S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్రమాలకు దూరంగా మిషన్ కాకతీయ: హరీష్

హైదరాబాద్: తెలంగాణలో చేపట్టిన మిషన్ కాకతీయ మూడో దశ పనులకు ఈ ఏడాదిలోగా టెండర్ల ప్రక్రియ పూర్తి కావాలని, అన్ని వివరాలూ ఆన్‌లైన్‌లో పారదర్శకంగా ఉండాలని మంత్రి హరీష్‌రావు అధికారులను ఆదేశించారు. ఆయన సోమవారం ఇక్కడ నీటి పథకాలు, మిషన్ కాకతీయ, భూ సేకరణ అంశాలపై జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. మూడుసార్లు పిలిచినా కాంట్రాక్టర్లు రాకుంటే సంబంధిత పనులకు వేరే మార్గాలు అనే్వషించాలన్నారు. టెండర్లు రాకుంటే అయిదు లక్షల రూపాయల లోపు పనులను పంచాయితీలకే అప్పగించాలన్నారు.

పార్టీ ఆదేశాల మేరకే కర్నాటక నుంచి పోటీ: నిర్మల

దిల్లీ: బిజెపి అధిష్ఠానం ఆదేశాల మేరకే తాను ఈసారి కర్నాటక నుంచి రాజ్యసభకు పోటీ చేస్తున్నానని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం తెలిపారు. ఆమె ఇంతవరకూ ఎపి నుంచి రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు. తనను మళ్లీ ఎపి నుంచి ఎందుకు ఎంపిక చేయలేదో తెలియదని, మంగళవారం నాడు కర్నాటకలో తాను నామినేషన్ వేస్తానని ఆమె చెప్పారు.

సెల్‌ఫోన్లను క్లోనింగ్ చేసే ముఠాలు అరెస్టు

హైదరాబాద్: నగరంలో పలు ప్రాంతాల్లో సెల్‌ఫోన్లను చోరీ చేసి వాటి ఐఎంఇఐ నెంబర్లను క్లోనింగ్ చేసి ఇతరులకు విక్రయిస్తున్న రెండు అంతర్రాష్ట్ర ముఠాలను పోలీసులు అరెస్టు చేశారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 45 సెల్‌ఫోన్లు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, క్లోనింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

సొంతలాభానికే ముద్రగడ ఉద్యమం: నారాయణ

విజయవాడ: వ్యక్తిగత లాభం కోసమే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపులను రెచ్చగొడుతున్నారని ఎపి మున్సిపల్ మంత్రి నారాయణ ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్లపై గతంలో విజయభాస్కర రెడ్డి జారీ చేసిన జీవోను అమలు చేయాలని కోరుతున్న ముద్రగడ తెలుగుదేశం ఎంపీగా ఉన్నపుడు నోరు మెదపలేదన్నారు. కాపులకు రిజర్వేషన్లను అమలు చేయడం చంద్రబాబుకు తప్ప మరెవరికీ సాధ్యం కాదని నారాయణ అన్నారు.

క్రికెట్ మైదానాలు ప్రారంభం

విజయవాడ: ఇక్కడికి సమీపంలోని మూలపాడు వద్ద అధునాతనంగా నిర్మించిన రెండు క్రికెట్ మైదానాలను బిసిసిఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ సోమవారం ప్రారంభించారు. 13 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 7 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఈ మైదానాలను తీర్చిదిద్దారు. మంత్రి దేవినేని ఉమ, ఎంపీలు కేశినేని నాని, గోకరాజు గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌లో బెట్టింగ్ ముఠా అరెస్టు

హైదరాబాద్: ఐపిఎల్ క్రికెట్ మ్యాచ్‌ల్లో తుది పోటీ సందర్భంగా భారీ ఎత్తున బెట్టింగ్‌లు నిర్వహించిన ముఠాలో నలుగురిని నగరంలో అరెస్టు చేశారు. వారి నుంచి 20 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేశారు.

పిఠాపురంలో దంపతుల ఆత్మహత్యాయత్నం

కాకినాడ: అధికారులు ఇంటి స్థలాన్ని రద్దు చేశారని తెలియడంతో పిఠాపురంలోని జగ్గయ్యచెరువు ప్రాంతంలో సోమవారం దంపతులు ఆత్మహత్యకు యత్నించారు. భర్త తీవ్రంగా గాయపడగా, భార్య పరిస్థితి విషమంగా ఉంది. నిరుపేదలకు ఇళ్లస్థలాలను రద్దు చేయడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

యుపిలో వరదలు : 12 మంది మృతి

లక్నో: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యుపిలోని పలు ప్రాంతాలు వరద బీభత్సాన్ని ఎదుర్కొంటున్నాయి. వరదల వల్ల ఇంతవరకూ 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక గ్రామాల్లోకి వరద నీరు చొచ్చుకువచ్చింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు పంపడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. వరద పరిస్థితిని పర్యవేక్షిస్తూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

తెలంగాణలో కదలని పెట్రోలియం ట్యాంకర్లు

హైదరాబాద్: పెట్రోలియం ఉత్పత్తుల రవాణాపై 14.5 శాతం వ్యాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణలో పెట్రోల్ ట్యాంకర్లు, ట్రక్కుల యజమానులు ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మె ప్రారంభించారు. దీంతో తెలంగాణలో పెట్రోల్, ఎల్‌పిజి గ్యాస్ ట్యాంకర్లు, ట్రక్కులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తమ డిమాండ్లు తీర్చే వరకూ ఆందోళన విరమించేది లేదని ట్యాంకర్ల యజమానులు స్పష్టం చేస్తున్నారు. ఈ సమ్మె తీవ్రతరం అయితే హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాల్లో పెట్రోలు, డీజిలు, ఎల్‌పిజి సిలిండర్ల సరఫరాకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది.

రాజ్యసభ అభ్యర్థులపై చంద్రబాబు కసరత్తు

విజయవాడ: ఎపి నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసేందుకు టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఉదయం ఇక్కడ పార్టీ ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. నాలుగో సీటుకు కూడా పోటీ చేసే విషయమై ఆయన పలువురి అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఎపి టిడిపి అధ్యక్షడు కళావెంకట్రావు, ఆర్థికమంత్రి యనమల, కేంద్రమంత్రులు అశోక్‌గజపతి రాజు, సుజనాచౌదరిలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు. ఇదే సమయంలో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ ఈరోజు చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. ఒక రాజ్యసభ స్థానాన్ని బిజెపికి కేటాయించాలని వారు కోరుతున్నారు.

Pages