S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

12/31/2017 - 22:41

ప్రభుత్వేతర రంగంలోని పాఠశాలల యాజమాన్యాలవారు ప్రతి సంవత్సరం ‘శుల్కా’ల- ఫీజ్-ను పెంచడానికి వీలు కల్పించాలన్న ప్రతిపాదన సర్వజన సంక్షేమ స్ఫూర్తికి విరుద్ధం. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ బెంగళూరులో మంగళవారం చేసిన విద్యాసంబంధ ప్రసంగ స్ఫూర్తికి ఈ ‘విపరీత ప్రతిపాదన’ విఘాతకరం! అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం నియమించిన విద్యాశుల్కాల అధ్యయన సంఘం వారు ఈ విపరీతమైన ప్రతిపాదనను చేస్తున్నారు.

12/30/2017 - 01:05

యాదవ కులాల ప్రగతి కోసం, ఈ కులాల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు జరుపతలపెట్టిన పథకాలు ఆ కులాలకు మాత్రమే కాక తెలంగాణ గ్రామీణ ప్రజలందరికీ ప్రయోజనం కలిగించగలవు. వారంలో ఏడు రోజుల పొడవునా ప్రతిరోజు ఇరవై నాలుగు గంటలపాటు వ్యవసాయ రంగానికి విద్యుచ్ఛక్తిని సరఫరా చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన కూడ గ్రామీణ ప్రజల సమష్టిహిత సాధనకు దోహదం చేయగలదు! పాడి పంటలు వౌలికమైన సహజమైన ప్రగతికి ప్రాతిపదికలు.

12/29/2017 - 01:40

పెట్టుబడుల కోసం ప్రభుత్వం పడుతున్న ఆరాటం తీవ్రమైన వ్యామోహంగా మారిందనడానికి ఇది మరో నిదర్శనం! చిన్న మొత్తాలను వివిధ రకాల పొదుపు పథకాలలో జమ చేస్తున్న ఖాతాదారులకు లభిస్తున్న ‘వడ్డీ’ని కేంద్రప్రభుత్వం బుధవారం తగ్గించడం ఈ నిదర్శనం. ‘వడ్డీ’ శాతాలను తగ్గించాలన్నది ‘ప్రపంచీకరణ’ నెలకొల్పిన స్వేచ్ఛావాణిజ్య వ్యవస్థ - మార్కెట్ ఎకానమీ -లో నిహితమై ఉన్న అత్యాశ..

12/27/2017 - 21:23

అఫ్ఘానిస్థాన్‌లో చైనా వారి వ్యూహాత్మక దురాక్రమణ వేగవంతం అవుతుండడం మన దేశానికి ‘‘ఆందోళన కలిగించవలసిన’’ విపరిణామం! అఫ్ఘానిస్తాన్ అమెరికా, సోవియట్ రష్యాల మధ్య నడచిన ప్రచ్ఛన్న యుద్ధానికి రంగస్థలం కావడం రెండు దశాబ్దులకు పూర్వం నడచిన చరిత్ర! నాలుగు దశాబ్దుల క్రితం సోవియట్ రష్యా సేనలు చొరబడడంతో ఈ ప్రచ్ఛన్న యుద్ధం మొదలైంది.

12/27/2017 - 00:55

కులభూషణ్ జాధవ్ భార్య మెడలోని మంగళసూత్రాలను తొలగించారు, గాజులను బొట్టును కూడ!! కుల్‌భూషణ్ జాధవ్‌తో ఆయన తల్లి ఆయన భార్య జరిపిన సమావేశం సందర్భంగా జరిగిన ఈ ఘటనాక్రమం పాకిస్తాన్ ప్రభుత్వ జిహాదీ బీభత్స స్వభావాన్ని మరోసారి వికృతంగా ఆవిష్కరించింది. మనదేశపు నౌకాదళంలో పనిచేసిన తరువాత వ్యాపారం నిమిత్తం ఇరాన్‌కు వెళ్లిన జాధవ్‌ను పాకిస్తాన్ సైన్యం ఆపహరించుకొనిపోవడం చరిత్ర..

12/25/2017 - 23:06

ప్రజాప్రతినిధులలో నైతిక నిష్ఠను పెంపొందించడానికి జరుగుతున్న కృషి అట్టడుగు స్థాయి వరకు వ్యవస్థీకృతం అవుతుండడం ప్రజాస్వామ్య ప్రక్షాళనకు మరో సాక్ష్యం. పంచాయతీరాజ్, పురపాలక వ్యవస్థలను అవినీతి రాజకీయవేత్తల నుంచి, అక్రమాలకు పాల్పడేవారినుంచి విముక్తం చేయడానికి ‘తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం’ నడుం బిగించడం ముదావహం...

12/25/2017 - 00:34

బిహార్ మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రీయ జనతాదళ్ అధ్యక్షుడు లాలూప్రసాద్ యాదవ్‌కు వ్యతిరేకంగా దాఖలయిన మరో అవినీతి అభియోగం శనివారం ధ్రువపడడం ‘సామాజిక న్యాయసాధన’కు మరింత దోహదం చేయగల శుభ పరిణామం! 1990వ దశకంలో ఉమ్మడి బిహార్ ముఖ్యమంత్రిగా ఉండిన సమయంలో ‘పశువుల దాణా’ను ‘్భరీగా బొక్కేసిన’’ లాలూప్రసాద్ యాదవ్ అవినీతిపరుడన్నది బిహార్‌లోను దేశంలోను అత్యధికుల విశ్వాసం!

12/22/2017 - 23:57

జీవవైవిధ్యాన్ని విధ్వంసం చేస్తున్న కృత్రిమ ప్రగతి గురించి సమగ్ర సమీక్ష చేయడం తక్షణ ‘అనివార్యం’.. ఈ సమీక్షను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా చేపట్టవలసి ఉంది! పర్యావరణాన్ని ‘ప్రపంచీకరణ’ దారుణంగా గాయపరుస్తుండడం నడచిపోతున్న వైపరీత్యం! ప్రకృతి పరిరక్షణ చర్యలను చేపడుతున్న ప్రభుత్వాలు మరోవైపున ప్రకృతి విధ్వంసక పారిశ్రామిక విధానాన్ని కూడ మరింత ఉత్సాహంగా అమలు జరుపుతున్నాయి.

12/22/2017 - 20:59

‘రెండవ శ్రేణి దూరవాణి తరంగాల’ కేటాయింపులలో అవినీతికి అక్రమాలకు పాల్పడినట్లు అభియోగగ్రస్తులైన మాజీ కేంద్రమంత్రి ఎ.రాజా, పార్లమెంటు సభ్యురాలు కనిమొళి నిర్దోషులని ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం నిర్ధారించడం విస్మయకరమైన విపరిణామం! వీరిద్దరితోపాటుగా అభియోగగ్రస్తులైన మరో పదిహేడు మంది నిందితులు కూడ నిర్దోషులని న్యాయస్థానం తీర్పు చెప్పడం ఊహించని పరిణామం. కనిమొళి ‘ద్రవిడ మునే్నట్ర కజగం’ - ద్ర.ము.క.

12/20/2017 - 21:43

ఆహారం కల్తీ నిరోధించడానికై సర్వసమగ్ర ప్రణాళికను రూపొందించాలని హైదరాబాద్ ఉన్నత న్యాయస్థానం ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడానికి పెరుగుతున్న ‘రసాయన’ సాంకర్యం వికృత నేపథ్యం! ఉప్పు మొదలు పప్పుల వరకు, పాలు మొదలు పండ్ల వరకూ మనం తింటున్న సకలవిధ పదార్థాలను ఏదో ఒక విష రసాయనం కల్తీ చేస్తోంది.

Pages