల నేపథ్యంలో రియలిస్టిక్‌గా ఈ చిత్రం సాగుతుందని అన్నారు. ఎలాంటి రోప్స్, డూప్స్ లేకుండా ఫైటింగ్ సన్నివేశాల చిత్రీకరణ ఈ సినిమాకు హైలెట్ అని, ప్రేక్షకులకు సరికొత్త థ్రిల్ అందించేలా షూటింగ్ చేశామని అన్నారు.

ఇక ఉపాధి వెల్లువ!

హైదరాబాద్, జూన్ 18: టిఎస్‌ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయని, దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగు పడుతున్నట్టు ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. ఏడాదిలో పరిశ్రమల శాఖ సాధించిన అభివృద్ధిని శనివారం విలేఖరుల సమావేశంలో కెటిఆర్ వెల్లడించారు. ఇప్పటి వరకు 2313 పరిశ్రమలకు అనుమతి ఇచ్చామని, వీటి వల్ల 38,727 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, లక్షా 20 వేల 869 మందికి ఉపాధి లభించినట్టు చెప్పారు.

రెచ్చిపోయన మహిళలు

తొగుట, జూన్ 18: మల్లన్న సాగర్ ఏర్పాటును నిరసిస్తూ గ్రామస్థులంతా ఆందోళన చేస్తుంటే గ్రామానికి చెందిన కొందరు భూములను రిజిస్ట్రేషన్లు చేయిస్తున్నారని ఆరోపిస్తూ ఆగ్రహించిన మహిళలు వారి పంటలను ధ్వంసం చేసి, డ్రిప్ పైప్‌ను దగ్ధం చేసిన సంఘటన తొగుట మండలం ఏటిగడ్డకిష్టాపూర్‌లో శనివారం నాడు జరిగింది. పెద్ద ఎత్తున మహిళలు పంట భూముల్లోకి వెళ్లి మొక్కజొన్నను పీకివేశారు. డ్రిప్‌పైప్‌లు దగ్ధంచేశారు. వరిపంటను పాడుచేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు పెద్దసంఖ్యలో సంఘటన స్థలికి చేరుకుని పంటల ధ్వంసాన్ని అడ్డుకుని నివారించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు.

పంట పండింది!

హైదరాబాద్, జూన్ 18: నిజాంసాగర్ ఆధునీకరణకు ప్రభుత్వం 115 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. రెండు లక్షల 32 వేల ఎకరాలకు సాగునీటిని అందించాల్సిన నిజాంసాగర్ ఆధ్వాన్న పరిస్థితిలో ఉంది. గతంలో ఈ ప్రాజెక్టు ఆధునీకరణకు 549 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పుడది 742 కోట్ల రూపాయలకు పెరిగింది. నిజాం హయాంలో మంజీరా నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకు రావడానికి ఆధునీకరణ పనులు చేపట్టారు. ఆధునీకరణ పనులకు సంబంధించి మొత్తం 15 ప్యాకేజీలు కాగా, వీటిలో పది పూర్తయ్యాయి. మిగిలిన ఐదు ప్యాకేజీల పనులు సాగుతున్నాయి. ప్రధాన కాలువతో పాటు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌కు ఈ నిధులు వ్యయం చేస్తారు.

వాయుసేనకు వీరనారులు

హైదరాబాద్: వాయుసేన చరిత్రలో నూతనాధ్యాయం మొదలైంది. యుద్ధ విమాన పైలట్లు (ఐఏఎఫ్ ఫైటర్ స్క్వాడ్రన్)గా ముగ్గురు మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమిలో శనివారం నాటి గ్రాడ్యుయేటింగ్ ట్రైనీల పాసింగ్ ఔట్ పరేడ్‌లో కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ చేతుల మీదుగా పత్రాలు అందుకుని ‘్భరత వాయుసేన చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదిగిన రోజు ఇది’ అని ఆయన నుంచి ప్రశంసలు అందుకున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఆనందంలో విజయ సంకేతాన్ని ప్రదర్శిస్తున్న అవని చతుర్వేది, భావనాకాంత్, మోహన సింగ్.

వాయుసేనకు కొత్తరెక్కలు

హైదరాబాద్, జూన్ 18: భారత వాయుసేనను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బలోపేతం చేస్తున్నామని, వాయుసేనలో చేరిన యువ పైలెట్లు దేశం సైనికపరంగా ఎదుర్కొంటున్న సవాళ్లను వీరోచితంగా తిప్పిగొట్టాలని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమిలో 129వ వాయుసేన గ్రాడ్యూయేట్ ట్రైనీల శిక్షణ కార్యక్రమం పూరె్తైన సందర్భంగా జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో పారికర్ పాల్గొన్నారు. 130మంది ఫ్లైట్ క్యాడెట్లకు ఆయన శిక్షణ పత్రాలను అందించారు. ఇందులో 22మంది మహిళలు ఉండటం గమనార్హం.

ఆదిభట్లలో ఏరోస్పేస్ స్టేషన్

హైదరాబాద్, జూన్ 18: టాటా-బోయింగ్ ఏరో స్పెస్ యూనిట్‌కు కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ శనివారం శంకుస్థాపన చేశారు. దేశంలో ప్రతిష్టాత్మకమైన టాటా కంపెనీ, వందేళ్లు పూర్తిచేసుకున్న బోయింగ్ కంపెనీ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఏరో స్పేస్ యూనిట్‌ను రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో ప్రారంభించారు. రెండు నెలల్లో రక్షణ రంగ ఉత్పత్తులను ఈ యూనిట్ ప్రారంభిస్తుందని పారికర్ అన్నారు. టాటా- బోయింగ్ ఏరోస్పెస్ యూనిట్ ఏర్పాటు సంతోషకరమని, దీనివల్ల హైదరాబాద్ ఖ్యాతి మరింతగా పెరిగిందని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు.

వానే వాన

విశాఖపట్నం/ న్యూఢిల్లీ, జూన్ 18: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. కోస్తాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. నైరుతి రుతుపవనాలు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలతో పాటు తెలంగాణాలోనూ పూర్తిగా విస్తరించాయని ప్రవేశించాయని తెలిపారు.

వర్శిటీల్లో యోగా శాఖలు

న్యూఢిల్లీ, జూన్ 18: ప్రభుత్వం రూపొందిస్తున్న కొత్త విద్యా విదానం కింద పాఠశాలల్లో యోగాకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి (2016-17) ఆరు కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో యోగా విభాగాలు ప్రారంభమవుతున్నాయని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఢిల్లీలో యోగాపై జరిగిన జాతీయ సదస్సులో ఆమె మాట్లాడుతూ వివిధ వర్శిటీల్లో యోగా విభాగాలు పునరుద్ధరించటం కానీ, కొత్తగా ప్రారంభించటం కానీ చేస్తామన్నారు. మరో ఏడాదినాటికి యోగా తరగతులు నిర్వహించే సంఖ్య 20కి చేరుకుంటుందని ఆమె అన్నారు.

Pages