S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

07/22/2018 - 00:53

బెంగళూరు: బెంగళూరులో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో భారత పురుషుల హాకీ జట్టు న్యూజిలాండ్‌పై రెండో ఘన విజయం నమోదు చేసింది. ట్రై సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును పూర్తిగా కట్టడి చేసిన భారత్ 3-1 స్కోరు సాధించి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

07/22/2018 - 00:43

బెర్లిన్, జూలై 21: ఆర్చరీ ప్రపంచ కప్ టోర్నీలో స్వర్ణానికి గురిపెట్టిన భారత్ రజితం, కాంస్యంతో సరిపెట్టుకుంది. పతకాలు రెండూ నాల్గవ దశలో కాంపౌండ్ విభాగంలోనే దక్కాయి. భారత మహిళా కాంపౌండ్ జట్టు మరోసారి ఫైనల్స్‌ను అధిగమించలేక రజిత పతకంతో సరిపెట్టుకుంది. ఫైనల్ పోరులో స్వర్ణం సాధించడం ఖాయమనుకున్న తెలుగమ్మాయి వనె్నం జ్యోతి సురేఖ చివరకు నిరాశనే మిగిల్చింది.

07/22/2018 - 00:12

వడోదర, జూలై 21: పోల్‌వాల్ట్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువ అథ్లెట్ రాకేష్ గోండ్ సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పాడు. 15వ జాతీయ యూత్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ టోర్నీలో తన అద్భుత ప్రదర్శనతో రాకేష్ గోండ్ స్వర్ణాన్ని చేజిక్కించుకున్నాడు. 2017లో కన్హియ్య సింగ్ పేరిట నమోదైన 4.75 మీటర్ల రికార్డును తిరగరాసిన రాకేష్ గోండ్ 4.90 మీటర్లను అధిగమించి సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పడం గమనార్హం.

07/22/2018 - 00:11

న్యూఢిల్లీ, జూలై 21: ఆసియన్ జూనియర్ చాంపియన్‌షిప్ టోర్నీలో భారత రైజింగ్ షట్లర్, ఆరో సీడ్ లక్ష్య సేన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. జకర్తాలో శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇండోనేసియా నాల్గవ సీడ్ ఇక్సన్ లియోనార్డో ఇమ్మాన్యుయెల్ రుంబేను మట్టికరిపించాడు. అటాకింగ్ గేమ్‌తో రుంబేను పూర్తిగా కట్టడి చేసిన లక్ష్య 21-7, 21-14 స్కోరుతో రెండు సెట్లు కైవసం చేసుకుని ఫైనల్‌కు చేరాడు.

07/22/2018 - 00:10

న్యూఢిల్లీ, జూలై 21: భుజం గాయంతో బాధ పడుతున్న వృద్ధిమాన్ సాహాకు జూలై చివరివారం లేదా ఆగస్టు మొదటివారంలో మాంచెస్టర్‌లో శస్తచ్రికిత్స నిర్వహించనున్నట్టు బీసీసీఐ శనివారం ప్రకటించింది. ‘వృద్ధిమాన్ సాహా పోస్టెరోసుపీరియర్ లాబ్రాల్ టియర్‌తో బాధ పడుతున్నాడు. జూలై చివరివారం లేదా ఆగస్టు తొలివారంలో లండన్‌లోని మాంచెస్టర్‌లో అతని భుజానికి శస్తచ్రికిత్స నిర్వహిస్తారు.

07/21/2018 - 05:12

లండన్: మహిళల హాకీ ప్రపంచకప్ సంరంభం నేటినుంచి మొదలవుతోంది. నాలుగు గ్రూపుల్లో 16 దేశాలు ప్రపంచకప్ బరిలోకి దిగుతున్నాయి. అప్రతిహత విజయాలతో పరుగులు తీస్తోన్న భారత్‌కు ప్రపంచకప్ మాత్రం అగ్నిపరీక్షే. బలమైన జట్లు తమ సత్తా చాటేందుకు బరిలోకి దిగుతుంటే, టోర్నీలో తొలి విజయం నమోదు చేస్తామన్న ధీమాతో భారత్ మైదానంలోకి దిగుతోంది. లండన్ వేదికగా మొదలవుతోన్న ప్రపంచకప్ సమరం ఆగస్టు 5న ఫైనల్స్‌తో ముగుస్తుంది.

07/21/2018 - 00:32

క్వీన్స్, జూలై 20: అంతర్జాతీయ వనే్డల్లో పాక్ ఓపెనర్లు పఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్‌లు ఆల్‌టైం రికార్డు సాధించారు. అత్యధిక భాగస్వామ్యం సాధించిన ఓపెనర్లుగా జమాన్, ఇమామ్‌లు శుక్రవారం సరికొత్త రికార్డు నెలకొల్పారు. బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేతో ఆడిన నాలుగో వనే్డలో పాక్ ఓపెనర్లు పరుగుల వరదే సృష్టించారు.

07/21/2018 - 00:30

న్యూఢిల్లీ, జూలై 20: ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమ్ డబ్ల్యుటీపీ టెన్నిస్ టోర్నమెంట్ సెమీ ఫైనల్‌కు భారత టెన్నిస్ ఆటగాడు రాంకుమార్ రామనాథన్ చేరుకున్నాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో వరల్డ్ 161 ర్యాంకర్ రామనాథన్ 7-5, 6-2 స్కోరుతో ప్రత్యర్థి, కెనడాకు చెందిన వాసిక్ పోస్పిసీల్‌పై విజయం సాధించాడు.

07/21/2018 - 00:30

న్యూఢిల్లీ, జూలై 20: కేంద్ర కేబినెట్ తాజా ప్రతిపాదనలను భారత ఒలింపిక్ సమాఖ్య (ఐఓఏ) తిప్పికొట్టింది. కొన్ని ప్రత్యేక క్రీడలకు సంబంధించి ఎంపిక నిబంధనలను సరళీకరించటం సాధ్యం కాదని తెగేసి చెప్పింది.

07/20/2018 - 01:25

న్యూఢిల్లీ: ఇంగ్లాండ్‌తో ఆగస్టు 1 నుంచి జరిగే ఐదు టెస్టు మ్యాచ్‌లలో తొలి మూడు మ్యాచ్‌లలో తనకు చోటుదక్కకపోవడంపై టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ స్పందించాడు. ‘సూర్యుడు మళ్లీ రేపు ఉదయిస్తాడు’ అంటూ భారత్ జట్టులో చోటు దక్కకున్నా మళ్లీ అవకాశం వస్తుందంటూ పరోక్షంగా వ్యాఖ్యానిస్తూ ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు.

Pages