S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజలే బుద్ధి చెబుతారు

ఏలూరు, మే 15 : ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చి గద్దెనెక్కిన టిడిపి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని, రైతు సంక్షేమాన్ని విస్మరించి పరిపాలన కొనసాగిస్తోందని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కరవు భరోసా యాత్రను పురస్కరించుకుని ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయ ఆవరణలో డిసిసి అధ్యక్షుడు రఫీయుల్లాభేగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌కు రానున్నవి మంచి రోజులన్నారు. దోచుకోవడమే పనిగా టిడిపి నేతలు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంగా ఉండాలని, పార్టీ బలోపేతానికి కృషిచేయాలని పిలుపునిచ్చారు.

రూ.67.36 కోట్లతో నీరు-చెట్టు

ఏలూరు, మే 15 : జిల్లాలో భూగర్భజలాలను మెరుగుపరిచేందుకు చేపట్టిన నీరు - చెట్టు కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది రూ. 67 కోట్లతో 374 చెరువుల పూడికతీత పనులు చేపట్టినట్లు రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. ఆదివారం చింతలపూడిలోని పెద్దచెరువు పూడికతీత పనులను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంత వరకు 310 పనులకు సంబంధించి టెండరు ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందన్నారు. వీటిలో 181 పనులు పురోగతిలో వుండగా 20 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని నిర్వహించారన్నారు. చింతలపూడిలో ఈ పధకం కింద రూ. 10 కోట్ల విలువైన పనులుచేపట్టామన్నారు.

అధికార్లు, ఉద్యోగులపై నిఘా నేత్రం

ఏలూరు, మే 15: ఇప్పుడు అన్ని స్ధాయిల అధికారులు, ఉద్యోగులపై నిఘా నేత్రం దృష్టి పడింది. అవినీతి అధికారుల వ్యవహారాలపై పూర్తిస్ధాయి ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి అమలుచేస్తున్న ప్రాజెక్టుల విషయంలో అయా అధికారులు, ఉద్యోగుల పనితీరును కూడా అంచనా వేస్తున్నారు. మరోవైపు కొన్ని ప్రభుత్వ పధకాల అమలులో చోటుచేసుకుంటున్న అవకతవకలపై కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఎక్కడా ఎటువంటి తేడా ఉన్నా దానిపై తక్షణ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. మొత్తంమీద రెండున్నరేళ్ల పాలన అనంతరం పరిపాలనా వ్యవస్ధ సాగుతున్న తీరుపై ప్రభుత్వం పూర్తిస్దాయిలో దృష్టి పెట్టింది.

అపర భగీరథుడు కాటన్

ఏలూరు, మే 15 : అపర భగీరధుడుగా పేరుగాంచిన సర్ ఆర్ధర్ కాటన్ జల స్ఫూర్తిని ఎంత కీర్తించినా తక్కువేనని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. లింగపాలెం మండలం అయ్యపరాజుగూడెంలో ఆదివారం కాటన్ 213వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సముద్రం పాలవుతున్న జీవ జలాలకు ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి కాలువ వ్యవస్థ ద్వారా నడక నేర్పించిన మహనీయుడు కాటన్ అన్నారు. గోదావరి జిల్లాలు సుభిక్షంగా వున్నారంటే దానికి కాటనే కారణమని పేర్కొన్నారు.

మూడు పథకాలపై ప్రభుత్వం దృష్టి:మంత్రి సుజాత

ఏలూరు, మే 15 : రాష్ట్రంలో నీటి ఎద్దడి నివారణ, భూగర్భజలాలు పెరిగేందుకు నీరు-ప్రగతి, పంట సంజీవని, నదుల అనుసంధానం వంటి మూడింటిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. ఆదివారం లింగపాలెం మండలం అయ్యప్పరాజుగూడెంలో నీరు-చెట్టు కింద 15 లక్షల రూపాయలతో చేపట్టిన తాళ్లచెరువు పూడికతీత పనులను రాష్ట్ర మంత్రి పీతల సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీరు-చెట్టు, పంట సంజీవని కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా వర్షాకాలంలో భూగర్భజలాలు మరింత పెరిగే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు.

వర్షాకాలంలోపే చెరువుల పూడికతీత

జంగారెడ్డిగూడెం, మే 15: నీరు-చెట్టు పథకం కింద వర్షాకాలం వచ్చేలోపే జిల్లాలో పెద్ద ఎత్తున చెరువుల పూడికతీత పనులు పూర్తి చేసి వర్షపు నీరు నిల్వ ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమ, భూగర్భ గనుల శాఖల మంత్రి పీతల సుజాత తెలిపారు. మండలంలోని అక్కంపేట గ్రామంలో నీరు-చెట్టు పథకం కింద పానకాల చెరువు పూడికతీత పనులను ఆదివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సుజాత పొక్లెయిన్ నడిపి చెరువులో మట్టిపూడిక తీసి ట్రాక్టర్‌లో లోడు చేయడం అందరినీ ఆకట్టుకుంది.

అందరి భాగస్వామ్యంతోనే ఆరోగ్యకర సమాజం:మంత్రి పైడికొండల

తాడేపల్లిగూడెం, మే 15: ఆరోగ్యకర సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. స్వచ్ఛ్భారత్ సందర్భంగా స్థానిక బస్టాండులో స్వచ్ఛ్భారత్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రత నైతిక బాధ్యత అన్నారు. పరిశుభ్రతతో అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు. 70 ఏళ్ల స్వాతంత్య్రంలో మహిళలు నిస్సిగ్గుగా బహిర్భూమికి వెళ్లి రావడం దురదృష్టకరమన్నారు. ప్రధాని మోదీ మహిళల ఆత్మగౌరవం కాపాడటానికి ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మించాలని నిర్ణయించారన్నారు.

వశిష్ఠ కప్ విజేతలు ఐసిఎఫ్, రామచంద్రపురం

నరసాపురం, మే 15: నరసాపురం ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన వశిష్ట బాస్కెట్‌బాల్ కప్‌ను పురుషుల విభాగంలో ఐసిఎఫ్ చెన్నై జట్టు, మహిళల విభాగంలో రామచంద్రపురం జట్లు కైవసం చేసుకున్నాయి. నాలుగురోజులుగా స్థానిక వైఎన్ కళాశాలలో నిర్వహించిన జాతీయస్థాయి పురుషులు, మహిళల బాస్కెట్‌బాల్ టోరీ ఆదివారం రాత్రి ముగిసింది. పురుషుల విభాగంలో ఐసిఎఫ్ చెన్నై, సౌత్ సెంట్రల్ రైల్వే జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఐసిఎఫ్ చెన్నై జట్టు 23-71 పాయింట్ల ఆధిక్యతతో విజయం సాధించింది. సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది.

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బిజెపి

గుడివాడ, మే 15: రాష్ట్రంలో బిజెపి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని, కార్యకర్తలు ఇందుకు మరింతగా కృషిచేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి అన్నారు. ఆదివారం స్థానిక బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీలో అందరినీ సమన్వయపర్చి గ్రామస్థాయి నుండి బలోపేతం చేస్తున్నామన్నారు. రాష్ట్భ్రావృద్ధికి బిజెపి సహకరిస్తోందని, ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు. రానున్న స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల్లో ఎలాంటి పొత్తులు లేకుండా పోటీ చేసేందుకు బిజెపి సిద్ధంగా ఉందన్నారు.

వైభవంగా శ్రీ వైకుంఠనాథస్వామి కల్యాణం

కూచిపూడి, మే 15: పండితుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల వాసుదేవ నామస్మరణల మధ్య శ్రీ, భూ, నీలా సమేత వైకుంఠనాథ స్వామివారి కల్యాణం ఆదివారం వైభవంగా జరిగింది. ముముక్షుజన మహాపీఠాధిపతులు శ్రీ ముత్తీవి సీతారాం గురుదేవులు - కమల దంపతులు, కోసూరు మురళీకృష్ణమాచార్యులు బ్రహ్మత్వంలో, ఆత్మకూరి లక్ష్మణదాసు పౌరోహిత్యంలో శ్రీ సీతారాం గురుదేవ దంపతులు శ్రీ, భూ, నీలా సమేత శ్రీరంగనాథులు, శ్రీ, భూ, నీలా సమేత శ్రీ వైకుంఠనాథస్వామి, శ్రీదేవి, భూదే వి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల కల్యాణాలను కన్నులపండువగా, శా స్త్రోక్తంగా నిర్వహించారు. ఈసందర్భం గా ఉదయం ఆశ్రమంలోని దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు జరిగాయి.

Pages