S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్టీసీలో జలసంరక్షణకు శ్రీకారం

శ్రీకాకుళం(టౌన్), మే 15: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ఒకటో డిపోలో జలసంరక్షణకు ఆదివారం శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు ఒకటో డిపో మేనేజరు కె.్ఢల్లీశ్వరరావు ఆధ్వర్యంలో డిపో గ్యారేజీలో ఇంకుడు గుంతలు తవ్వించారు. ఆర్టీసీ డిసిటిఎం కె.శ్రీనివాసరావు ఇంకుడు గుంతలను ప్రారంభిస్తూ మాట్లాడారు. జిల్లా కేంద్రంలో రెండు డిపోల పరిధిలో ఒకే కాంప్లెక్సు ఉండగా, భవిష్యత్‌లో తాగు నీటి సమస్య ఎదురుకాకుండా ఉండేందుకు జలసంరక్షణలో భాగంగా ఇంకుడు గుంతలు తవ్వించినట్టు చెప్పారు. నీటి నిల్వలను గుంతల ద్వారా భూమిలో ఇంకించడం వలన భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉంటాయన్నారు.

సిరిమాను సంబరానికి వేళాయే..!

శ్రీకాకుళం(కల్చరల్), మే 15: శ్రీకాకుళం పట్టణానికి సమీపంలోని అరసవల్లి, కాజీపేట వాసుల ఇలవేల్పు అసిరితల్లి అమ్మవారి సిరిమాను సంబరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఏప్రిల్ 19న పెద్ద ఎత్తున ప్రారంభమైన ఈ సంబరాలు ఈనెల 17 మంగళవారం నాటి సిరిమాను ఊరేగింపు, అనుపు ఉత్సవాలతో ముగుస్తాయి. 2007లో జరిగిన ఈ ఉత్సవాలను తొమ్మిదేళ్లకొకసారి నిర్వహించే ఆనవాయితీలో భాగంగా ఈ సంవత్సరం జరుపుతున్నారు. ఉత్సవాల్లో తొలి దశలో భాగంగా వేపచెట్టు కొట్టి దుర్గమ్మ, నీలమ్మ, ఎర్రన్న ప్రతిమలను తయారు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ప్రధాన గ్రామదేవత అసిరితల్లి అమ్మవారి ప్రతిరూపంగా భావించే సిరిమాను తయారీలోనూ ప్రత్యేక ఉంది.

అరసవల్లిలో నకిలీ ‘కళ్ళు’ దళారులు... మోసపోతున్న భక్తులు

శ్రీకాకుళం, మే 15: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లిలో భక్తుల నమ్మకాలను దళారులు దోచుకుంటున్నారు. సూర్యనారాయణమూర్తిని దర్శిస్తే నేత్రసంబంధ వ్యాధులు నయమవుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ మేరకు వెండి లేదా బంగారంతో తయారు చేసిన కళ్ళు(రూపు) హుండీలో మొక్కులుగా సమర్పించడం ఆచారం. ఇదే విశ్వాసాన్ని ఆసరా చేసుకుని కొంతమంది భక్తులకు నకిలీ వెండి, బంగారు కళ్ళను విక్రయిస్తున్నారు. దీనిని నియంత్రించాల్సిన ఆలయాధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహారిస్తూ ఆదాయానికి గండికొడుతున్నారు. ఆదివారం వైశాఖ మాసం రెండో వారం కావడంతో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది.

పెద్దమ్మతల్లికి ప్రత్యేక పూజలు

శ్రీకాకుళం(కల్చరల్), మే 15: పాతశ్రీకాకుళంలోని పెద్దమ్మతల్లి దేవాలయ తృతీయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దమ్మతల్లి, సరస్వతీ దేవీలకు శుద్ధిస్నానం, వేద పండితులతో క్షీరాభిషేకం జరిగింది. కల్యాణ వెంకటేశ్వరస్వామి, సత్యసాయి, స్థానిక భజన బృందాలు పలు భక్తిగీతాలు ఆలపించాయి. భక్తులు ముర్రాటలు, పండ్లు, కాయలతో అమ్మవార్లకు చల్లదనం చేశారు. కిమ్స్ వైద్యులచే ఆలయ ఆవరణలో ఉచిత మెగావైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు డి పి దేవ్, తాతారావు, కృష్ణ, పాపారావు తదితరులు పాల్గొన్నారు.

నీరు-చెట్టు పనులు ప్రారంభం

శ్రీకాకుళం(రూరల్), మే 15: మండలంలోని ఒప్పంగి పంచాయతీ పరిధిలో ఉన్న బాబత్‌ఖాన్ చెరువులో నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఈ పనులను ఎంపిపి గొండు జగన్నాధరావు ప్రారంభించారు. గత ఎంతో కాలంగా చెరువులో పూడిక పేరుకుపోయిందని దీనిని తొలగించేందుకు, చెరువులోతు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రూ.9లక్షల నిధులు మంజూరు చేశారన్నారు. జిల్లాలో ఈ కార్యక్రమం అనేక చోట్ల జరుగుతుందని తెలియజేశారు. వర్షాలు ప్రారంభం నాటికల్లా చెరువు పనులు పూర్తి చేస్తే నీరు నిల్వ ఉండి తద్వారా ఆయకట్టు పరిధిలో ఉన్న పొలాలకు సాగునీరు అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంపై నిఘా!

శ్రీకాకుళం(రూరల్), మే 15: భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అత్యధిక నిధులు కేటాయిస్తోందని ఆ నిధులను సక్రమంగా వినియోగించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని బిజెపి నగర అధ్యక్షుడు చల్లా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. జిల్లాకు కేటాయించే నిధులను సక్రమంగా వినియోగించే బాధ్యత జిల్లా అధికారులపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగంపై బిజెపి జిల్లా నాయకులందరూ నిఘా పెట్టాలని సమాచార చట్టం ద్వారా వివరాలను సేకరించి ఎక్కడైనా దుర్వినియోగం అయ్యాయని భావిస్తే అధికారులను నిలదీయాలని కోరారు.

రెక్టార్ చంద్రయ్యకు విసి బాధ్యతలు

ఎచ్చెర్ల, మే 15: అంబేద్కర్ విశ్వవిద్యాలయం రెక్టార్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ ఎం.చంద్రయ్యకు విసి అదనపు బాధ్యతలను అప్పగించనున్నట్టు విశ్వనీయంగా తెలిసింది. సెలవు దినాలుకావడం వలన సోమవారం ఉత్తర్వులు ఉన్నత విద్యాశాఖ కార్యాలయం నుండి వెలవడనున్నాయని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.తులసీరావు స్పష్టంచేశారు. నిన్నటివరకు వీసిగా వ్యవహరించిన హెచ్ లజపతిరాయ్ పదవీ కాలం ఈనెల 14తో ముగిసిన విషయం తెలిసిందే. పదవీ కాలం ముగిసిన లజపతిరాయ్ అనంతపురంలో కృష్ణదేవరాయ వర్శిటీలో రిపోర్టు కావడంతో ఇక్కడ విసి కుర్చీని రెక్టార్‌కు ఉన్నత విద్యాశాఖ అప్పగించింది.

22న మినీ మహానాడు

శ్రీకాకుళం, మే 15: తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏటా మహానాడు ముందు మినీ మహానాడును జిల్లాలవారీగా జరుపుకోవడం పార్టీకి ముందునుంచి గల సంప్రదాయం. ఇదే మాదిరిగా ఈ నెల 22న ఇక్కడ అంబేద్కర్ ఆడిటోరియంలో మినీ మహానాడు నిర్వహించనున్నట్టు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీషా చెప్పారు. ఈ మహానాడుకు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పరిటాల సునీతతోపాటు జిల్లా మంత్రి, ఎం.పి. జెడ్పీ ఛైర్‌పర్సన్, శాసనసభ్యులు, ఎమ్మెల్సీ, ఇన్‌ఛార్జిలు హాజరుకానున్నట్లు వివరించారు. ఈ వేదిక నుంచి కార్యకర్తల మనోభావానికి అనుగుణంగా వివిధ తీర్మానాలను ఆమోదించి రాష్ట్ర మహానాడులో నివేదించనున్నారు.

ఎయిడ్స్‌పై అవగాహన అవసరం

శ్రీకాకుళం(టౌన్), మే 15: ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరికీ అవసరమని జిల్లా కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ ఎయిడ్స్ రోగుల స్మృత్యర్థం నిర్వహించే కొవ్వొత్తుల ర్యాలీని ఆయన స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద ప్రారంభించారు. అనంతరం ర్యాలీ ఏడురోడ్ల కూడలి మీదుగా బాపూజీ కళామందరం నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 37 మిలియన్ల మంది ఎయిడ్స్‌తో బాదపడుతున్నారని తెలిపారు. హెచ్‌ఐవికి నివారణ ఒక్కటే మార్గమమని, దీనిని నివారించే మందులు ప్రస్తుతం అందుబాటులోకి రాలేదన్నారు.

అభివృద్ధి

జలుమూరు, మే 15: రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు ప్రజలు గుర్తుంచుకుని ప్రభుత్వానికి సహకరిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని ఎంపి రామ్మోహన్‌నాయుడు అన్నారు. కరవంజ, చిన్నదూగాం, టెక్కలిపాడు గ్రామాల్లో ఆదివారం జరిగిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో మాట్లాడారు. ప్రభుత్వం విద్య, రవాణా కోసం కోట్ల రూ.లు ఖర్చు చేస్తోందని ప్రజలు దీన్ని గుర్తించక ప్రైవేటు పాఠశాలలపై మొగ్గు చూపడం భావ్యం కాదన్నారు. రాష్ట్రం ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్న ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారన్నారు.

Pages