S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం

హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను మరోసారి యుఎల్‌సి భూములకు వర్తింపచేసింది. దీనికి ప్రత్యేకంగా జీవో నంబర్ 92ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టానికి లోబడి ప్రభుత్వానికి అప్పగించిన భూముల్లో ఆక్రమించుకున్న భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలో సుమారు 600 ఎకరాల ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు అవకాశం కల్పించగా హైదరాబాద్ జిల్లాలోని సుమారు 71 ఎకరాల ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తోంది.

‘దివాలా’ దిశగా బల్దియా!

హైదరాబాద్, జూన్ 18: మహానగర ప్రజలకు అతిముఖ్యమైన పౌరసేవలను అందిస్తూ, అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి పనులు చేపట్టే బల్దియా ఖజానా దివాలా తీసే దిశగా వెళ్తుందా? ఎప్పటికపుడు ప్రజలకు మెరుగైన సేవలందించే దిశగా పడాల్సిన బల్దియా అడుగులు ఆర్థిక సంక్షోభం దిశగా పడుతున్నాయని చెప్పవచ్చు.

నేడు పబ్లిక్ గార్డెన్స్‌లో బ్రహ్మకుమారీల నేతృత్వంలో యోగా

హైదరాబాద్, జూన్ 18 : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐదువేల మంది బ్రహ్మకుమారీలు ఆదివారం హైదరాబాద్‌లో సామూహిక యోగా ప్రదర్శిస్తారని సంస్థ ప్రతినిధి బికె సరళ తెలిపారు. శనివారం ఆమె ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేస్తూ, యోగా, ప్రాణాయామాన్ని బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ప్రోత్సహిస్తోందని గుర్తు చేశారు. ఇందులో భాగంగా ప్రజలను ప్రోత్సహించేందుకు ఐదువేల మంది బ్రహ్మకుమారీలతో సామూహిక యోగాను హైదరాబాద్ (పబ్లిక్ గార్డెన్స్‌లోని జూబ్లిహాలు ఎదుట పార్క్‌లో) లో ప్రదర్శిస్తున్నట్టు సరళ వివరించారు.

నటి విజయశాంతి ఇంట్లో
ఆభరణాల చోరీ

ముంచుకొస్తున్న ముప్పు

హైదరాబాద్, జూన్ 18: మహానగరానికి వర్షం ముప్పు ముంచుకొస్తోంది. నేడో,రేపో నైరుతి రుతుపవనాలు తాకుతుండటంతో నగరంలో గత సంవత్సరం కన్నా ఎక్కువ మోతాదులో వర్షం కురిసే అవకాశామున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. అయినా మోతాదుకు మించి వర్షం కురిస్తే నగరంలో పరిస్థితి మరో సారి అతలాకుతలం కానుంది. కొద్ది రోజుల క్రితం బలమైన ఈదురుగాలులతో కురిసిన వర్షాలకు వందల సంఖ్యలోచెట్లు నేలకొరగటంతో పాటు ఇద్దరు ప్రాణాలు కొల్పోవల్సిన దుస్థితి తలెత్తింది.

విద్యా ప్రమాణాల మెరుగుకు చర్యలు

హైదరాబాద్, జూన్ 18: పాఠశాలలు మొదలయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పట్టణ ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు తక్కువగా ఉన్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలకంటె గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులే మంచి ఫలితాలు సాధించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రెండు జిల్లాల యంత్రాంగాలతోపాటు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందంటూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా స్పష్టం చేసారు.

కథ నచ్చితే ఏ భాషలోనైనా ఓకే

బాలనటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అటుపై హీరోయిన్‌గా తమిళ, మలయాళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది నివేదా థామస్. తాజాగా తెలుగు తెరకు పరిచయమై నటించిన చిత్రం ‘జంటిల్‌మన్’. నాని హీరోగా నటించిన ఈ చిత్రంలో నివేదా థామస్, సురభి హీరోయిన్లుగా నటించారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా హీరోయిన్ నివేదా థామస్ ఇంటర్వ్యూ...
రెస్పాన్స్ ఎలా వుంది?
- చాలా ఆనందంగా వుంది. సినిమా విడుదలకు ముందే మంచి నమ్మకం ఉండేది. అది రిలీజ్ తరువాత బాగా పెరిగింది. ముఖ్యంగా నా పాత్రకు మంచి స్పందన రావడం ఆనందంగా వుంది.

-శ్రీ

అంజలి ప్రేమాయణం?

తెలుగులోకంటే తమిళంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు భామ అంజలికి ఈమధ్య టాలీవుడ్‌లో కూడా మంచి ఇమేజ్ దక్కింది. వరుసగా సినిమాలు చేస్తూ జోరుమీదున్న అంజలి, ఇటీవలే అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ చిత్రంలో ఐటెం సాంగ్ చేసి మెప్పించింది. ప్రస్తుతం ఆమె నటిస్తున్న ‘చిత్రాంగద’ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా వుంది. ఇదిలా వుంటే ప్రస్తుతం కోలీవుడ్‌లో అంజలిపై ఓ న్యూస్ జోరుగా ప్రచారం సాగుతోంది. అంజలి ఓ కోలీవుడ్ హీరోతో ప్రేమాయణం సాగిస్తున్నట్టు ఆ వార్తల సారాంశం. వివరాల్లోకి వెళితే, ఈమధ్యే ఓ యువ హీరోతో అత్యంత సన్నిహితంగా వుంటోందని, అతనితో ప్రేమలో కూడా పడిందని వార్తలొస్తున్నాయి.

అలా ఎందుకు?

సినిమాలో నటించినంత మాత్రాన ఎవరు ఏది రాస్తే అది ఒప్పుకోవాల్సిందేనా? అనవసరంగా లేనిపోనివి అన్నీ రాసి ఇబ్బందిపెడుతున్నారంటూ మీడియాపై చిందులేస్తోంది అందాల నటి శిల్పాశెట్టి. ప్రస్తుతం సినిమాలు మానేసిన ఆమె అవకాశాలకోసం వెంపర్లాడుతోంది. తెలిసిన వాళ్లను కలిసి అవకాశాలు ఇమ్మని అడుగుతోందట. దాంతో బాలీవుడ్ మీడియా శిల్పాశెట్టి తన భర్తకు దూరమైందని, అందుకే సినిమాలలో నటించడానికి భారీ ప్రయత్నాలు చేస్తోందని కథనాలు రాశారట. దీంతో రెచ్చిపోయిన శిల్పాశెట్టి అలా ఎందుకు రాస్తారు? అంటూ అడుగుతోంది. అవకాశాలు వస్తున్నాయి కాబట్టి నటిస్తున్నాను కానీ, తమ వైవాహిక జీవితంలో ఎటువంటి ఒడుదుడుకులు లేవని చెబుతోంది.

మళ్లీ ఆడను!

చేతిలో డబ్బుంటే ఏదైనా చేయచ్చు. మంచి పనీ చేయచ్చు. ఎవరికీ పనికిరాని పనీ చేయచ్చు. అలా ఈసారి చేతి నిండా డబ్బుండడంతో రకుల్‌ప్రీత్‌సింగ్ గ్యాంబ్లింగ్ ఆటకు సై అన్నదట. మన దేశంలో అయితే ఎక్కడపడితే అక్కడ అభిమానులు చుట్టేస్తారు కనుక రకుల్ ఈసారి లాస్‌వెగాస్ వెళ్లింది. ఆ పట్నం అంటేనే గ్యాంబ్లింగ్‌కు పెట్టింది పేరు. ఎన్నోసార్లు ఆ ఆట ఆడే ముచ్చటను వాయిదా వేసుకున్న రకుల్ ఈసారి నిజంగానే ఆటలో దిగేసింది. అనుభవ రాహిత్యంతో దాదాపు 200 డాలర్లు పోగొట్టుకుందట. మన కరెన్సీలో ఇది దాదాపు 15వేలకు సమానం. పోతే పోయింది గానీ మంచి అనుభవమైతే వచ్చింది. అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ అయెనే..

పాటలే శ్వాసగా...

నాగచైతన్య, మంజిమా మోహన్ జంటగా ద్వాఠకా క్రియేషన్స్ పతాకంపై గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రవీందర్‌రెడ్డి రూపొందించిన చిత్రం సాహసం శ్వాసగా సాగిపో. ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో బిగ్ సీడీని నాగార్జున, గోపీచంద్ విడుదల చేయగా, ఆడియో సీడీని ఎ.ఆర్.రహమాన్ ఆవిష్కరించారు. ట్రైలర్‌ను దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని పాటలు వింటుంటే మనల్ని ఎక్కడికో తీసుకెళ్లినట్లు ఉంటుందని, మరిచిపోలేని అనుభూతి కలిగిందని అన్నారు.

Pages