S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూఢభక్తి!

శ్రీకాకుళం, మే 15: ప్రేతాత్మలున్నాయి.. భూగర్భంలో అస్తిపంజరాలు, కాష్ఠం బూడిద, పుర్రెలు రోజూ తవ్వినకొద్దీ వస్తున్నాయి.. వాటికోసమే ఈ గొయి... ఇరవై అడుగులు తవ్వినా ఇంకా కన్పిస్తున్నాయి. ఇంకా తవ్వాల్సివుంది.. గుప్తనిధుల కోసం కాదు.. కోల్‌కతా కాళీమాత ప్రత్యక్షమై, చేసిన ఆదేశాలనే ఆచరిస్తున్నాం.. అంటూ ఆ తల్లీకూతురు చెప్పే మాటలతో స్థానికులకు భయాందోళన పట్టుకుంది. తాము నివాసం ఉంటున్న ఇంటి నుంచి 20 అడుగుల గొయ్యి తవ్వి అందులో ఐదడుగుల కాళీమాతా శిలావిగ్రహాన్ని అమర్చి వామాచారంలో ‘శక్తి’ని ఆవాహన చేస్తూ పూజలు జరుపుతున్నారు.

హైవే భూమిలో రోడ్డు నిర్మాణంపై చర్యలు తీసుకోవాలి

అనకాపల్లి, మే 15: జాతీయ రహదారి విస్తరణకు సేకరించిన భూమిలో ఓ ప్రైవేటు కంపెనీ రోడ్లు వేస్తుంటే ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారని మాజీమంత్రి దాడి వీరభద్రరావు ఆరోపించా రు. ఆదివారం స్థానిక విలేఖర్ల సమావేశంలో మాజీమంత్రి దాడి మాట్లాడు తూ ఆవఖండంలో అక్రమ లే-అవుట్లు వేస్తూ రైతుల ప్రయోజనాలను, పట్టణవాసుల ప్రయోజనాలకు భంగం కలిగిం చే చర్యలకు ఆ సంస్థ పాల్పడుతుంటే పాలకులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పంట భూములను నివాసయోగ్యమైన స్థలంగా మార్చుకోవాలనుకుంటే ఎనిమిది కోట్ల రూపాయ లకు పైబడి ప్రభుత్వానికి పన్ను చెల్లించాల్సి ఉందన్నారు.

మన్యంలో కూంబింగ్

పాడేరు, గూడెంకొత్తవీధి, మే 15: ఆంధ్రా - ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు సోమవారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపధ్యంలో పోలీసు బలగాలు భారీ గాలింపు చర్యలు చేపట్టాయి. తనిఖీలు చేపట్టడమే కాకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా మావోయిస్టు ప్రభావిత గ్రామాలలో పోలీసు పార్టీలను రంగంలోకి దింపి మావోల కదలికలను కట్టడి చేసేందుకు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మన్యంలో మావోల కోసం జల్లెడ పడుతుండడంతో ఈసారి బంద్ కు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

పవర్ కెనాల్ పనులు వేగవంతం

సీలేరు, మే 15: సీలేరు కాంప్లెక్స్‌లో డొంకరాయి పవర్ కెనాల్ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని ఎపి జెన్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్ మురళీమోహన్ తెలిపారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సుమారు 60 లక్షల రూపాయల అంచనాతో పవర్ కెనాల్, శాడిల్ డ్యామ్ దిగువ ప్రిక్షన్ బ్లాక్ పనులు చేపట్టామని, ఇందులో శాడిల్ డ్యామ్, ప్రిక్షన్ బ్లాక్ పనులు సోమవారం నాటికి పూర్తికానున్నట్లు తెలిపారు. రీచ్-1లో డొంకరాయి నుంచి పొల్లూరు వరకు మరమ్మతు పనులు కూడా దాదాపు 50 శాతం పనులు కావస్తున్నాయన్నారు. ఈనెల 18వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో పవర్ కెనాల్ మరమ్మతు పనులు పూర్తి చేసేందుకు చర్యలు వేగవంతం చేశామన్నారు.

భక్తులతో నూకాంబిక ఆలయం కిటకిట

అనకాపల్లి(నెహ్రూచౌక్), మే 15: ఉ త్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు, ప్రజల ఆరాధ్యదైవం శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు తెల్లవారు నుండే అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడానికి బారులు తీరారు. కొత్తఅమావాస్య నెలపండుగ జాతర ముగిసిన రెండో ఆదివారం భక్తులు వే లాదిసంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ మధ్యకాలంలో వివాహాలు జరిగిన నూతన దంపతుల చే నూకాంబిక అమ్మవారి ఘటాలు నె త్తిన పెట్టుకొని ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

ప్రశాంతంగా టిఎంసెట్

విశాఖపట్నం, మే 15: విశాఖ రీజియన్ పరిధిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టిఎంసెట్ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. రీజియన్ పరిధిలో ఇంజనీరింగ్‌కు సంబంధించి 8 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 3276 మంది హాజరు కావాల్సి ఉండగా, 1121 మంది హాజరు కాలేదు. హాజరు శాతం 74.5. మెడిసిన్ స్ట్రీమ్‌కు సంబంధించి తొమ్మిది సెంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 4307 మంది దరఖాస్తు చేయగా, 1022 మంది హాజరు కాలేదు. హాజరు శాతం 80.8 అని తెలిపారు.

సిఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి గంటా సమీక్ష

విశాఖపట్నం, మే 15: జిల్లాలో ఈ నెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదివారం ప్రభుత్వ అతిధిగృహంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 21వ తేదీ ఉదయం సిఎం చంద్రబాబు ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుని, అక్కడ్నుంచి హెలికాఫ్టర్‌లో అచ్యుతాపురం చేరుకుంటారన్నారు. ఈ మండలం పూడి గ్రామంలో ఎంఎన్‌ఎంఇ శిక్షణ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. హుదూద్ తుపాను సందర్భంగా ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారికి విప్రో సంస్థ నిర్మించిన 200 ఇళ్లను అందజేయడంతో పాటు రెండో విడతగా నిర్మించనున్న 400 ఇళ్లకు చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు.

విద్యాశాఖాధికారులతో చర్చకు అనుమతినివ్వండి’

విశాఖపట్నం, మే 15: విద్యాశాఖాధికారులతో బహిరంగ చర్చకు అనుమతినివ్వాల్సిందిగా కలెక్టర్‌ను ఎపి ప్రైవేటు ట్యుటోరియల్ స్కూల్స్ అసోసియేషన్ కోరింది. ఆదివారం నిర్వహించిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు జి.కమలాకరరావు, ప్రధాన కార్యదర్శి ఎస్.సూర్యనారాయణ మాట్లాడుతూ జిల్లావిద్యాశాఖాధికారి ప్రభుత్వ జివోలు, విద్యాహక్కు చట్టాన్ని భేఖాతరు చేస్తూ నిరుద్యోగులైన ట్యుటోరియల్స్ పాఠశాలల యాజమాన్యాలు రోడ్డుపడే విధంగా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చివరకు విద్యాశాఖ సంచాలకుల ప్రోసిడింగ్స్‌ను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.

వివిధ అంశాలపై మత్స్యకారులకు కోస్టు గార్డు శిక్షణ

విశాఖపట్నం, మే 15: వివిధ సందర్భాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మత్స్యకారులకు ఇండియన్ కోస్టు గార్డ్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. సముద్రంలో అత్యవసర పరిస్థితుల్లో, చేపలవేటకు తాత్కాలిక విరామం ప్రకటించిన సందర్భాల్లో తీసుకోవాల్సిన వివిధ అంశాలపై వివరిస్తున్నారు. కోస్తా తీరంలో నౌకాయానానికి సంబంధించి అత్యవసర పరిస్థితుల్లో గాలింపు, రక్షణ చర్యలను ఇండియన్ కోస్టు గార్డుకు అప్పగించడం తెలిసిందే. అత్యవసర సహాయం కోసం ఎదరుచూసే మత్స్యకారులను గుర్తించి రక్షించడం కష్టంతో కూడుకున్నది. సముద్ర పరిస్థితి, సంకేతాల నాణ్యత, తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఉద్యోగుల్లో బదిలీల గుబులు..!

జగదాంబ, మే 15: ఉద్యోగుల్లో బదిలీల గుబులు మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి బదిలీలు తప్పనిసరని ప్రకటించడంతోపాటు పలు మార్పులు, చేర్పులు చేయనుండటంతో ఏ నిమిషంలో ఏ మార్పులు వస్తాయోనని భయంతో ఉద్యోగులు ఉన్నారు. గత ఏడాది బదిలీల సమయంలో జన్మభూమి, ఎమ్మెల్సీ ఎన్నికలతో బదిలీలపై ప్రభుత్వం ఉద్యోగులతో దోబూచులాడిన సంగతి తెలిసిందే. అదే ఏడాదిలో అంతా సజావుగా ఉన్న పరిస్థితిలో ప్రభుత్వం ఈ బదిలీలపై జారీ చేసిన వరుస మూడు జీవోలు ఉద్యోగ సంఘాలను, ఆపై ఉద్యోగులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. బదిలీలపై నిషేధం ఎత్తివేసి పలు కొర్రీలు పెట్టడంతో గతేడాది బదిలీల ప్రక్రియ జరగలేదు.

Pages