S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మోసగించడం చంద్రబాబుకు అలవాటు

జంగారెడ్డిగూడెం, జూన్ 17: మోసాలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అలవాటైపోయిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సిపి గిరిజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు విమర్శించారు. స్థానిక 2వ వార్డులో కాపు సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారం నాలుగోరోజుకు చేరాయి. ఈ దీక్షలను పిసిసి అధికార ప్రతినిధి జెట్టి గురునాధరావుతో కలసి బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ అధికారం కోసం అబద్ధాలతో ప్రజలను మోసం చేసాడని, అధికారంలోకి వచ్చిన తరువాత ఆడిన అబద్ధాలు సైతం మరచి పోయాడని, ఇది చంద్రబాబుకు అలవాటేనని అన్నారు. అదే పద్ధతిలో ఇప్పుడు కాపులను మోసం చేసాడని విమర్శించారు.

కుట్ర రాజకీయాలు తగదు

ఏలూరు, జూన్ 17 : రాష్ట్రంలో తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు కుట్ర రాజకీయాలు చేయడం కూడదని టిడిపి జిల్లా అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, జిల్లా పార్టీ కార్యాలయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్‌లు పేర్కొన్నారు. కాపు వర్గానికి తగిన న్యాయం చేసేది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇప్పటికే కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించామని, రిజర్వేషన్లు కల్పించేందుకు కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారని తెలిపారు. చిరంజీవిపై దాడి చేసిన భూమన కరుణాకర్‌రెడ్డి ముద్రగడ పద్మనాభానికి ఎలా మిత్రుడయ్యారని ప్రశ్నించారు.

ప్రభుత్వమే బాధ్యత వహించాలి

భీమవరం, జూన్ 17 : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దీక్ష విషయంలో వెంటనే స్పందించకపోతే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని కాపునాడు జిల్లా అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడు హెచ్చరించారు. ఆచంట నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం శుక్రవారం మార్టేరులోని రెడ్డి కల్యాణ మండపంలో జరిగింది. ఈ సందర్భంగా చినిమిల్లి వెంకట్రాయుడు మాట్లాడుతూ 10 రోజుల నుండి దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడంలేదని, అయినప్పటికీ రాష్ట్రంలోని కాపులందరూ ఎంతో శాంతియుతంగా, సహనంతో వ్యవహరిస్తున్నారన్నారు.

పంచాయితీల్లో ఇళ్ల పన్నులు పెంచలేదు

ఏలూరు, జూన్ 17 : జిల్లాలోని గ్రామ పంచాయతీలకు ఇళ్ల పన్ను పెంచలేదని, సాఫ్ట్‌వేర్ ఆధారంగా ఇళ్ల నిర్మాణాన్ని బట్టి పన్నుల విధానం అమలుచేశామని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్‌లో శుక్రవారం జిల్లాలోని ఇవోఆర్‌డిల సమావేశంలో గ్రామ పంచాయతీలలో అభివృద్ది కార్యక్రమాల అమలు తీరు, పంచాయితీలలో పన్నుల వసూలు, తదితర అంశాలపై కలెక్టరు సమీక్షించారు. ఎన్నో ఏళ్ల నుండి గ్రామ పంచాయితీలలో ఇష్టానుసారం పన్నులు వసూలు చేయడంవలన బకాయలు వున్నాయని ప్రతీ ఇంటా యజమాని పన్ను కట్టకపోతే పంచాయితీల నిర్వహణ ఎలా ఉంటుందని ప్రశ్నించారు.

ఇసుక లారీలను అడ్డుకున్న రావూరిపాడు గ్రామస్థులు

తాళ్లపూడి, జూన్ 17: ఇసుక రవాణా చేస్తున్న క్వారీ లారీలు తమ గ్రామం మీదుగా వెళ్లడాన్ని రావూరిపాడు గ్రామస్థులు అడ్డుకున్నారు. శుక్రవారం ఉదయం గ్రామం మీదుగా ఇసుక లారీలు అధిక సంఖ్యలో రావడాన్ని చూసి లారీ రవాణాకు అభ్యంతరం తెలిపారు. అధిక లోడు ఉన్న లారీల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనికితోడు ప్రధానంగా రహదారులు గోతులుపడి ఇబ్బందులెదురయ్యే అవకాశం ఉందని గ్రామస్థులు నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల రెండుమార్లు ప్రమాదాలు కూడా జరిగాయని రావూరిపాడుకు చెందిన తొలిశెట్టి బాబ్జీ పేర్కొన్నారు.

మట్టి తవ్వకాలు అడ్డుకున్న అధికారులు

వీరవాసరం, జూన్ 17: వీరవాసరం మండలం రాయకుదురు గ్రామంలో శుక్రవారం వరిచేలల్లో మట్టిని తవ్విస్తుండగా రెవెన్యూ అధికారులు ట్రాక్టర్, జెసిబిని అదుపులోకి తీసుకున్నారు. రాయకుదురుకు చెందిన ఒక వ్యక్తి తన పంట చేలల్లోని మట్టిని తరలిస్తుండగా ఆర్‌ఐ సుధీర్, విఆర్వోలు మట్టి ట్రాక్టర్లను నిలుపుదల చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన సీనరైజేషన్ చెల్లించాలని రైతులకు తెలిపారు. అయితే తన చేలోని మట్టిని తన ఇంటి అవసరాల కోసం తరలిస్తున్నానని, అందుకు సంబంధించిన పత్రాలన్నీ ఉన్నాయని రైతు ఆర్‌ఐకు తెలిపారు. దీనిపై ఆర్‌ఐ సుధీర్ మాట్లాడుతూ మీవద్ద ఉన్న పత్రాలు తీసుకువచ్చి తహసీల్దార్‌కు చూపించాలని పేర్కొన్నారు.

బదిలీ ఉత్తర్వుల కోసం నిరీక్షణ

ఏలూరు, జూన్ 17 : ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు సాంఘిక సంక్షేమ శాఖలోని నాల్గవ తరగతి ఉద్యోగులు ఆన్‌లైన్ ద్వారా బదిలీలకు దరఖాస్తులు చేశారు. నిబంధనల్లో స్వగ్రామమై వుండకూడదని, గతంలో చేసిన స్థానం అయి వుండరాదని, బంధుమిత్రులు వున్న ప్రాంతం ఉండకూడదని, అత్తవారి ఇల్లు కూడా వుండకూడదని ఈ మేరకు దరఖాస్తులు చేసుకోవాలని ఆదేశించారు. ఉద్యోగులు ఆన్‌లైన్ దరఖాస్తులు అందించారు. శుక్రవారం జల భవన్ వద్ద గల కంప్యూటర్ విభాగం నుంచి ఉత్తర్వులు ఇస్తామని పిలుపునివ్వడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న సాంఘిక సంక్షేమ శాఖలోని నాల్గవ తరగతి ఉద్యోగులు జల భవన్ వద్ద ఉత్తర్వుల కోసం నిరీక్షించారు.

ఎఎస్పీ ఆత్మహత్యపై రంగంలోకి సిఐడి

పాడేరు, జూన్ 17: పాడేరు ఎఎస్పీ కె.శశికుమార్ ఆత్మహత్య ఘటనపై విచారణ చేసేందుకు సిఐడి అధికారులు రంగంలోకి దిగారు. ఎఎస్పీ శశికుమార్ గురువారం ఉదయం తన కార్యాలయంలో సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యం చేసుకుని సిఐడి విచారణకు ఆదేశించారు. దీంతో విశాఖపట్నంకు చెందిన సిఐడి డిఎస్పీ వై.వి.నాయుడు సారధ్యంలో ఐదుగురు సభ్యుల బృందం గురువారం రాత్రికి పాడేరు చేరుకుని శుక్రవారం సుదీర్ఘ విచారణ చేపట్టారు. శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యా హ్నం ఒంటి గంట వరకు ఆ బృందం శశికుమార్ ఆత్మహత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.

ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

పరవాడ, జూన్ 17: సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఎన్టీపీసీ) రెండో యూనిట్ శుక్రవారం అధికారులు లైటప్ చేశారు. సింహాద్రి రెండవ యూనిట్‌లో ఈ నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటలకు సాంకేతిక లోపంగా విద్యుత్ ఉత్పత్తి నిలిచి పోయింది. దీనికారణంగా 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం వాటిల్లింది. అయితే రెండవ యూనిట్‌కు సంబంధించిన టర్బైన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ తరుణంలో సింహాద్రి అధికారులు 72 గంటల పాటు శ్రమించి టర్బైన్‌లో తలెత్తిన సాంకేతిక లోపాని సరి చేశారు. దీంట్లో భాగంగా శుక్రవారం తెల్లవారు జామున సింహాద్రి రెండో యూనిట్‌ను అధికారులు లైటప్ చేశారు.

అందరూ క్షేమమే...

నాతవరం, జూన్ 17: మండలంలో ఎ.పి.పురం గ్రామంలో కలుషిత చలిమిడి తిని ఆస్వస్థతకు గురైన వారు క్షేమంగా ఉన్నారని నాతవరం పి.హెచ్.సి. డాక్టర్ ఎల్.సత్యనారాయణ అన్నారు. శుక్రవారం పంచాయతీలో మెగా వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు.గ్రామంలో ఇంటింటికి వెళ్ళి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ఇదే గ్రామానికి చెందిన తొండా నాగమణి అత్తవారింటికి సారెగా చలివిడి తీసుకువచ్చిందన్నారు. చలివిడిని చట్టుపక్కల వారికి పంచిన గంటలోనే 24 మందికి వాంతులు, విరోచనాలు కావడంతో స్థానిక ఎ.ఎన్.ఎం. రామలక్ష్మి తమకు సమాచారంఅందించినట్లు డాక్టర్ తెలిపారు.

Pages