S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవిష్య కాలం

డి.ఎస్.సదాశివప్రసాద శర్మ, వీరవల్లి (కృష్ణా)
ప్ర:ప్రజా సంక్షేమానికి సంబంధించిన ఒక గొప్ప జల వనరుల ప్రణాళికను- సౌరశక్తి ఉపయోగం ప్రణాళికను తయారుచేశాను. రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించమంటారా? కేంద్ర ప్రభుత్వానికా?
సమా:కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధానమంత్రి దృష్టికి వచ్చే విధంగా పి.ఎమ్.ఓ ఆపీసుకు పంపించండి. రాష్ట్ర ప్రభుత్వానికైతే మీరు స్థానికులే కనుక తగు గుర్తింపు రాకపోవచ్చును.
ఆళ్ళ వెంకటేశ్వరరావు, కూకట్‌పల్లి, హైదరాబాద్
ప్ర:నేను మంచి రచయితనని అందరూ ప్రశంసిస్తారు. నా రచనలు వెలుగులోకి రావాలంటే ఏం చేయాలి? నా ఆరోగ్యం గురించి కూడా చెప్పండి?

‘దివ్యజ్ఞాన విభూషణ’ ఉమాపతి బి.శర్మ

పంటి నొప్పికి రూట్ కెనాల్‌తో సాంత్వన

ఫంటినొప్పి ఎంత ఘోరమో అనుభవించినవాడికి తెలుస్తుంది. ఒకప్పుడు పన్ను నొప్పెడితే తీసేసేవారు. అది అప్పటి వైద్యం. కాలంతోపాటు ఇప్పుడు చికిత్సా విధానం కూడా మారింది. తియ్యడం చాలా అరుదు. నొప్పెడితే ఆ పన్నుకి రూట్ కెనాల్ చేసి దాన్ని కాపాడుతున్నారు. పంటి బాధితునికి వరంలా ఈ రూట్ కెనాల్ చికిత్స.
అసలు రూట్ కెనాల్ అంటే?

-డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615

నడిపించేవాడే నాన్న... నేడు ఫాదర్స్ డే...

......................
అమ్మ పరిచయం చేసిన మొదటి వ్యక్తి నాన్న. నాన్నంటే
నడిపించే వాహనం. నాన్నంటే నడిచొచ్చే దైవం.
బిడ్డ పుట్టుకకు హేతువై విద్యాబుద్ధులు నేర్పటంలో గురువై, వారి అభివృద్ధికోసం అహర్నిశలూ శ్రమించే సైనికుడే నాన్న. తనకంటే తన బిడ్డను గొప్పవాడిగా తీర్చిదిద్దేందుకు తన భుజాలను ఆసరాగా యిచ్చి ఎత్తుకి ఎదగాలని కోరుకునే
గొప్ప వ్యక్తిత్వం గలవాడు నాన్న.
నాన్నంటే భరోసా! నాన్నంటే భద్రత! నాన్నంటే బాధ్యత!
..............................

Chellapilla syamala

ఉద్యోగాల పేరుతో ఓ ప్రైవేటు సంస్థ టోకరా

విజయవాడ (క్రైం), జూన్ 18: సహకార బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ యువకులకు టోకరా వేసి లక్షలు వసూలు చేసిన ఓ ప్రైవేటు సంస్ధ నిర్వహకులపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... పటమట తోటవారి వీధిలో గత కొంతకాలంగా భారతీయ గ్రామీణ బహుళ రాష్ట్ర సహకార పరపతి సంఘం పేరుతో ఓ సంస్థ వెలిసింది. పలు సహకార బ్యాంకుల్లో క్లర్కు, మేనేజర్ ఇతర హోదాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఇందుకోసం ముందుగా తమ సంస్థ తరపున శిక్షణ ఇచ్చి కోర్సు పూర్తయిన తర్వాత ఆయా ఉద్యోగాలకు అపాయింట్‌మెంట్‌లు ఇవ్వడం జరుగుతుందని సంస్థ నిర్వహకులు ప్రచారం గుప్పించారు. దీంతో పలువురు నిరుద్యోగులు సంస్థలో చేరి లక్షలు ముట్టచెప్పారు.

ఆగస్టు 8 నాటికి పుష్కర నగర్లు సిద్ధంగా ఉంచాలి

విజయవాడ, జూన్ 18: ఆగస్టు 12 నుండి ప్రారంభమయ్యే కృష్ణా పుష్కరాలకు ఆగస్టు 8నాటికే పుష్కరనగర్‌లు సిద్ధంగా ఉంచాలని సంబంధిత పుష్కర నగర్ ఇన్‌ఛార్జిలకు సబ్ కలెక్టర్ డా.జి.సృజన సూచించారు. శనివారం మధ్యాహ్నం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సబ్ కలెక్టర్ పుష్కరనగర్‌ల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుష్కరాల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో పుష్కరనగర్‌ల ఏర్పాటుకు తీసుకోవలసిన అన్ని ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

విజయవాడ - సికింద్రాబాద్ మధ్య రేపటి నుండి కొత్త రైలు

విజయవాడ (రైల్వేస్టేషన్), జూన్ 18: విజయవాడ - సికింద్రాబాదు మధ్య నూతనంగా ఏర్పాటు చేసిన హైస్పీడ్ సూపర్‌ఫాస్ట్ రైలును రైల్వే మంత్రి సురేష్ ప్రభాకర్ ప్రభు సోమవారం విజయవాడ స్టేషన్ నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న సెక్రటేరియట్ విజయవాడకు వస్తున్న సందర్భంగా ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుని కోరగా ఈ రైలుని ఏర్పాటు చేశారు. 20వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు గ్రీన్ సిగ్నల్ చూపి ఈ రైలును ప్రారంభించనున్నారు. రైలు నెంబరు 02795గా విజయవాడలో బయలుదేరి గుంటూరు, నడికుడి మీదుగా సికింద్రాబాద్ చేరుతుంది.

ప్రతిభ, పనితీరు ఆధారంగానే బదిలీల ప్రక్రియ

విజయవాడ, జూన్ 18: ప్రతిభ, పనితీరు ఆధారంగానే బదిలీల ప్రక్రియ ఉంటుందని కలెక్టర్ బాబు ఎ తెలిపారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్‌లో శనివారం రాష్ట్ర, జిల్లా స్థాయి ఎన్జీవో నాయకులు కలెక్టర్ బాబు ఎ ను కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 5ఏళ్లు దాటిన వారికి తప్పనిసరిగా బదిలీ చేపడతామని, 3ఏళ్లు దాటిన వారు ఇచ్చే ఆప్షన్ ప్రకారం బదిలీ ప్రక్రియ ఉంటుందన్నారు. జీరో బేస్‌డ్ ట్రాన్స్‌ఫర్ బదిలీ ప్రక్రియ అనే మాటే ఉత్పన్నం కాదని అధికారులకు ప్రభుత్వం మార్గదర్శకాలపై వివరాలు తెలియజేశామన్నారు. అందుకు విరుద్ధంగా ఎటువంటి బదిలీలు జరగవని తెలిపారు.

ప్రభుత్వ పథకాలు కావాలంటే ‘ఆధారే’ ఆధారం

విజయవాడ, జూన్ 18: 20 గుర్తింపు పత్రాల ఆధారంగా స్మార్ట్ పల్స్ సర్వే సమగ్రంగా చేపట్టేందుకు జిల్లాస్థాయి నుండి మండల స్థాయి వరకు డేటా సేకరణలో సమగ్రమైన శిక్షణ అందించి ముందుకు వెళ్లాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో ఆధార్ సంఖ్యలేని ప్రజలకు ప్రభుత్వపరంగా ఎటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందవని, అందుకోసం వారిలో అవగాహన పెంచి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేలాగా, అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలాగా ప్రతి ఒక్కరూ ఆధార్ సంఖ్యను తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్

ఉప్పల్, జూన్ 18: ఒకవైపు సిసి కెమెరాలు..మరొక వైపు పోలీసు గస్తీలు ముమ్మరం చేసినా చైన్ స్నాచర్ల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. రెచ్చిపోయిన దొంగలు శుక్రవారం రాత్రి మేడిపల్లి, ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో దారిన వెల్లే మహిళలను వెంబడించి వారిపై దాడిచేసి బలవంతంగా బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం పీర్జాదిగూడ శంకర్‌నగర్‌లో నివసిస్తున్న పుష్పలత కిరాణం జనరల్ స్టోర్‌కు వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన దుండగులు ఆమె మెడలోని బంగారు చైన్‌ను లాక్కొని పారిపోయారు.

రూ.25 కోట్లతో రవాణా శాఖకు సొంత భవనాలు

హయత్‌నగర్, జూన్ 18: తెలంగాణ రాష్ట్రంలో రవాణా శాఖను ఆధునీకరించేందుకు రూ.25కోట్లతో సొంత భవనాలు నిర్మిస్తున్నట్టు రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. హయత్‌నగర్ మండలం మనె్నగూడ ఆర్టిఓ కార్యాలయంలో డ్రైవింగ్ ట్రాక్‌ను శనివారం ఆయన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ కొత్త రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనివిధంగా రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇందులో భాగంగా రోడ్డు భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

Pages