S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రబాబు హయాంలోనే ప్రాజెక్టులు పూర్తిచేస్తాం

ధవళేశ్వరం, మే 15: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే పూర్తిచేస్తామని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ధవళేశ్వరంలో ఆదివారం కాటన్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక అగ్రహారంలోగల కాటన్ విగ్రహానికి మంత్రి దేవినేని, రాజమహేంద్రవరం ఎంపి మాగంటి మురళీమోహన్, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ రాష్ట్రంలో ఇంకుడుగుంతలు పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.

చురుగ్గా సిఎం పర్యటనా ఏర్పాట్లు

గోకవరం, మే 15: ‘నీరు-చెట్టు’ పథకంలో భాగంగా ఈ నెల 18న సిఎం చంద్రబాబు సందర్శించనున్న మండలంలోని కొత్తపల్లి పెద్దపాత్రుని చెరువు అభివృద్ధి పనులు, హెలిఫ్యాడ్ నిర్మాణ పనులు తదితర ఏర్పాట్లను డిఐజి రామకృష్ణ, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదివారం పరిశీలించారు. అలాగే డిఐజి పివిఎస్ రామకృష్ణతో ఏర్పాట్లపై సమీక్షించారు. దళిత పేటలో ఇంకుడుగుంతలను డిఐజి, ఎమ్మెల్యే నెహ్రూలు పరిశీలించారు. ఏర్పాట్లపై డిఐజి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిఐజి మాట్లాడుతూ సోమవారం హైదరాబాద్ నుండి ప్రత్యేక నిఘా బృందం సిఎం పర్యటనా ఏర్పాట్లను పరిశీలించేందుకు రానున్నట్టు తెలిపారు.

సిరులు కురిపిస్తున్న ఆక్వా

అయినవిల్లి, మే 15: ఆక్వా రైతులకు అనుకున్న స్థాయిలో రొయ్యలు కౌంటు రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కోనసీమలో ఆక్వా రైతులు మంచి దిగుబడి రావడంతో అందరు ఆక్వా సాగుపై దృష్టి సారించారు. వ్యవసాయానికి కౌలు రైతులు ఎకరాకు 25బస్తాలు శిస్తు చెల్లిస్తున్నారు. ధాన్యం ధరనుబట్టి ఏడాదికి ఎకరాకు 25వేల రూపాయలు లోపు రైతులకు గిట్టుబాటు అవుతుంది. అయితే ఆక్వా సాగుకు ఎకరాకు 50వేల రూపాయలు శిస్తు చెల్లిస్తామని ఆక్వారైతులు ముందుకు రావడంతో ఎక్కువ శాతం రైతులు తమ భూములను ఆక్వాసాగుకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం కోనసీమ వ్యాప్తంగా వేల ఎకరాలు వరి భూములు రొయ్యలు చెరువులుగా మారబోతున్నాయి.

నేటి నుంచి సత్యదేవుని కల్యాణ మహోత్సవాలు

శంఖవరం, మే 15: ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అన్నవరం దేవస్థానం రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. స్వామి వారి కల్యాణ మహోత్సవాలను నేటి నుండి ఈ నెల 22 వరకు జరుగనున్నాయి. ఈ మహోత్సవాలను పురస్కరించుకుని దేవస్థానానికి స్వామిని దర్శించేందుకు వచ్చే ఆశేష భక్త జనావళిని దృష్టిలో ఉంచుకుని చలువ పందిళ్లను విస్తారంగా వేసారు. దేవస్థానంపై, అన్నవరం గ్రామంలోనూ విద్యుద్దీపాలతో సుందరంగా అలంకరించారు.

సాగునీటి సంఘాలు, ఇంజినీర్ల పనితీరుపై మంత్రుల ఆగ్రహం

రాజమహేంద్రవరం, మే 15: సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడి జన్మదినోత్సవంలో సాగునీటి సంఘాలు, ఇంజనీర్లపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో ప్రభుత్వ పక్షాన్న కాటన్ జయంతోత్సవాన్ని ఘనంగా ఆదివారం నిర్వహించారు. సాగునీటి సంఘాలు, ఇంజనీర్ల పనితీరుపై మంత్రి దేవినేని మండిపడితే.., ఇంజనీర్లపై ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు. జల సంరక్షణ పథకంలో జిల్లాలో ఎంత ఖర్చుచేశారని మంత్రి దేవినేని ఇరిగేషన్ ఎస్‌ఇని నిలదీశారు. రూ.32 కోట్ల ఖర్చుకు ప్రతిపాదించామని సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘పాములేరు’కు అంకురార్పణ

రాజమహేంద్రవరం, మే 15: పట్టిసీమ ద్వారా కృష్ణాకు జలాలు పంపిణీ చేసి కృష్ణా డెల్టాను పరిరక్షించడం, ఏలేరుకు గోదావరి జలాలనిచ్చి స్టాండింగ్ క్రాప్‌లకు సాగునీరు అందించడం ఒక చారిత్రాత్మకమైన ఘట్టమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర పండుగగా ఆదివారం రాజమహేంద్రవరం ఆనం కళా కేంద్రంలో కాటన్ 213వ జయంత్యోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సభకు మంత్రి దేవినేని, ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గోదావరి గుండె చప్పుడు సర్ ఆర్థర్ కాటన్ 213వ జయంతిని పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లాలో మరో సాగునీటి పథకానికి అంకురార్పణ జరిగింది.

యానాంలో నేడే పోలింగ్

యానాం, మే 15: పుదుచ్చేరి అసెంబ్లీకి సోమవారం జరుగనున్న సాధారణ ఎన్నికల్లో భాగంగా యానాం నియోజకవర్గంలో పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పార్ధిబన్ తెలిపారు. 36,557 మంది ఓటర్లు కలిగిన యానాం నియోజకవర్గంలో 35 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అలాగే 42 ఇవిఎంలను సిద్ధం చేసి ఒక్కొ బూత్‌లో నలుగురు ఎన్నికల సిబ్బందితో పాటు ఒక ప్రిసైడింగ్ అధికారిని ఆదివారం సాయంత్రానికే పోలింగ్ కేంద్రాలకే తరలించామన్నారు.

18న జిల్లాలో సిఎం సుడిగాలి పర్యటన

రాజమహేంద్రవరం, మే 15: తూర్పుగోదావరి జిల్లాలో ఈనెల 18న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన బిజీగా సాగనుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేసి, అభివృద్ధి పనులకు శ్రీకారం, శంఖుస్థాపనలు చేస్తారని జాయింట్ కలెక్టర్ ఎస్ సత్యనారాయణ వెల్లడించారు. ఉదయం 10గంటలకు రాజమహేంద్రవరం చేరుకునే ఆయన సాయంత్రం 7గంటల వరకు జిల్లాలోనే పర్యటిస్తారు. ఆదివారం సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఉదయం 10గంటలకు ఆయన హెలికాఫ్టర్‌లో ఆర్ట్స్ కళాశాల మైదానానికి చేరుకుంటారన్నారు.

కాటన్ స్ఫూర్తితో మెట్టను సస్యశ్యామలం చేయాలి

ఏలూరు, మే 15 : అపరభగీరధుడు సర్ ఆర్ధర్ కాటన్ స్ఫూర్తితో పశ్చిమ మెట్ట ప్రాంతాన్ని డెల్టాగా మార్చి సస్యశ్యామలం చేయాలని జల వనరుల శాఖ ఇంజనీర్లను ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోట రామారావు (బుజ్జి) సూచించారు. స్థానిక జలనవరుల శాఖ అతిధిగృహం వద్ద సర్ ఆర్ధర్ కాటన్ 213వ జయంతి సందర్భంగా కాటన్ విగ్రహానికి ఆదివారం ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యే బడేటి బుజ్జి, ఎమ్మెల్సీ రాము సూర్యారావులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

నేటి నుండి ద్వారకాతిరుమలేశుని బ్రహ్మోత్సవాలు

ద్వారకాతిరుమల, మే 15: ద్వారకాతిరుమల క్షేత్రం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. శ్రీ దుర్ముఖినామ సంవత్సర వైశాఖమాస బ్రహ్మోత్సవాలకు చిన వెంకన్న క్షేత్రం ముస్తాబైంది. కోరిన వరాలిచ్చి భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతున్న ద్వారకాతిరుమలేశుని బ్రహ్మోత్సవాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు శ్రీవారి వైభవాన్ని చాటనున్నాయి. రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న చిన్న తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ వేడుకలు ఈ నెల 16 నుండి 23 వరకు జరుగుతాయి. వైఖానస ఆగమనాన్ని ఆనుసరించి పాంచాహ్నిక దీక్షతో శ్రీవారి బ్రహోత్సవాలను ఏడాదికి రెండుసార్లు జరపడం ఇక్కడ సంప్రదాయం.

Pages