S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్య

విశాఖపట్నం, మే 15; ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యా విధానాన్ని మార్చుకోవాల్సి ఉందని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, మున్సిపల్ మంత్రి కె నారాయణ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో ఫౌండేషన్ కోర్సులపై మంత్రులు ఆదివారం వేర్వేరుగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ, ఫలితాలు రాబట్టే విషయంలో మాత్రం వెనుకబడిపోవడానికి కారణాలు అనే్వషించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావిధానం, బోధన తదితర అంశాల్లో స్వల్ప మార్పులతో ఆశించిన ఫలితాలు సాధించవచ్చన్నారు.

ఆన్‌లైన్ కష్టాలు

విశాఖపట్నం, మే 15: మహా విశాఖ నగరపాలక సంస్థ (జివిఎంసి) పరిధిలో భవన నిర్మాణాల అనుమతులు తీసుకోవాలంటే విశ్వప్రయత్నమే చేయాల్సి వస్తోంది. గతేడాది వరకూ భవన నిర్మాణ అనుమతులన్నీ పట్టణ ప్రణాళిక విభాగం పర్యవేక్షణలో సాగేవి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి భవన నిర్మాణ అనుమతులన్నీ ఆన్‌లైన్‌లోనే ఆమోదించాలని నిర్ణయించడంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు ఆమోదించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపకల్పన చేశారు. ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ జివిఎంసికి 200కి పైగా దరఖాస్తులు మాత్రమే అందాయి. ధృవీకరణ పత్రాలు అన్నీ సక్రమంగా ఉంటేనే ఆన్‌లైన్ దరఖాస్తులకు మోక్షం కలుగుతుంది.

వివాదంలో గురజాడ స్మారక నిర్మాణం

విజయనగరం, మే 15: తెలుగు జాతి గర్వించదగ్గ మహాకవి గురజాడ అప్పారావు పేరిట స్మారక భవనాన్ని విజయనగరంలో నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. మహాకవి గురజాడ సమాజానికి అందించిన కన్యాశుల్కం నాటకాన్ని రచించి, మహాకవి నివసించిన స్వగృహం పక్కనే సర్వే నెం.499/1లో 806 చదరపు గజాల విస్తీర్ణంలో స్మారక భవనాన్ని నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్న తరుణంలో వివాదం చోటుచేసుకోవడం గురజాడ అభిమానులను, సాహితీవేత్తలను కలచివేసింది. మహాకవి గురజాడ అప్పారావు మెమోరియల్(స్మారక) భవనం నిర్మాణానికి గురజాడ అప్పారావుకు చెందిన కుటుంబ సభ్యులు 806 చదరపుగజాల విస్తీర్ణం భూమిని ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

పల్లెల్లో క్రికెట్ బెట్టింగులు!

గజపతినగరం, మే 15: ఒకప్పుడు గ్రామాలలో కరవు చాయలు అలముకుని చేయడానికి పనులు లేక వలసబాట పట్టాల్సిన అవసరం ఏర్పడేది. ఉన్న రంగంలో అవకాశాలు లేక ఉపాధి కోసం వలసలు వెళ్లేవారు. నేడు అందుకు భిన్నంగా క్రికెట్ బెట్టింగ్‌లు మాయలో పడి సర్వస్వం కోల్పోయి బతడానికి వలసబాట పడుతున్నారంటే క్రికెట్ బెట్టింగ్‌లు ఏ స్థాయిలో జరుగుతున్నా యో అర్థంచేసుకోవచ్చు. ఒకప్పుడు పట్టణ కేంద్రాలకే పరిమితమైన ఈ బెట్టిం గ్ సంస్కృతి గ్రామాలకు పాకి గ్రామాలలో విచ్ఛలవిడిగా పందాలు జరుగుతున్నాయి. ఈ పందాలు కూడా సాధారణ కూలీలు, విద్యార్థులు, రైతులు సహి తం బెట్టింగ్‌లు కాస్తూ ఉన్న సంపాదనను బెట్టింగ్‌ల లో పోగొట్టుకుని వలస బాట పడుతున్నారు.

ఐ-సెట్ ప్రవేశ పరీక్ష నేడు

విజయనగరం (టౌన్), మే 15: ఆంధ్రాయూనివర్సిటీ ఎపి ఐ-సెట్ 2016 ప్రవేశ పరీక్ష సోమవారం నిర్వ హించనున్నారు. ఇందుకు ఐ-సెట్ ప్రాంతీయ కన్వీనర్ టివిఎన్ పార్థసారధి ఆధ్వర్యంలో చింతలవలస ఎంవి జి ఆర్ కళాశాల ప్రాంగణంలోని బ్లాక్- 1, బ్లాక్-2 కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ ప్రవేశ పరీక్షకు 1407 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంవిజి ఆర్ పరీక్షా కేంద్రం బ్లాక్-1లో 900 మంది విద్యార్థులు, బ్లాక్-2లో 507మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షా కేంద్రాలకు చీఫ్ సూపరింటిండెంట్‌గా ఎం సునీల్ ప్రకాష్, ఎస్ శ్రీనివాసరావులను నియమించారు.

హోదా బాధ్యత బీజేపీదే...!

విజయనగరం, మే 15: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని పార్లమెంటులో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని జిల్లా టిడిపి అధ్యక్షుడు ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బిజె పి జాతీయ నాయకత్వం వ్యవహరించకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. సోమవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యా నిం చారు.

వైద్య శాఖను పరిరక్షించుకుందాం

విజయనగరం(టౌన్), మే 15: రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖను ప్రైవేటీకరించే చర్యల నుండి ఐక్య పోరాటాల ద్వారా పరిరక్షించుకునేందుకు సంఘటితం కావాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లారుూస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలివెల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని ఎన్‌జిఓ హోమ్‌లో జిల్లా యూనియన్ ఆరవ మహాసభ జిల్లా అధ్యక్షురాలు జగదాంబ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వ విధానాల వలన వైద్య ఆరోగ్యశాఖ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

నేటి నుంచి మున్సిపాలిటీల్లో ‘బడి పిలుస్తోంది’

విజయనగరం (్ఫర్టు), మే 15: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో సోమవారం నుంచి ‘బడి పిలుస్తోంది..ఉన్నత విద్యకు’ అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. మున్సిపల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులలో ఐఐటి ఫౌండేషన్ ద్వారా మరింత నైపుణ్యం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. జిల్లా విద్యాశాఖాధికారులు, మున్సిపల్ కమిషనర్లతో ఆదివారం మంత్రులు నారాయణ, శ్రీనివాసరావువీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.

సర్వ మతాల సారం ఒక్కటే...

విజయనగరం(టౌన్), మే 15: అన్ని మతాల సారం ఒక్కటేనని ప్రముఖ అధ్యాతిక గురువు బ్రహ్మర్షి ఉమర్ ఆలీషా చెప్పారు. ఆదివారం పట్టణంలోని మెసానిక్ టెంపుల్‌లో శ్రీవిశ్వవిద్య ఆద్యాత్మిక పీఠం ఆధ్వర్యలో మతసామరస్య ఆధ్యాత్మిక సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మానవసేవయే మాధవ సేవ అని చెప్పారు. మతం ఏదైనా ఈశ్వరుడు ఒక్కడే అన్నారు. జ్ఞానమనే నేత్రంతో భగవంతుని దర్శించాలని సూచించారు. ఆధ్యాత్మిక చింతన ద్వారా పరామాత్మను సేవించాలని చెప్పారు. మానావాళికి ఉపయోగపడుతున్న మొక్కలను పెంచాలని అన్నారు.

పాఠశాలల మూసివేత మానుకోవాలి

విజయనగరం(టౌన్), మే 15: హేతు బద్ధీకరణ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల మూసివేత చర్యలను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు యు ఎ నరసింహం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఆదివారం పట్టణంలోని ఉపాధ్యాయ భవనంలో నిర్వహించిన సంఘ సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ పాఠశాలల మూసివేత చర్య రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నా రు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేయడం ద్వారా పేద విద్యార్థులకు విద్య ను అందించే బాధ్యతనుండి పక్కకి తప్పుకుని ప్రైవేటు పాఠశాలలకు ప్రోత్సహించడమేనని అభిప్రాయ పడ్డారు.

Pages