S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/17/2020 - 23:19

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 17: న్యూజిలాండ్ సీనియర్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ భారత్‌తో ఈ నెల 21 నుంచి ప్రారంభమ య్యే టెస్టు సిరీస్‌కు తిరిగి జట్టులో చేరాడు. గత ఆస్ట్రేలి యా పర్యటనలో బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా గాయప డ్డ బౌల్ట్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు తన ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో జట్టుతో కలిశాడు.

02/17/2020 - 23:16

భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఈ ఏడాది తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో అమెరికాలో జరిగిన కెయన్స్ కప్ చెస్ టోర్నమెంట్‌లో విజయం సాధించింది. తొమ్మిది రౌండ్ల టోర్నీలో హంపి ఆరు పాయింట్లు సాధించి, మరో రౌండ్ మిగిలి ఉండగానే టైటిల్ సొంతం చేసుకోవడం విశేషం.

*చిత్రం... కోనేరు హంపి

02/17/2020 - 23:13

*చిత్రం... సిడ్నీలో ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే మహిళల టీ20 ప్రపంచకప్ సందర్భంగా టోర్నీలో పాల్గొంటున్న
10 జట్ల కెప్టెన్లు సోమవారం ఫొటోలకు ఫోజులిచ్చారు.

02/17/2020 - 05:09

హామిల్టన్: టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ ప్రారంభంలో ముందుగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌కు దిగి తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకే కుప్పకూలింది. హనుమ విహారి (101), చతేశ్వర్ పుజారా (93)లు మాత్రమే రాణించారు. స్కాట్ కుగ్లిజైన్, ఇష్ సోదీ చెరో మూడు వికెట్లు తీసుకోగా, జాక్ గిబ్సన్ 2, జేమ్స్ నీషమ్ 1 వికెట్ పడగొట్టారు.

02/17/2020 - 05:07

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: రానున్న ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా డే నైట్ టెస్టు ఆడే అవకాశం కనిపిస్తోంది. బీసీసీఐ అధికారులు చెప్పిన ప్రకారం ఈ ఏడాది చివర్లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరగాల్సి ఉంది. అందులో ఒక టెస్టును బ్రిస్బేన్స్ లేదా అడిలైడ్ వేదికగా డే నైట్ మ్యాచ్‌గా నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

02/17/2020 - 05:06

దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ మధ్య ఆదివారం జరిగిన మూడో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 6 వికెట్లు కోల్పోయ 222 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ జట్టు మరో 5 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.

02/17/2020 - 05:04

రాంచీలో జరిగిన 7వ జాతీయ రేస్/వాక్ చాంపియన్‌షిప్స్ 2020లో భాగంగా నేషనల్ రికార్డు సాధించి బంగారు పతకం సాధించిన భావ్నా జాట్. ఈ రికార్డుతో పాటు భావ్నా 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్ సైతం అర్హత సాధించింది.

02/17/2020 - 05:01

టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ బెంగళూరులోని కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్‌లో ఆదివారం జరిగిన
ఏటీపీ చాలెంజ్ టూర్‌లో భాగంగా భారత్‌లో తన చివరి మ్యాచ్ ఆడిన తర్వాత అతడిని సత్కరిస్తున్న మాజీ అథ్లెట్లు.

02/16/2020 - 02:31

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అధ్యక్షతన ఆదివారం ఇక్కడ సమావేశం కానున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) పాలక మండలి సమావేవం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏర్పడిన భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ)కు నిధుల కేటాయింపు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వస్తుందని అంటున్నారు.

02/16/2020 - 02:29

మాస్కో, ఫిబ్రవరి 15: నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్టు డోపింగ్ పరీక్షలో తేలడంతో రష్యాకు చెందిన బియాథ్లెట్ యెవ్‌గెనీ ఉత్యుగొవ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అంతేగాక వింటర్ ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణ పతకాన్ని అతను కోల్పోనున్నాడు. 34 ఏళ్ల ఉత్యుగొవ్ 2014 సోచీ వింటర్ ఒలింపిక్స్ రిలే ఈవెంట్‌లో పాల్గొని స్వర్ణ పతకాన్ని సాధించాడు.

Pages