S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

08/25/2018 - 23:29

నా దృష్టి పసిడిమీద కాదు, 21మీటర్ల అవతలవున్న లక్ష్యం మీదే. రికార్డు దూరం షాట్‌పుట్ విసరాలన్న బలం ఈసారి సరిపోలేదు. జాతీయ రికార్డు తిరగరాసినందుకు సంతృప్తిగా ఉంది. ఎన్నో త్యాగాల ప్రతిఫలమిది. గత రెండేళ్లుగా నాన్న క్యాన్సర్‌తో బాధ పడుతున్నా, ఆ బాధ నావరకూ కుటుంబం రానివ్వలేదు. స్నేహితులే సొంత కొడుకుల్లా బాధ్యత నిర్వర్తించారు.

08/26/2018 - 03:24

జకార్తా: మారథాన్ ఫైనల్స్‌లో జపాన్ అథ్లెట్ హిరోటో ఇనోయు తనను తోసేసి పసిడి సాధించుకున్నాడంటూ బెహ్రెయిన్ అథ్లెట్ ఎల్హస్సన్ ఎలబ్బాసి ఆసియా నిర్వాహకులకు ఫిర్యాదు చేశాడు. రేస్‌లో చివరి వంద మీటర్లు అధిగమించే సమయంలో ఓవర్‌టేక్ చేస్తున్న తనను హిరోటో గెంటివేశాడని, ట్రాప్‌పై నిలదొక్కుకుని రేస్ పూర్తి చేయగలిగానని ఫిర్యాదు చేశాడు. ‘హిరోటో నన్ను గెంటివేశాడు.

08/25/2018 - 00:49

పాలెంబాగ్, ఆగస్టు 24: 18వ ఆసియా గేమ్స్‌లో భారత రోవర్లు చారిత్రక విజయాలు నమోదు చేశారు. రోయింగ్ రేస్ చివరి రోజు పురుషుల క్వాడ్రుపుల్ స్కల్స్‌లో స్వర్ణం సాధిస్తే, లైట్‌వెయిట్ స్కల్స్ పురుషుల డబుల్స్, సింగిల్స్‌లో కాంస్యాలను సొంతం చేసుకుని భారత ఆర్మీ పట్టు ఎంత బలమైనదో ప్రపంచానికి చాటిచెప్పారు. ‘రేపన్నది లేదు.

08/25/2018 - 00:46

6 రోజుల్లో భారత్ సాధించిన పతకాలు
*
స్వర్ణం 06
రజతం 05
కాంస్యం 14
మొత్తం 25
*
చిత్రం..హీనా సిధు

08/25/2018 - 00:44

పాలెంబాగ్, ఆగస్టు 24: టెన్నిస్ టాప్‌సీడ్స్ రోహన్ బొపన్న, దివిజ్ శరణ్‌లు శుక్రవారం అద్వితీయ విజయంతో పసిడి సాధించారు. 52 నిమిషాల అలుపెరగని ఆటతో కజకిస్తాన్ ఆటగాళ్లు అలెగ్జాండర్ బబ్లిక్, డెనిస్ యెవ్సెయేవ్‌లను 6-3, 6-4 సెట్లతో మట్టికరిపించారు. భారత ఆటగాడు బోపన్న అటాకింగ్ సర్వీసుల ముందు కజకిస్తాన్ ఆటగాళ్లు నిలవలేకపోయారు. రెండో గేమ్‌లోనూ కజక్ ఆటగాళ్ల ప్రయత్నాలు భారత ద్వయం ముందు సాగలేదు.

08/25/2018 - 00:42

జకార్తా, ఆగస్టు 24: సంప్రదాయక క్రీడ కబడ్డీలో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న భారత్‌కు ఆసియా గేమ్స్‌లో బలమైన ఎదురు దెబ్బ తగిలింది. సెమీ ఫైనల్స్‌లో పురుషుల, మహిళల జట్లు రెండూ ఇరాన్ చేతిలో ఖంగుతిని ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాయి. శుక్రవారం చారిత్రక అపజయాల పరాభవంతో ఆసియా గేమ్స్‌నుంచి భారత కబడ్డీ నిష్క్రమించక తప్పలేదు.

08/25/2018 - 00:15

18వ ఆసియా గేమ్స్‌లో భారత్ పసిడి వేటను భారంగానే సాగిస్తోంది. ఒలింపిక్ హెవీవెయిట్ చైనా 66 స్వర్ణాలను కైవసం చేసుకుంటే, భారత్ ఆరో రోజు రెండు స్వర్ణాలు సాధించి ఆరు రోజుల్లో ఆరు పసిడి పతకాలకు పరిమితమైంది. శుక్రవారం భారత సైన్యం తరఫున రోయింగ్ రేస్‌లోకి దిగిన జట్టు అత్యద్భుత ప్రదర్శనతో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది.

08/24/2018 - 04:49

న్యూఢిల్లీ: విలువిద్య భారత చరిత్రలో అంతర్భాగమని అందరికీ తెలుసు. పురాణాల్లో, ఇతిహాసాల్లో ఈ విద్యకు సముచిత స్థానం ఉంది. కానీ, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు మాత్రం ఆర్చరీపై ఏ మాత్రం నమ్మకం లేదు. అందుకే ఆర్చర్లలో ఎవరికీ ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ (టాప్)లో చోటు కల్పించలేదు. అన్ని క్రీడలను సమ దృష్టితో చూసి, అందరినీ ప్రోత్సహించాల్సిన ప్రభుత్వమే కొన్ని క్రీడలకు మాత్రమే పరిమితం కావడం దురదృష్టకరం.

08/24/2018 - 00:19

పాలెంబంగ్, ఆగస్టు 23: ఇండోనేషియాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలో మరో రజతం చేరింది. గురువారం జరిగిన షూటింగ్ విభాగం డబుల్స్ ట్రాప్‌లో మన దేశానికి చెందిన 15 ఏళ్ల యువ సంచలనం శార్దూల్ విహాన్ రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ టీనేజర్ విహాన్ డబుల్స్ ట్రాప్‌లో మొత్తం 73 షాట్‌లతో ఈ పతకాన్ని అందుకున్నాడు.

08/24/2018 - 00:17

పాలెంబంగ్, ఆగస్టు 23: భారత టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్‌లో చైనా క్రీడాకారిణి జాంగ్ షూయ్‌తో పోటీ పడిన అంకిత 4-6, 6-7 (6)తో ఓటమితో కాంస్యతో సరిపెట్టుకుంది. 25 ఏళ్ల అంకిత రైనా ఆసియా క్రీడల్లో మహిళల సింగిల్స్ టెన్నిస్‌లో పతకం అందుకున్న రెండో భారత క్రీడాకారిణిగా ఘనత దక్కించుకుంది.

Pages