S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హంఫ్రీడేవీ (ప్రముఖ శాస్తవ్రేత్తలు)

హంఫ్రీడేవీ 1778లో ఇంగ్లండ్‌లోని పెంజాన్స్ అనే పట్టణంలో జన్మించాడు. పెంజాన్స్ ఆ రోజుల్లో చిన్న కుగ్రామం మాత్రమే. అక్కడ చదువుకున్నవారు చాలా తక్కువ. డేవీ మాత్రం అందరికీ విరుద్ధంగా ఉండేవాడు. ప్రకృతిని చూసి పరవశిస్తూ కవితలు రాసేవాడు. తల్లిదండ్రులు అన్ని పెద్ద కవిగా చూడాలనుకునేవారు. కానీ డేవీ వైద్య శాస్త్రంలో చేరాడు. ‘డేవీస్ గిల్బర్ట్’ అనే శాస్తజ్ఞ్రుడితో పరిచయమయింది. గిల్బర్ట్ అప్పటికే ప్రఖ్యాత శాస్తజ్ఞ్రుల కోవలోకి చెందిన వ్యక్తి. అతడు హంఫ్రీడేవీలోని ఉత్సాహాన్ని పసిగట్టి తన వద్ద శాస్త్ర పరిశోధక సహాయకుడిగా చేర్చుకున్నాడు.

-పి.వి.రమణకుమార్

ఇక జీవిత కథలపై...!

బాలీవుడ్ భామ విద్యాబాలన్ ఆసక్తి అంతా ఇప్పుడు జీవితకథలపైనే ఉందట. తాజాగా విద్యాబాలన్ మరాఠీ చిత్రం ‘ఏక్ అల్బెలా’లో నటి గీతాబాలి క్యారెక్టర్‌ను పోషిస్తోంది. ప్రఖ్యాత నటుడు భగవాన్ దాదా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. ఈ చిత్రం గురించి విద్యను కదిలిస్తే- ‘‘ఇది గీతాబాలి జీవిత కథ మాత్రమే కాదు. ఆమె జీవితంలోని అన్ని పార్శ్వాలు చూపించారు. ఈ మధ్య జీవిత కథలతో నావద్దకు చాలా మంది వస్తున్నారు. నాకు కూడా ఇలాంటి కథలంటే బాగా ఆసక్తి కలుగుతోంది కూడా. ఈ చిత్రంలోని పాత్ర కోసం ఎన్నో కసరత్తులు చేశాను. మరాఠీ నుంచి ఇలాంటి మంచి మంచి ఆఫర్లు మరిన్ని వస్తున్నాయి.

-సమీర్

పెళ్లిగోల ఏల!

...అంటోంది అందాల భామ అనుష్క. మూడు పదుల వయస్సు దాటిన ఈ సుందరాంగి ముందు ఎవరైనా పెళ్లి మాట ఎత్తితే ఈ విధంగానే సమాధానమిస్తుంది. వెండితెరపై అడుగుపెట్టే ముందు వున్న ఆలోచనలు వేరు..పాదం మోపాక కెరీర్‌లో అన్నీ చూసేశాక ప్రతీ హీరోయిన్ ఈ విధంగానే కాకమ్మ కథలు చెబుతారు. ఇది పరిశ్రమలో మామూలైపోయింది. ఎస్.ఎస్.రాజవౌళి ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’లతో కెరీర్‌లో ఉన్నత స్థాయికి ఎదిగిన ఈ అందాలబొమ్మకు పెళ్లికి ఇదే సరైన సమయం అని ఆమె సన్నిహితులు చెబుతున్నా ఈ బ్యూటీ వినడంలేదట! ఈ విషయం గురించి అనుష్కను ఎవరైనా కదిలిస్తే- ‘‘పెళ్లికి సరైన సమయం ఏదో నాకు తెలుసు. అప్పుడే నేను తొందరపడడంలేదు.

-సమీర్

కొత్త అవతారం!

బాలీవుడ్ బ్యూటీ ‘దబాంగ్’ భామ సోనాక్షి సిన్హా రూటే వేరు. చేసే ప్రతి చిత్రంలో..పోషించే ప్రతి క్యారెక్టర్ పట్ల ఎంతో శ్రద్ధ తీసుకోవడమేగాక ఆ పాత్ర తన కెరీర్‌కు ఎలా ఉపయోగపడగలదో కూడా బాగా ఒంట బట్టించుకుంటోంది. తండ్రికి తగ్గ తనయగా విశేష ప్రాచుర్యాన్ని అతి తక్కువ సమయంలోనే సంపాదించుకుంది. కెరీర్‌లో ఇప్పుడు మరో కొత్త అవతారం ఎత్తింది. అదే..పాత్రికేయురాలిగా తన తాజా చిత్రం ‘నూర్’లో నటించబోతోంది. పాకిస్థానీ రచయిత్రి సబా ఇంతియాజ్ నవల ‘కరాచీయు ఆర్ కిల్లింగ్‌మి’ ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. కరాచీలో వుండే ఆయేషా అనే ఇరవై ఏళ్ల పాత్రికేయురాలి కథ ఇది. అయితే ఈ ‘నూర్’కథ ముంబయి నేపథ్యంగా ఉణటుంది.

-సమీర్

వంద ముద్దులు... వెయ్యి తన్నులు

సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మ ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని పలు సంచలన కామెంట్లతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాడు. ఇప్పటికే పలువురిపై కామెంట్లు చేసిన వర్మ తాజాగా, ఈమధ్యే రజనీకాంత్‌ని టార్గెట్ చేస్తూ ఆయన అభిమానులకు కోపం తెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వర్మ రజనీని పొగుడుతూ చేసిన ట్విట్ అందరికీ షాక్ ఇస్తోంది. సూపర్‌స్టార్ రజనీకాంత్ వంద ముద్దులకు అర్హుడని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. ‘కబాలి’ చిత్రంలోని ‘నిరుప్పడా’ పాట టీజర్‌ను చూసిన వర్మ పైవిధంగా స్పందించాడు. అందులోనే ఆయన మరోమాట కూడా చెబుతూ- ‘సబ్‌టైటిలింగ్‌కు బాధ్యుడైన వ్యక్తిని వెయ్యి తన్నులు తన్నండి’ అని ట్విట్ చేయడం విశేషం.

కడప కింగేనా?

‘సర్దార్ గబ్బర్‌సింగ్’ పరాజయం తరువాత వెంటనే సినిమాను మొదలుపెట్టాడు పవన్‌కళ్యాణ్. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ‘ఖుషి’ వంటి సంచలన చిత్రాన్ని అందించిన ఎస్.జె.సూర్య దర్శకత్వలో పవన్ నటిస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఒకటి మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి మొదట్లో ‘సరదా’, ‘సేనాపతి’ అనే టైటిళ్లు పెడుతున్నారంటూ వార్తలొచ్చాయి. తాజాగా ఈ చిత్రానికి ‘కడప కింగ్’ అనే టైటిల్‌ను పెడతారంటూ ప్రచారం జరుగుతోంది. దానికి బలమైన కారణమే వుంది.

నాన్నకు ప్రేమతో...

నాన్న మారిపోయాడు....
ఔను... ఆధునిక సమాజంలో..
మార్పులకు తగ్గట్టు...
కుటుంబానికి తగ్గట్టు...
ఆ మాటకొస్తే పిల్లలకు నచ్చినట్లు మారిపోయాడు...
చిన్నపిల్లలకు గురువుగా... వారికి వయసు పెరిగేకొద్దీ స్నేహితుడిగా.. వారికి పెళ్లయ్యాక మార్గదర్శిగా మారిపోయాడు.
కుటుంబం కోసం తనను తాను మార్చుకున్నాడు..
తన కలల రూపాలైన పిల్లల కోసం తల్లిలా మారిపోయాడు..
ఉద్యోగం...కష్టాలు...అసౌకర్యాలు...అనర్థాలు ఎన్ని ఎదురైనా...
ఎదురుగా పిల్లలు కన్పిస్తే తానూ చిన్నపిల్లాడిలా మారిపోవడం నేర్చుకున్నాడు.
పిల్లలు ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు..

-ఎస్.కె.రామానుజం

ఆత్మ... అద్వైత చైతన్య ప్రభంజనం

ఆత్మ... పరమాత్మ - ఏది ముందు? ఏది వెనుక?
ప్రకృతి... పురుషుడు - ఎవరిది ముందడుగు? ఎవరిది వెనకడుగు?
విత్తు.. చెట్టు - దేనిది తొలి రూపం? దేనిది మలిరూపం?

డా.వాసిలి వసంతకుమార్ 93939 33946

ఇది కథేనా?

ఆయమ్మ ప్రతి నిత్యం 72 పనులు ఒకదాని తరువాత ఒకటి పొల్లువోకుండ చేస్తుంది. పనిలో ఉన్నప్పుడు మాటలుండవు. ఒక్క పని కూడా కొత్త పద్ధతిలో చేసేది లేదు. చేసే పనులలో రెండు పూటలా తులశమ్మ పూజ కూడ ఉన్నది. ఉండేది ఐదంతస్తుల భవనం. అన్నిటికన్నా మీది మాలెలో. అక్కడ పాదుచేసి చెట్లు పెంచేందుకు ఉండదాయె. తులశమ్మను ఈ మధ్యన వీలున్నవాండ్లు కూడా తొట్లలోనే పెంచుతున్నరు. ఇక్కడ కూడ చెట్టు తొట్టెలోనే ఉన్నది. ఆ తొట్టెలోని చెట్టుకు ఆయమ్మ రెండు పూటల చెంబెడు నీళ్లు పోసి దండము పెడుతుంది. పొద్దున్న రెండు ఊదు వత్తులు కూడా ఉంటయి. ఆకాశములో ఉంటే కిందికన్నా గాలి ఎక్కువ ఉంటుంది కదా!

కె.బి. గోపాలం

Pages