S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్‌లోకి మ్యాక్స్ లైఫ్, ఫైనాన్షియల్ సర్వీస్‌లు విలీనం

న్యూఢిల్లీ, జూన్ 17: దేశీయ ప్రైవేట్ బీమా రంగంలో అతిపెద్ద ఏకీకరణకు తెర లేసింది. హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్‌లోకి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విలీనమవుతున్నాయి. ‘ఓ పథకం ప్రకారం హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌లోకి మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ విలీనం జరుగుతోంది. ఇందుకు మూడు సంస్థల బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు.’ అని నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు హెచ్‌డిఎఫ్‌సి తెలిపింది. భాగస్వాములు, రెగ్యులేటరీ, న్యాయస్థానాలు, ఇతరత్రా థర్డ్ పార్టీ అనుమతులు పొందాల్సి ఉందని హెచ్‌డిఎఫ్‌సి పేర్కొంది.

అంతలోనే ఆరొందలు పతనం

న్యూఢిల్లీ, జూన్ 17: బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గురువారం 30,000 రూపాయలకుపైగా పలికిన 10 గ్రాముల 99.9 స్వచ్ఛత కలిగిన పుత్తడి.. శుక్రవారం 29,650 రూపాయలకు దిగింది. ఆభరణాల వర్తకుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ఈ ఒక్కరోజే 600 రూపాయలు తగ్గింది. నాణేల తయారీదారులు, పరిశ్రమ నుంచి ఆదరణ కరువవడంతో కిలో వెండి ధర కూడా 950 రూపాయలు తగ్గి 41,100 రూపాయలను తాకింది. అంతర్జాతీయంగానూ పసిడి ధర ఔన్సు 13.50 డాలర్లు పడిపోయి 1,278 డాలర్లకు చేరింది. ఇక దేశీయ మార్కెట్‌లో 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర 29,500 రూపాయలుగా నమోదైంది. కాగా, గురువారం 10 గ్రాముల పసిడి ధర 580 రూపాయలు, కిలో వెండి ధర 700 రూపాయలు పెరిగినది తెలిసిందే.

విద్యుదాఘాతానికి ట్రాన్స్‌కో హెల్పర్ మృతి

కూచిపూడి, జూన్ 17: విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడిన ట్రాన్స్‌కో హెల్పర్ బొమ్మిడి లీలాకృష్ణ గురువారం రాత్రి మృతి చెందినట్లు ఎఇ బి శివన్నారాయణ శుక్రవారం తెలిపారు. ఈ నెల 11న మండలంలోని యద్దనపూడి గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మరమ్మతు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. విజయవాడ సెంటిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లీలాకృష్ణ గురువారం రాత్రి మృతి చెందినట్లు ఎఇ తెలిపారు.

ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో రెండో రౌండ్‌కు మనోజ్

బాకు (అజర్‌బైజాన్), జూన్ 17: అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య (ఎఐబిఎ) ఆధ్వర్యాన అజర్‌బైజాన్‌లోని బాకులో జరుగుతున్న వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ మనోజ్ కుమార్ శుభారంభాన్ని సాధించాడు. కామనె్వల్త్ క్రీడల్లో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్న మనోజ్ కుమార్ లైట్ వెల్టర్ వెయిట్ (64 కిలోల) ఓపెనింగ్ బౌట్‌లో 2-1 తేడాతో ప్యూర్టారికోకు చెందిన డానియెలిటో జొరిలా డీ లా రోసాను మట్టికరిపించి సత్తా చాటుకున్నాడు. ఆదివారం జరుగనున్న రెండో రౌండ్ బౌట్‌లో మనోజ్ ఈజిప్టుకు చెందిన రెండో సీడ్ బాక్సర్ మహమ్మద్ ఎస్లామ్ అహ్మద్‌తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

జెడ్పీటిసిపై హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్టు

అవనిగడ్డ, జూన్ 17: కోడూరు జెడ్పీటిసి బండే శ్రీనివాసరావు ఇటీవల జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి విస్సంశెట్టి మణికంఠ, పోతన ప్రభు వర ప్రసాద్‌లను కోడూరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. కోడూరు శివారు కృష్ణాపురం నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డియస్‌పి సయ్యద్ ఖాదర్ బాషా తెలిపారు. నిందితులు ఇరువురిని డియస్‌పి కార్యాలయంలో మీడియా ముందు హాజరుపర్చారు. ఈ కేసులో పూతబోయిన సీతారత్న సాయిబాబు, పాలడుగు ఆనందరావులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. పాతకక్షలే ఈ హత్యాయత్నానికి ప్రధాన కారణంగా తెలుస్తోందన్నారు.

ప్రైవేటుకు ధీటుగా ఫలితాలు సాధించాలి

మైలవరం, జూన్ 17: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రైవేటు పఠశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి స్థానిక ఎల్‌హెచ్ రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వనమహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి ఉమ పాల్గొన్నారు. అంతకు ముందు అదే స్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులతో మమేకమయ్యారు. స్కూల్‌లో విద్యార్థులు ఎలా చదువుతున్నారు, వారికి సౌకర్యాలు, వారి కోర్కెలు, వారి ఆశయాల గురించి వారితో ముచ్చటించారు.

కృష్ణాలో 80 వేల ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేతకు ఏర్పాట్లు పూర్తి

విజయవాడ, జూన్ 17: రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ గంథం చంద్రుడు తెలిపారు. పౌర సరఫరాల శాఖ ద్వారా రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫా, చౌకధరల దుకాణాలలో కందిపప్పు అమ్మకాలు వంటి పలు అంశాలపై శుక్రవారం హైదరాబాద్ నుండి పౌర సరఫరాల శాఖ కమిషనర్ జయలక్ష్మి, సివిల్ సప్లరుూస్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కె.రామ్‌గోపాల్, డైరెక్టర్ జి.రవిబాబు, అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.

నగరంపై త్రినేత్రం.. నిఘా పటిష్ఠం

విజయవాడ (క్రైం), జూన్ 17: ప్రజా భద్రతకు ప్రాధాన్యమిస్తూ నగరంలో ఏపి పబ్లిక్ సేఫ్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్టు అమలుకు నగర పోలీసు కమిషనరేట్ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రజలు, వివిధ వర్తక, వాణిజ్య, వ్యాపార సంఘాలను భాగస్వాములను చేసింది. ఏ విధమైన ఒత్తిడి లేకుండా స్వచ్చందంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. దీంతో రాజధాని నగరంలో నిఘా పటిష్ఠమైంది. ఇ-నేత్రం ప్రాజెక్టు రూపకల్పనతో మూడో కన్ను నిరంతర పర్యవేక్షణ పరిధిలోకి నగరం వచ్చేసింది.

పుష్కర పనుల్లో జాప్యం సహించం

విజయవాడ: జిల్లా కలెక్టర్ బాబు ఎ శుక్రవారం ప్రకాశం బ్యారేజీ అప్రాన్, నూతన వంతెన నిర్మాణం, కృష్ణవేణి ఘాట్, దుర్గాఘాట్, మోడల్ గెస్ట్ హౌస్, పున్నమి, భవాని ఘాట్లలో పురోతిలో ఉన్న పనులను కలెక్టర్ శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అప్రాన్ పైన వున్న విద్యుత్ వైర్లను వెంటనే తొలగించి భూగర్భ వైరింగ్ చేయాలని ఆదేశించినప్పటికీ ఇంతవరకు పనులు ప్రారంభించకపోవటంపై కలెక్టర్ విద్యుత్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్రాన్ అప్రోచ్ రోడ్ డిజైన్‌ను కలెక్టర్ ఇరిగేషన్ సిఇ సుధాకర్‌తో చర్చించి పలు సూచనలు చేశారు.

నాణ్యత తప్పనిసరి

విజయవాడ, జూన్ 17: పుష్కర పనులలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బాబు ఎ ఆర్ అండ్ బి అధికారులను హెచ్చరించారు. అంతేగాక ఇదే ఆర్ అండ్ బి ఇఇ మాధవ స్వరూప్‌ను బాధ్యతల నుంచి తప్పిస్తూ ప్రభుత్వానికి సరెండర్ చేశారు.

Pages