S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/05/2020 - 00:55

పాకిస్తాన్‌తో మంగళవారం జరిగిన అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో విజయం సాధించిన అనంతరం సెల్ఫీ దిగుతున్న టీమిండియా ఆటగాళ్లు. ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుచేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది

02/04/2020 - 23:43

పొచెస్‌ట్రూమ్ (దక్షిణాఫ్రికా), ఫిబ్రవరి 4: అండర్-19 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో యువ భారత్ అద్భుతం చేసింది. ప్రత్యర్థి జట్టుపై అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో ఏకపక్షంగా ఆధిపత్యం చెలాయంచి సగర్వంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన సెమీ ఫైనల్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దాయాది జట్టును టీమిండియా బౌలర్లు హడలెత్తించారు. నిప్పులు చెరిగే బంతులు వేసి వారిని కట్టడి చేశారు.

02/04/2020 - 23:41

హామిల్టన్, ఫిబ్రవరి 4: న్యూజిలాండ్ జట్టును సొంత గడ్డపై టీ20 సిరీస్‌లో వైట్‌వాష్ చేసిన భారత్ నేటి నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో తలపడనుంది. పొట్టి ఫార్మాట్ లో తిరుగులేని కోహ్లీసేన అదే ఉత్సాహంతో బరిలోకి దిగ నుండగా, కివీస్ మాత్రం స్వదేశంలో పరువు నిలుపు కునేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమం లో నేటి నుంచి జరిగే వనే్డ సిరీస్ న్యూజిలాండ్ జట్టుకు ప్రతిష్టాత్మకంగా మారింది.

02/04/2020 - 23:38

పటియాల, ఫిబ్రవరి 4: రంజీట్రోఫీ 2019-20లో భాగంగా మంగళవారం పంజాబ్-ఆంధ్రా జట్ల మధ్య ప్రారంభమైన మ్యాచ్‌లో ఒకేరోజు 24 వికెట్లు పడ్డాయ. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు ఆంధ్రా జట్టు 97 పరుగులకు కుప్పకూలింది. జట్టులో బోడపాటి సుమంత్ (22) అత్యధిక స్కోరర్‌గా నిలవగా, కేవీ శశికాంత్ (20), షోయాబ్ మహ్మద్ ఖాన్ (16, నాటౌట్), కరణ్ షిండే (16), కెప్టెన్ రికీ భుయ్ (11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు.

02/04/2020 - 06:16

దుబాయ్: భారత జట్టు న్యూజీలాండ్ పర్యటనలో 5-0 తేడాతో టీ 20 సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో ఆల్ రౌండ్ ప్రతిభతో విశేషంగా ఆకట్టుకున్న యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానానికి ఎగబాకాడు. సోమవారం విడుదలైన ఈ తాజా జాబితాలో రాహుల్ తన కెరీర్ బెస్ట్ స్థానానికి చేరి ప్రశంసలందుకున్నాడు.

02/03/2020 - 23:30

పోచఫ్‌స్ట్రూమ్ (దక్షిణాప్రికా), ఫిబ్రవరి 3: అండర్-19 ప్రపంచ కప్ పోటీల్లో నాలుగు సార్లు చాంపియన్లుగా నిలిచిన భారత జూనియర్ క్రికెట్ జట్టు ఈ దఫా మళ్లీ ఫైనల్స్‌కు చేరుకునేందుకు తహతహలాడుతోంది. ఈక్రమంలోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుతో మంగళవారం తొలి సెమీ ఫైనల్‌లో తలపడుతోంది. ఈ టోర్నీలో మొత్తం సెమీస్‌కు నాలుగు జట్లు చేరుకున్న సంగతి తెలిసిందే.

02/03/2020 - 23:29

ఢాకా, ఫిబ్రవరి 3: బంగ్లాదేశ్ ఎడమచేతి బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ పస్ట్‌క్లాస్ క్రికెట్‌లోత్రిపుల్ సెంచరీ సాధించడం ద్వారా టెస్టు జట్టులోకి పునరాగమన అవకాశాలను ఖాయం చేసుకున్నాడు. ఆదివారంతో ముగిసిన ఈ మ్యాచ్‌లో 334 పరుగులు సాధించిన తమీమ్ బంగ్లాదేశ్ గడ్డపై ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.

02/03/2020 - 23:29

ముంబయి, ఫిబ్రవరి 3: న్యూజీలాండ్ గడ్డపై భారత్ సాధించిన టీ 20 సిరీస్ 5-0 విజయం ఒక ‘గొప్ప లక్ష్య సాధన’గా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ అభివర్ణించాడు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్‌డే సిరీస్‌లోనూ భారత జట్టు అదే ఊపును కొనసాగించాలని సూచించాడు. అన్ని రంగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు న్యూజీలాండ్‌ను ‘వైట్‌వాష్’ చేసిందని జహీర్ కొనియాడాడు.

02/02/2020 - 23:58

వౌంట్‌మాంగూనీ, ఫిబ్రవరి 2: అంతా అనుకున్నట్లుగానే భారత్ చేతిలో సొంతగడ్డపై న్యూజిలాండ్ జట్టు వైట్‌వాష్‌కు గురైంది. ఆదివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ (2) రెండో ఓవర్‌లోనే కుగ్లీజైన్ బౌలింగ్‌లో పెవలియన్‌కు చేరాడు.

02/02/2020 - 23:56

*చిత్రం... ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రియా ఆటగాడు డొమినిక్ థీమ్‌పై విజయం సాధించి నార్మన్ బ్రూక్స్ చాలెంజ్ కప్‌ను గెలుచుకున్న సెర్బియా క్రీడాకారుడు నోవాక్ డికోవిచ్.

Pages