S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/09/2020 - 02:18

పోట్చెఫ్‌స్ట్రూమ్, ఫిబ్రవరి 8: అండర్-19 ప్రపంచకప్‌లో భాగంగా నేడు జరిగే ఫైనల్‌లో యువ భారత జట్టు బంగ్లాదేశ్‌తో ఢీకొననుం ది. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి, పా యంట్ల పట్టికలో ముందు వరుసలో నిలిచిం ది. బంగ్లాదేశ్ సైతం ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించగా, పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయంది.

02/07/2020 - 06:47

లండన్: ఈ సీజన్ ఐపీఎల్‌కు ముందే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. గత రెండు సీజన్లలో జ ట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిం చిన జోఫ్రా ఆర్చర్ మోచేతి గా యం కారణంగా ఈ సీజన్ ఐపీఎల్ కు దూరమయ్యాడు. 2018లో ఐపీఎల్‌కు ఎంపికైన ఆర్చర్ గత రెండు సీజన్లలో కలిసి 26 వికెట్లు తీశాడు. మోచేయ గాయం కారణంగా ఇప్పటికే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్, శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే.

02/07/2020 - 06:50

దిమపూర్, ఫిబ్రవరి 6: రంజీట్రోఫీలో భాగంగా ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో నాగాలాండ్ జట్టుపై గోవా 229 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నెల 4న ప్రారంభమైన మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటిం గ్‌కు దిగిన గోవా మొదటి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైంది. వైభవ్ గోవెకర్ (71), స్మిత్ పటేల్ (66) అర్ధ సెంచరీలతో రాణించారు.

02/07/2020 - 06:44

ముంబయ, ఫిబ్రవరి 6: టీమిండియా సీనియర్ ఆటగా డు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై వస్తు న్న ఊహాగానాలకు తెరపడడం లేదు. ఇదే విషయమై సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ సైతం స్పందించాడు. సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా తన పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎమ్మెస్కే స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడాడు.

02/07/2020 - 06:40

పాకిస్తాన్-బంగ్లాదేశ్ జట్ల మధ్య నేటి నుంచి రావల్పిండి వేదికగా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లను ప్రాక్టీస్ కోసం పిండి స్టేడియానికి తరలించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీ భద్రత చర్యలను చేపట్టింది. పాక్ పర్యటనలో బంగ్లాదేశ్ ఇంకా రెండు టెస్టులతో పాటు, ఏకైక వనే్డ ఆడనుంది.

02/07/2020 - 06:52

అగర్తాలా: త్రిపురతో జరిగిన రంజీ మ్యాచ్‌లో జమ్మూ-కాశ్మీర్ 329 పరగుల తేడాతో భారీ విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి తొలి ఇన్నింగ్స్‌ను దిగిన జమ్మూ-కాశ్మీర్ జట్టు 329 పరుగులకు ఆలౌ టైంది. అబిద్ ముస్తాక్ (76, నాటౌట్), జియాద్ మగ్రే (66) అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం త్రిపుర తన తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే కుప్పకూలింది.

02/05/2020 - 23:31

హామిల్టన్, ఫిబ్రవరి 5: హమ్మయ్యా.. మొత్తానికి టీమిండియాతో జరిగిన మొదటి వనే్డలో సొంతగడ్డపై కివీస్ విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది. 348 పరుగులను ఛేదించడం న్యూజిలాండ్ జట్టుకు ఇదే మొద టిసారి కావడం విశేషం. దీంతో గత టీ20 సిరీస్‌ను 5-0 తేడా తో కోల్పోయన బ్లాక్‌క్యాప్స్ జట్టుకు ఈ గెలుపు ఊరట నిచ్చినట్లయంది.

02/05/2020 - 23:26

హామిల్టన్, ఫిబ్రవరి 5:
భారత్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (సీ) లాథమ్ (బీ) కొలిన్ డీగ్రాండ్ హోం 20, మయాంక్ అగర్వాల్ (సీ) టామ్ బ్లండెల్ (బీ) సౌథీ 32, విరాట్ కోహ్లీ (బీ) ఇష్ సోదీ 51, శ్రేయాస్ అయ్యర్ (సీ) శాంత్నార్ (బీ) సౌథీ 103, లోకేష్ రాహుల్ (నాటౌట్) 88, కేదార్ జాదవ్ (నాటౌట్) 26.
ఎక్స్‌ట్రాలు: 27 మొత్తం: 347 (50 ఓవర్లలో 4 వికెట్లకు..)
వికెట్ల పతనం: 1-50, 2-54, 3-156, 4-292

02/05/2020 - 23:41

*చిత్రం...కోల్‌కతాలో జరుగుతున్న సీనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌కు హాజరై పోటీలను ఆసక్తిగా పరిశీలిస్తున్న ప్రపంచ మాజీ చాంపియన్ మీరాబాయ చాను

02/05/2020 - 23:21

పటియాల, ఫిబ్రవరి 5: రంజీట్రోఫీలో భాగంగా ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్రా జట్టుపై పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు మంగళవారం మొదటి ఇన్నింగ్స్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా 97 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. అదేరోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ సైతం 108 పరుగులకే ఆలౌటై 11 పరుగుల ఆధిక్యం సంపాందించింది.

Pages