S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జల్సాల కోసం

ఏలూరు, జూన్ 17 : జల్సాలు, షికార్లకు అలవాటుపడిన యువత పక్కదారి పట్టింది. చివరకు బంధువుల ఇంటిలోనే దోపిడీ సీన్ చిత్రించి బంగారాన్ని దొంగతనం చేశారు. చివరకు పోలీసుల విచారణలో మొత్తం వ్యవహారం బట్టబయలైంది. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న యువతీయువకులు కటకటాల పాలయ్యారు. వివరాలు ఇలా వున్నాయి. స్థానిక పవర్‌పేటలో నివాసముంటున్న ఎన్ సరస్వతి ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతోంది. పెదపాడు మండలం వసంతవాడలో నివాసముంటున్న తన పెద్దమ్మ అనంతలక్ష్మి ఇంటికి ఈ నెల 13న సరస్వతి వెళ్లింది. అక్కడ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం కోసం అంటూ ఆ ఇంటికి చేరుకుంది.

కఠిన చర్యలు కొరవడితే... ‘ఓర్లాండో’లకు అంతముండదు

వాషింగ్టన్, జూన్ 17: దేశంలో అత్యంత కఠినమైన రీతిలో తుపాకుల లైసెన్స్‌లకు సంబంధించిన చట్టాలను అమల చేయకపోతే ఓర్లాండో తరహా భయానక మారణకాండలు పునరావృతం అవుతూనే ఉంటాయని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ తరహాలో ఉగ్రవాద చర్యలకు విఘాతక కృత్యాలకు పాల్పడే ప్రతి ఒక్కరినీ గుర్తించడం, నియంత్రించడం, వారి ఆలోచనలను ముందుగానే పసిగట్టడం అనేది ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎవరు పక్కవాళ్లమీద దాడి చేస్తారో, స్నేహితులను కాల్చేస్తారో, సహ కార్మికులపై విరుచుకుపడతారో, పరిచయం లేనివారిపై దాడులు చేస్తారో ఊహించలేని విషయమేనని అన్నారు.

20న ఏరువాకకు చంద్రబాబు

ఏలూరు, జూన్ 17 : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 20వ తేదీన ఉదయం నరసాపురం మండలం చిట్టవరం గ్రామంలో ఏరువాక కార్యక్రమంలో పాల్గొంటున్న దృష్ట్యా పర్యటనను విజయవంతం చేయడానికి అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు అధికారులను కోరారు. స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లాలోని మండలాధికారులతో శుక్రవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ముఖ్యమంత్రి పర్యటనా ఏర్పాట్లను సమీక్షించారు. జిల్లాలో ఖరీఫ్ పంట ప్రారంభసూచికంగా చిట్టవరం గ్రామంలో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న దృష్ట్యా పెద్ద ఎత్తున రైతులు తరలి వచ్చేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కోరారు.

పదునెక్కిన నిఘా

బెంగళూరు, జూన్ 17: ఉగ్రవాద ఎన్‌కౌంటర్ల సంఖ్య పెరగడం అంటే దేశ ఇంటెలిజన్స్ పెరిగిందని, అలాగే ఉగ్రవాద వ్యతిరేక నెట్‌వర్క్ మరింత బిగుస్తోందని దాని అర్థమని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఎన్‌కౌంటర్లు ఎక్కువయ్యాయంటే మనం ఉగ్రవాదులను ఎక్కువ మందిని మట్టుబెడుతున్నామని, మన ఇంటెలిజన్స్ పెరిగిందని, మన ఉగ్రవాద వ్యతిరేక నెట్‌వర్క్ మరింతగా బిగుసుకుంటోందని అర్థమని పారికర్ శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఉగ్రవాదుల మరణాలతో అమరులైన సైనికుల సంఖ్యను పోల్చి చూసినట్లయితే ఇప్పటివరకు చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్య 60కి పైగా ఉంటే అమరులైన భద్రతా జవాన్లు 12 మందే ఉన్నారని ఆయన అన్నారు.

సిఎం పర్యటనకు చిట్టవరంలో ఏర్పాట్లు

నరసాపురం, జూన్ 17: ఈనెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఖరారుకావడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లల్లో నిమగ్నమైంది. నరసాపురం మండలం చిట్టవరంలో ఏర్పాటుచేసిన ఏరువాక కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్న దృష్ట్యా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఏరువాక కార్యక్రమానికి సిఎం చంద్రబాబు ఎద్దుల బండిపై వెళ్ళే విధంగా 25 ఎద్దుల బండ్లు సిద్ధంచేశారు. చిట్టవరం రోడ్డులోని సికిలే ఫౌండేషన్ స్ధలంలో 10వేల మంది కూర్చునే విధంగా బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు. వర్షం వస్తే తడవని విధంగా వాటర్ ఫ్రూప్ పందిళ్లు (టెంట్లు), 10వేల కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు.

గోవుల అక్రమ రవాణా అడ్డగింపు

తణుకు, జూన్ 17: గోవులను వధించేందుకు శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం నుండి తమిళనాడు పుల్లాసి పట్టణానికి లారీలో అక్రమంగా తరలిస్తున్న గోవులను శుక్రవారం స్థానిక గోసంరక్షణ సమితి సభ్యులు పట్టుకున్నారు. ఈమేరకు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గోసంరక్షణ సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండ్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయులు పవిత్రంగా భావించే గోవులను వధించి, మాంసం వ్యాపారం చేయడం అన్యాయమన్నారు. దీనిపై చట్టం ఉన్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యంతో యథావిధిగా వధ జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అష్టదిగ్బంధనంలో కైరానా

లక్నో, జూన్ 17: ఉత్తరప్రదేశ్‌లోని కైరానాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పట్టణం నుంచి వలస వెళ్లిపోయిన హిందూ కుటుంబాలను తిరిగి వెనక్కి రప్పించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని బిజెపి ఎమ్మెల్యే సంగీత్ సోమ్ యూపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో దీనే్న ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని ఎండగతామని ఆయన వెల్లడించారు. ముజాఫర్‌నగర్‌లో 2013లో జరిగిన అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న సంగీత్ సోమ్, సమాజ్‌వాదీ పార్టీ నేత అతుల్ ప్రధాన్‌లు పోటాపోటీగా ర్యాలీలు చేపట్టారు. అయితే నిషేధాజ్ఞలు అమలులో ఉండడంతో షాలీ జిల్లా సరిహద్దులోనే వాటిని ఆపేశారు.

బదిలీల బండి కదిలింది

ఏలూరు, జూన్ 17 : బదిలీల బండి కదిలింది. కదలడమే కాకుండా పోస్టింగ్‌ల మంజూర్లతో పరుగులు మొదలెట్టింది. శనివారం నాటికి మొత్తం ప్రక్రియ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. శుక్రవారం నాటి పరిణామాల్లో బదిలీల జాతరలో దాదాపు నాలుగు శాఖల్లో పూర్తిస్థాయి పోస్టింగ్‌లు విడుదలయ్యాయి. మరో 32 శాఖల్లో ఈ బదిలీల ప్రక్రియ శరవేగంగా ముందుకు సాగుతోంది. అయితే జిల్లా పంచాయతీ విభాగం పరిధిలో మాత్రం కొంత ఇబ్బంది ఏర్పడినట్లు తెలుస్తోంది. అయితే దీన్ని కూడా పరిష్కరించి శుక్రవారం సాయంత్రానికి ఇక్కడ కూడా బదిలీల ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లారు.

మద్ది దేవస్థానం ఛైర్మన్‌గా రంగరాజు

జంగారెడ్డిగూడెం, జూన్ 17: జిల్లాలో ప్రతిష్ఠాత్మక స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం ఛైర్మన్‌గా తాడేపల్లిగూడెంకు చెందిన ఇందుకూరి రంగరాజు (చంటిరాజు)ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం ధర్మకర్తలుగా చంటిరాజు, కేదాసు అర్జునరావు, దూదిపాల బేబి, కర్పూరం ఉమా వెంకట లక్ష్మీనారాయణ, మానుకొండ వెంకటరెడ్డి, ధూళిపాళ సూర్యచంద్ర వెంకట ప్రభాకరరావు, తూటికుంట రాము, కోనేరు మురళీకృష్ణసాయి, పంతెన సత్యనారాయణ పాపరాజు, ఎక్స్ అఫీషియో మెంబర్‌గా ఆలయ ప్రధానార్చకులు వేదాంత, వెంకటాచార్యులు నియమితులయ్యారు.

11 మందికి జీవిత ఖైదు

అహ్మదాబాద్, జూన్ 17: గుల్బర్గ్ సొసైటీ మారణ కాండ సభ్య సమాజం చరిత్రతలోనే చీకటి రోజుగా అభివర్ణించిన ఇక్కడి సిట్ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11 మంది దోషులు జీవిత ఖైదు విధించింది. 2002 గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్‌లో జరిగిన అల్లర్ల సందర్భంగా అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్ సొసైటీపై దాడి చేసిన దుండగులు కాంగ్రెస్ ఎంపీ ఎహ్‌సాన్ జాఫ్రీ సహా 69 మందిని సజీవ దహనం చేసిన సంగతి తెలిసిందే.

Pages