S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొగోయ్ శకానికి చరమగీతం

గౌహతి, మే 19: పదిహేనేళ్లుగా తిరుగులేని అధికారాన్ని అనుభవించిన తరుణ్‌గొగోయ్ పాలనకు అసోం ప్రజలు స్వస్తి పలికారు. ఈశాన్య భారతంలో మొట్టమొదటిసారి మోదీ బృందానికి బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారాన్ని అప్పజెప్పారు. అసోం అసెంబ్లీలోని 126 స్థానాల్లో మొత్తం బీజేపీ దాని మిత్రపక్షాలు ఏకంగా 86స్థానాల్లో విజయాన్ని నమోదు చేసి అద్భుతం సృష్టించాయి. 2011 ఎన్నికల్లో కేవలం 5 స్థానాలకే పరిమితమైన బీజేపీ అయిదేళ్లు తిరిగేసరికి సొంతంగా 60 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. అసెంబ్లీలో కావలసిన మెజార్టీకి కేవలం నాలుగు స్థానాల దూరంలో ఆగింది.

బెంగాల్ పీఠంపై మళ్లీ మమత

కోల్‌కతా, మే 19: ప్రభుత్వ వ్యతిరేత, ప్రతిపక్షాలయిన వామపక్షాలు, కాంగ్రెస్ చేతులు కలపడంలాంటి ప్రతికూల పవనాలకు ఎదురొడ్డి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మూడింట రెండు వంతుల భారీ మెజారిటీని సాధించి మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకుంది. గురువారం ప్రకటించిన ఫలితాల్లో 294 స్థానాలున్న అసెంబ్లీలో ఆ పార్టీ 211 స్థానాలను దక్కించుకుంది. క్రితంసారి అసెంబ్లీ ఎన్నికలకన్నా కూడా ఆ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించడం గమనార్హం. అయితే ఎన్నికల పండితులు ఊహించినట్లుగా లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. లెఫ్ట్‌ఫ్రంట్‌కు కేవలం 32 స్థానాలు దక్కాయి.

‘అమ్మ’ బ్రాండ్‌కే పట్టం

చెన్నై, మే 19: తమిళనాడు ప్రజలు చరిత్ర సృష్టించారు. మూడు దశాబ్దాల తరువాత అధికారంలో ఉన్న పార్టీకి రెండోసారి పాలించే అవకాశాన్ని అందించారు. గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలలో పురచ్చితలైవి జయలలిత దరహాసం వెల్లివిరిసింది. 232 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత నేతృత్వంలోని అన్నాడిఎంకే 134 స్థానాలను కైవసం చేసుకుంది. అధికారంపై భారీ ఆశలు పెట్టుకున్న ఎం.కరుణానిధి నాయకత్వంలోని డీఎంకే-కాంగ్రెస్ కూటమి 98 బెంచ్‌మార్క్ దగ్గర ఆగిపోయింది.

యానాంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి ఐదోసారి ఘన విజయం

యానాం, మే 19: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో యానాం నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు వరుసగా ఐదోసారి ఘన విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, ఎన్నార్ కాంగ్రెస్ అభ్యర్థి తిరుకోటి భైరవస్వామిపై 8,762 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో పోలైన 33,899 ఓట్లలో మల్లాడి 20,801 ఓట్లను పొందగా, ఎన్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి తిరుకోటి భైరవస్వామి 12,047 ఓట్లు మాత్రమే సాధించగలిగారు. అన్నాడిఎంకె అభ్యర్థి మంచాల సత్యసాయికుమార్ 343 ఓట్లు, బిజెపి అభ్యర్థి కనకాల రామదాసు 148 ఓట్లు సాధించి డిపాజిట్లు కోల్పోయారు.

మోదీ, షాలకు బాబు అభినందనలు

విజయవాడ , మే 19: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన నేతలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. అస్సాంలో అధికారాన్ని సాధించినందుకు, ఎన్నికలు జరిగిన ఇతర రాష్ట్రాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచుకొని, మెరుగైన ఫలితాలను సాధించినందుకు ప్రధాని నరేంద్రమోదీని, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాను చంద్రబాబు అభినందించారు.
జయలలితతో మాట్లాడిన ఏపి సిఎం

కేరళ కోటపై మళ్లీ ఎర్ర జెండా!

తిరువనంతపురం, మే 19: కేరళలో సిపిఎం నేతృత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర కూటమి (ఎల్‌డిఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని అధికార యుడిఎఫ్ కూటమిని చిత్తుచేసి తిరిగి అధికారాన్ని దక్కించుకుంది. దీంతో ఒక సారి గెలిచిన కూటమి మరోసారి గెలవకపోవడం అనే ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ రాష్ట్రంలో మరోసారి పునరావృతమైంది. కాగా, ఇప్పటివరకు కేరళ అసెంబ్లీలో అడుగుపెట్టని బిజెపి ఈ ఎన్నికల్లో ఒక స్థానాన్ని దక్కించుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. గురువారం ప్రకటించిన ఫలితాల్లో 140 స్థానాలున్న అసెంబ్లీలో ఎల్‌డిఎఫ్ 91 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ 46 స్థానాలకే పరిమితమైంది.

ఇకనైనా కళ్లు తెరవండి

హైదరాబాద్, మే 19: ‘ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడితే సహించం. అక్రమాలు జరిగాయని, అవినీతి పాలనని నోటికొచ్చినట్టు మాట్లాడితే పరువు నష్టం దావా వేసి కోర్టుకీడుస్తాం’ అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. చేసిన ఆరోపణలను నిరూపించనైనా నిరూపించాలి. లేనిపక్షంలో శిక్షనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్తని ప్రతిపక్షాలను హెచ్చరించారు. ‘మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికల నుంచి పాలేరు ఉప ఎన్నిక దాకా వరుసగా ఎన్నికలు ఏవైనా తమ పాలనకు ప్రజలు పట్టం కడుతున్న తీరును చూసైనా ప్రతిపక్షాలు కళ్లు తెరవాలి.

యాపిల్ వచ్చింది!

హైదరాబాద్, మే 19:ప్రపంచ ప్రఖ్యాత యాపిల్ కంపెనీ హైదరాబాద్‌లో గురువారం మాప్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. యాపిల్ సిఇఓ టిమ్ కుక్, ముఖ్యమంత్రి కెసిఆర్, ఐటి మంత్రి కెటిఆర్, అధికారులు, ఐటి కంపెనీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నానక్‌రామ్‌గూడలోని వేవ్ రాక్‌లో యాపిల్ సంస్థ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. యాపిల్ ఉత్పత్తులైన ఐ ఫోన్, ఐ ప్యాడ్, యాపిల్ వాచ్‌ల వంటి ఉత్పత్తులకు మ్యాప్‌ల అభివృద్ధి పనులను ఈ కేంద్రం నుంచి సాగిస్తారు. నాలుగువేల మందికి ఈ కేంద్రంలో ఉద్యోగాలు లభిస్తాయి.

ఎకరా రూ. 29 కోట్లు!

హైదరాబాద్, మే 19:హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ బూమ్ మరోసారి బహిర్గతమైంది. టిఎస్‌ఐఐసి ద్వారా నిర్వహించిన ప్రభుత్వ భూముల వేలంలో నగరంలోని పలుచోట్ల పారిశ్రామిక, గృహ అవసరాల కోసం అమ్మిన భూమి గరిష్ట ధర పలికింది. ఖానామెట్‌లో ఎకరానికి 29 కోట్ల రూపాయల ధర పలికింది. కున్ మోటారెన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 29 కోట్ల రూపాయల ధరతో రెండెకరాల స్థలం కొనుగోలు చేసింది. ఖానాపేట్‌లోనే మరోచోట ఎకరాకు 18.20 కోట్ల ధర వచ్చింది. గృహ అవసరాల కోసం షేక్‌పేటలోని అల్ హమ్రా కాలనీలో 920 గజాల భూమి ఏడు కోట్ల ధర పలికింది. గజానికి 76,200 రూపాయలకు అమ్ముడు పోయింది. టిఎస్‌ఐఐసి ద్వారా ప్రభుత్వం భూములు వేలం వేయడం ఈ ఏడాదిలో ఇది రెండవ సారి.

చరిత్ర తిరగరాశారు!

దిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చారిత్రక తీర్పులనే ఇచ్చారు. అసోంలో తొలిసారి బిజెపికి పట్టం కట్టి చరిత్రను తిరగరాశారు. పదిహేనేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పార్టీని సాగనంపారు. కేరళలో తొలిసారిగా బిజెపి ఖాతాతెరవడం మరో కీలక పరిణామం. జయ ఇంటికేనన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నివ్వెరపోయేలా అన్నాడిఎంకెను మళ్లీ అధికారంలోకి తెచ్చారు. గత మూడు దశాబ్దాల రాష్ట్ర ఎన్నికల చరిత్రలో ఒకే పార్టీ తమిళనాట రెండోసారి అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. జయను ఎదుర్కొనేందుకు తమిళనాట డిఎంకె-కాంగ్రెస్ చేతులు కలిపినా ప్రయోజనం లేకపోయింది.

Pages